case booked
-
రైతుబిడ్డకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే... ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
మగవారూ... భాష జాగ్రత్త
గతంలో ఎం.ఎల్.ఏ అయిన ఒక పెద్ద హీరో స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడి అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చాడు. డెబ్బయి ఏళ్లు దాటిన ఒక సీనియర్ నటుడు నోరు పారేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న మరో నటుడు స్త్రీల దుస్తుల గురించి సుద్దులు చెప్పి నిరసన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. సెలబ్రిటీలుగా ఉన్నవారు ఎంతో బాధ్యతగా ఉండి యువతకు మార్గం చూపేలా ఉండాలి. వారు ఇలా తగలడితే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో ఇంటినే బడిగా మార్చి తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటి ఆడవారికి తండ్రి, భర్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారా అనేది ప్రశ్న. అతడో ప్రసిద్ధ నటుడు. ‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’ అంటుంటాడు. కాని ఒక సభలో అభిమానులను చూసి పూనకం వచ్చి స్త్రీల గురించి అశ్లీలమైన వ్యాఖ్యలు చేశాడు. వందల సినిమాల్లో తండ్రిగానో బాబాయిగానో వేసిన ఒక నటుడు ‘స్త్రీల మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని సభలో యాంకర్ అడిగితే పరమ రోతగా సమాధానం ఇచ్చాడు. ఇక నటుడుగా, రియల్టర్‌గా గుర్తింపు పొందిన మరో పెద్ద మనిషి పార్లమెంట్ మెంబర్ అయ్యాక పార్లమెంట్లో నిలబడి మరీ ‘స్త్రీల దుస్తుల వల్లే వారికి సమస్యలు వస్తున్నాయి’ అన్నాడు. స్త్రీలను ఏదో ఒకటి అనేయొచ్చు, అంటే వాళ్లు పడతారు, అనడానికే మేము పుట్టాము అనే చులకనభావం పురుష సమాజంలో నరనరాన జీర్ణించుకుని పోబట్టే ఈ ప్రతిఫలాలు. అదృష్టవశాత్తు ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే నిరసన పెల్లుబుకుతున్నా పురుషుల నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల త్రిషతో ‘లియో’ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆమె హీరోయిన్ అని తెలిశాక (గత సినిమాల్లో తాను చేసిన) బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఇది సినిమా లాంగ్వేజ్’ అని మన్సూర్ అనుకుని ఉండొచ్చుగాని దానిలోని అశ్లీల ధ్వనికి త్రిష రియాక్ట్ అయ్యింది. ‘ఇతనితో ఇంకెప్పుడూ సినిమాల్లో నటించను’ అని చెప్పింది. ఆ తర్వాత చినికి చినికి గాలివానై ఇప్పుడు మన్సూర్ మీద కేసు బుక్ అయ్యేంతగా వెళ్లింది. మగవాళ్లు ‘సరదాగా మాట్లాడుతున్నామని’ అనుకుంటూ కూడా స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. సరదాగా కించపరచడం ఏమిటో... కించపరచడం ఎలాంటి సరదానో వీరే చెప్పాలి. ► ప్రసిద్ధులే దారి తప్పితే రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు... ఇలా సమాజంలో గుర్తింపు పొందినవారు స్త్రీల పట్ల మరింత గౌరవంతో మెలగుతూ ఆదర్శంగా నిలవాలి. కాని చాలాసార్లు రాజకీయ నాయకుల దగ్గరి నుంచి అన్ని రకాల ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో చులకన మాటలు మాట్లాడుతూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిలో మంత్రులు ‘మేం వేసిన రోడ్లు ఫలానా హీరోయిన్ బుగ్గల్లా ఉంటాయి’ అంటూ వదరుతుంటారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ వీరుడిగా నటించి ‘ఈ సినిమాలో కుస్తీలు చేస్తే రేప్ జరిగినంత పనయ్యింది నాకు’ అని వ్యాఖ్యానించి మొట్టికాయలు తిన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్న నటిపై దారుణమైన వ్యాఖ్యలు చేసి కోర్టు కేసును ఎదుర్కొనబోతున్నాడు. ► బాల్యం నుంచి భావజాల ప్రభావం ‘కుటుంబంలో తండ్రి (మగాడు) ముఖ్యం’ అనే భావన బాల్యం నుంచి పిల్లల్లో ఎక్కించడం ద్వారా పురుష సమాజం తన ఆధిక్యతను స్త్రీలపై ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తుంది. తండ్రిని ‘మీరు’ అని, తల్లిని ‘నువ్వు’ అని అనడంలో ప్రేమ, గౌరవం, దగ్గరితనం ఉన్నా ‘నువ్వు’ అనడం వల్ల ‘లెక్క చేయవలసిన పని లేదు’ అనే భావన కలిగితే కష్టం. తిట్లు, బూతులు అన్నీ స్త్రీలను అవమానించేవే. వాటిని విని, పలికి స్త్రీల పట్ల అలా మాట్లాడవచ్చు అనుకుంటారు మగవారు. ఇంట్లో చెల్లెని, అక్కని, తల్లిని తండ్రి అదుపు చేసే తీరు చూసి, తామూ బయట స్త్రీలను అలాగే అదుపు చేయవచ్చనుకుంటారు. ఫైటర్ జెట్స్‌ను స్త్రీలు నడుపుతున్న ఈ కాలంలో కూడా ‘మేమేమీ గాజులు తొడుక్కోలేదు’, ‘మూతి మీద మీసముంటే రా’లాంటి పౌరుష వచనాలను పురుషులు ఇంకా పలికేటంత వెనుకబాటుతనంలో ఉండటం విషాదకరం. శారీరక పరిమితులు ఉన్నంత మాత్రాన స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు కాబోరు. ► తల్లిదండ్రులూ జాగ్రత్త అబ్బాయిలను ఆడపిల్లలను గౌరవించేలా పెంచడం, టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం ఇప్పటి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం. చట్టాలు పకడ్బందీగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలిసో తెలియకో అహంకారంతోనో పరుష వ్యాఖ్య, అసభ్య చేష్ట నేరుగా కాని సోషల్ మీడియాలోగాని చేస్తే వారు ప్రమాదంలో పడతారని హెచ్చరించాలి. చైతన్యం పెరిగింది. అబ్బాయిలూ భాష జాగ్రత్త. -
పామును చంపినందుకు పోలీసు కేసు.. పరారీలో నిందితుడు
లఖ్‌నవూ: పాము, తేలు వంటి విషపురుగులు కనిపిస్తే ఎవరైనా భయంతో పరుగులు పెడతారు. చాలా వరకు గ్రామాల్లో పాములు, తేళ్లు కనిపిస్తే చంపేస్తారు. అవి కాటు వేస్తే ప్రమాదం కనుక చంపటం తప్పేమి కాదని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా అనుకుంటే పొరపాటే. అలాగే ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిందని పామును చంపేశాడు. పోలీసులు కేసు పెట్టడంతో అవాక్కయ్యాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పత్ జిల్లాలో జరిగింది. ఛప్రౌలి ప్రాంతంలోని షాబ్గా గ్రామంలో ఆదివారం రాత్రి రామ్ చరణ్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ పాము ప్రవేశించింది. దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు గుమిగూడారు. స్వలీన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి పామును చంపేశాడు. ఈ విషయంపై సోమవారం ఉదయం అటవీ శాఖకు సమాచారం అందింది. ఫారెస్ట్ గార్డ్ సంజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వలీన్‌పై అటవీ జంతువుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. పెద్ద వస్తువుతో పామును నుజ్జు నుజ్జు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, పాము మృతికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?! -
కొంపముంచిన స్కిట్ బండి సంజయ్ కు షాక్..!!
-
వైద్యం ముసుగులో అసభ్యకర చేష్టలు.. 48 మంది మహిళా రోగులతో..
సాక్షి, న్యూఢిల్లీ: అతనో వైద్యుడు.. రోగుల బాగోగులు చూసి ధైర్యం చెప్పాల్సిందిపోయి వారితోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చిన మహిళా పేషెంట్లతో విచక్షణ మరచి మృగంలా వ్యవహరించాడు. వారికి ముద్దులు పెడుతూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన స్కాట్లాండ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన డాక్టర్ కృష్ణ సింగ్(72) మహిళా పేషెంట్లతో అనుచితంగా వ్యవహరించాడు. స్కాట్లాండ్లో బీపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కృష్ణ సింగ్.. తన కేరీర్‌లోని 35 ఏండ్లలో సుమారు 48 మంది మహిళా రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. తన వద్దకు వచ్చిన మహిళా పేషంట్స్‌కు ముద్దులు ఇవ్వడం, నెమరడం, అనవసరమైన పరీక్షలు చేయించడం, అసభ్య వ్యాఖ్యలు చేశారు. 1983 నుంచి 2018 మధ్య కాలంలో మహిళా రోగులతో డాక్టర్ కృష్ణ సింగ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్త్ లనార్క్‌షైర్‌లో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మహిళా రోగులను సదరు డాక్టర్ లైంగికంగా వేధించినట్లు గ్లాస్గోలోని హైకోర్టులో ప్రాసిక్యూటర్ ఏంజిలా గ్రే వాదించారు. కాగా, 2018లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డాక్టర్ ప్రవర్తనపై విచారణ ప్రారంభించారు. మొత్తం 54 అభియోగాల్లో కృష్ణ సింగ్ దోషిగా తేలాడు. ఇదిలా ఉండగా పేషెంట్లు చేసిన ఫిర్యాదులను సింగర్ తప్పుపట్టారు. ఇండియాలో వైద్య శిక్షణ తీసుకున్న సమయంలో ఆ పరీక్షల గురించి నేర్చుకున్నట్లు సదరు డాక్టర్ చెప్పడం గమనార్హం. విచారణ అనంతరం ఈ కేసులో తీర్పును వచ్చే నెలకు వాయిదా వేశారు. -
సినిమా టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో, ఐనాక్స్‌లపై కేసు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సినిమా టికెట్లను 100 శాతం ఆన్లైన్లోనే విక్రయిస్తున్న ఆరోపణలపై బుక్ మై షో పోర్టల్‌తో పాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ ఫిర్యాదు మేరకు శనివారం నమోదైన ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 2006లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నెం.47) ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించి సగం టిక్కెట్లను నేరుగా, మిగిలిన సగం ఆన్లైన్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే బుక్ మై షో, ఐనాక్స్‌లు 100 శాతం టికెట్లను ఆన్లైన్లోనే అమ్ముతున్నాయనేది విజయ్ గోపాల్ ఆరోపణ. ఈ మేరకు ఆయన సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే -
బీర్భూమ్పై సీబీఐ విచారణ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లాలోని బోగ్తూయి గ్రామంలో 10 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడంతో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సజీవ దహనాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అనారుల్ హుస్సేన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం డిమాండ్ చేశారు. -
టీడీపీ మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజుపై కేసు నమోదు
పిచ్చాటూరు (చిత్తూరు): లారీ సహా 7.5 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం లారీ, నిందితులను సత్యవేడు సీఐ శివకుమార్‌రెడ్డి, నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాగలాపురం మీదుగా తమిళనాడుకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. నందనం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో మాటు వేశారు. చెన్నై వైపు వెళ్తున్న లారీ (ఏపీ03టీబీ2444)ని తనిఖీ చేయగా 150 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు) రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న పిచ్చాటూరు మండలం కీళపూడికి చెందిన రఘు (46) అనే వ్యక్తిని పోలీసులు పట్టుకోగా అదే గ్రామానికి చెందిన తంగరాజ్ అనే మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వ్యక్తిని విచారించగా లారీ, బియ్యం టీడీపీ మాజీ ఎంపీపీ భర్త డి.పద్మనాభరాజుకు చెందినవిగా వివరించాడు. లారీ సహా బియ్యాన్ని నాగలాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రఘురామయ్య, తంగరాజ్లతో పాటు టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. శివశంకర్ బాబాపై కేసు నమోదు
చెన్నై: ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న శివశంకర్ బాబాపై చెన్నై పోలీసులు ఆదివారం లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. చెన్నై సమీపంలోని కీలంబాక్కంలో తన స్కూలుకు చెందిన పలువురు విద్యార్థినులను ఈ బాబా లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. శివశంకర్ బాబా సుశీల్ హరి పేరిట ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా స్కూల్లో చదివిన పలువురు విద్యార్థినులు …బాబా తమపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతే తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ శివశంకర్ బాబాకు సమన్లు జారీ చేసింది. కాగా ముగ్గురు విద్యార్థినులు చేసిన ఫిర్యాదుతో కీలంబాక్కం మహిళా పోలీసులు శివశంకర్ బాబాపై పోక్సో చట్టం కింద పలు కేసులు దాఖలు చేశారు. అయితే కేసు తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం దీన్ని సీబీసీఐడీకి ట్రాన్స్ ఫర్ చేసింది. కేసుకు సంబంధించి సమాచారం పొందడానికి ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 13 మంది బాధితులను అధికారులు కలిసి వివరాలు సేకరించనున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన సమన్లపై శివశంకర్ కమిటీ ముందు హాజరు కాలేదు. ఛాతీ నొప్పితో తమ గురువు డెహ్రాడున్ లోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని ఆయన శిష్యులు కమిటీకి తెలిపారు. చదవండి: మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్ -
లైంగిక దాడిపై కేసు నమోదు
జరుగుమల్లి (సింగరాయకొండ): మండల కేంద్రంలోని తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో అదే కాలనీకి చెందిన బాలుడిపై గురువారం అర్ధరాత్రి జరుగుమల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన మైనర్ బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అదే కాలనీకి చెందిన బాలుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు అబార్షన్ చేయించడానికి ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి ఈనెల 6వ తేదీ వెళ్లారు. అయితే ఆస్పత్రి వైద్యులు బాలికను పరీక్షించి ఏడు నెలల గర్భం అని ఈ సమయంలో అబార్షన్ చేస్తే ప్రమాదం అని చెప్పడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఈనెల 8వ తేదీ తరలించారు. బాలిక 9వ తేదీ చనిపోయిన శిశువుకు జన్మించింది. తరువాత వారిని ఆస్పత్రి నుంచి 13వ తేదీ డిశ్చార్జ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం 16వ తేదీ రాత్రి నిందితుడైన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ యు. శ్రీనివాసరావు వివరించారు. బాలికపై లైంగిక దాడి దర్శి: మండల పరిధిలో పదకొండు సంవత్సరాల వయస్సున్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేసిన ఘటన కొర్లమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తల్లిదండ్రులు పొలం వెళ్లారు. గురువారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. దుస్తులకు రక్తం కావడంతో బాలిక ఏడ్చింది. దీంతో ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక గురువారం సాయంత్రం వరకు ఇంట్లో చెప్పలేదు. బాలిక తరచూ బాత్రూంకు వెళ్లి బయటకు వచ్చి ఏడుస్తుండటంతో గమనించిన తల్లి అడగటంతో ఆమెకు జరిగిన విషయం చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పి..పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై ఆంజనేయులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆజం ఖాన్ భార్యపై ఎఫ్ఐఆర్
లక్నో : విద్యుత్ చోరీ ఆరోపణలపై ఎస్పీ నేత, ఎంపీ ఆజం ఖాన్ భార్యపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాంపూర్‌లో ఆజం ఖాన్ భార్య పేరిట ఉన్న రిసార్ట్‌పై దాడులు చేపట్టిన అధికారులు వారి విద్యుత్ మీటర్‌కు నిర్ధేశించిన విద్యుత్ కంటే అధికంగా అక్రమ పద్ధతుల్లో విద్యుత్‌ను వాడుకుంటున్నట్టు గుర్తించారు. ఈ రిసార్ట్ ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాతిమా పేరిట ఉందని అధికారులు వెల్లడించారు. 5 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ మీటర్ ఉండగా వారు అక్రమ పరికరాలను బిగించి వారి విద్యుత్ మీటర్లలో రీడింగ్స్ నమోదు కాకుండా సామర్ధ్యానికి మించిన విద్యుత్‌ను అనధికారికంగా వాడినట్టు గుర్తించామని చెప్పారు. అధికారుల ఫిర్యాదుతో రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాతిమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఆజం ఖాన్ గతంలో ములాయం, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు. -
‘ఉన్నావ్’ కేసులో ట్విస్ట్; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
లక్నో : ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలి ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్‌పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. హత్య, హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు మరో పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాజా ప్రమాద ఘనటపై జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని మమత కోరారు. దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోంది. ప్రతీరోజు మూకహత్య ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై ప్రధాని దృష్టిపెట్టాలన్నారు.ఈ ప్రమాదంపై అత్యున్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. అటు బాధితురాల్ని హతమార్చేందుకే ప్రమాదం పన్నాగం పన్నారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం నంబరు ప్లేటులేని ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. కాగా అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు 2017లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో పోలీసుల కస్టడీలోనే ఆమె తండ్రి మరణించడం, దీనిపై నిష్పక్షపాత విచారణ జరగడంలేదంటూ బాధితురాలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులోఅరెస్టు అయిన కులదీప్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చదవండి: ‘ఉన్నావ్’ రేప్ బాధితురాలికి యాక్సిడెంట్ -
కమల్ హాసన్‌పై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అరవకురిచ్చిలో ఈనెల 12న కమల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ‘గాంధీ విగ్రహం ముందు నిలుచుని చెబుతున్నా స్వాతంత్య్ర భారతావనిలో తొలి తీవ్రవాది ఒక హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని పేర్కొన్నారు. దీంతో ఆయనపై మత విశ్వాసాలను రెచ్చగొట్టినందుకు, విద్వేషాలను ప్రేరేపించినందుకు సెక్షన్లు 153ఏ, 295ఏ కింద కేసులు నమోదు చేసినట్లు కరూర్ జిల్లా పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌లో ‘హిందూ మున్నాని’ నేతలు కమల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ పరిణామంతో పోలీసులు చెన్నై ఆళ్వార్‌పేట, ఈసీఆర్ రోడ్డులోని కమల్ నివాసాలు, పార్టీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన ఎంఎన్ఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కమల్‌పై నిషేధం విధించాలంటూ బీజేపీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ ఢిల్లీ హైకోర్టులో మంగళవారం పిల్ దాఖలు చేశారు. కాగా, కమల్ వ్యాఖ్యలను బీజేపీ, ఏఐఏడీఎంకే ఖండించగా, కాంగ్రెస్, డీఎంకే సమర్థించాయి. -
కంప్లెయింట్ చేయొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే కాళ్లబేరం
సాక్షి, ముంబై : పోలీస్ స్టేషన్లో తనపై కంప్లెయింట్ చేయొద్దంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుదారు కాళ్లు పట్టుకునేందుకు యత్నించిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. మహారాష్ట్రలోని హదాప్సార్ నియోజకవర్గ ఎమ్మెల్యే యోగేష్ తిలకర్ తన వద్ద అక్రమంగా డబ్బు వసూలు చేయాలని చూశాడని రవీంద్ర బరాటే అనే వ్యక్తి కొంధ్వా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 385 (దోపిడీ) సెక్షన్ కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారని రవీంద్ర బుధవారం మీడియాకు తెలిపారు. తన కంపెనీలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు అనుమతి కావాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే తిలకర్ మరో ఇద్దరు వ్యక్తులు డిమాండ్ చేశారని రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లెయింట్ చేయొద్దంటూ ఎమ్మెల్యే తన కాళ్లు పట్టుకునేందుకు యత్నించాడనీ, చేతులు జోడించి క్షమాపణలు కోరాడని రవీంద్ర చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను విచారించే బదులు పోలీసులు తనపై ఎంక్వైరీ మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ఇదిలాఉండగా.. రవీంద్ర చెప్పినట్టు తాను ఆయన కాళ్లు పట్టుకోలేదని ఎమ్మెల్యే తిలకర్ చెప్పుకొచ్చాడు. కేసు పెట్టొద్దని మాత్రమే ఆయనను కోరానని అన్నారు. వయసులో పెద్దవారు కావడంతో అలవాటుగా రవీంద్ర పాదాలను తాకేందుకు యత్నించి ఉండొచ్చని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. -
శాడిస్ట్ భర్త చేతిలో భార్యకు చిత్రహింసలు
హైదరాబాద్ : షేక్‌పేటలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న ప్రశాంత్, జ్ఞానజ్యోతి భార్యభర్తలు. అదనపుకట్నం కోసం భార్య జ్ఞానజ్యోతిని భర్త ప్రశాంత్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. జ్ఞానజ్యోతి కాళ్లు, చేతులు కట్టేసి ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి షేక్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు జ్ఞానజ్యోతి ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. నిందితుడు ప్రశాంత్, అతని తల్లి, అన్నలపై జ్యోతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ మహిళా ఎమ్మెల్సీపై కేసు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నేతల అవినీతి కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నకిలీ పోలీస్ అరెస్ట్
కోదాడఅర్బన్ : ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నజీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం లకారానికి చెంది న గార్లపాటి ప్రభాకర్ ఇటీవల పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లోని సాయితేజ హోటల్‌కు వెళ్లి యజమానిని ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు పదివేలు లంచం ఇవ్వాలని లేనిపక్షంలో తప్పుడు కేసు పెట్టిస్తానని బెదిరించడంతో యజమాని ఆందోళన చెందిన అడిగిన డబ్బు ఇచ్చాడు. రెండురోజుల కిత్రం లక్ష్మిపురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మట్టపల్లి శ్రీను వద్దకు వెళ్లి బెదిరింపులకు పా ల్పడ్డాడు. ఈ క్రమంలో సోమవా రం ఖమ్మం క్రాస్‌రోడ్‌లో వేచి ఉన్న శ్రీను దగ్గరకు ప్రభాకర్ రావడంతో అతడి గుర్తింపు కార్డు చూపాలని అడిగాడు. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీను స్నేహితులు ప్రభాకర్‌ను వంటమాస్టర్‌గా గుర్తించి అతడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో కానిస్టేబుల్‌గా చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు అంగీకరించాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమించినందుకు చంపబోయారు
చిట్టినగర్ (విజయవాడ వెస్ట్) : ప్రేమించినందుకు ఓ యువకుడి కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు చెందిన దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు దాడికి పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఇస్లాంపేట హామీద్ వీధికి చెందిన షేక్ లాల్ అహమ్మద్‌కు ముగ్గురు కుమారులు. ఆఖరి వాడైన కరీముల్లా మంగళగిరికి చెందిన బీబీ ఆయిషా ప్రేమించుకున్నారు. గత నెల ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి 27వ తేదీ తిరిగి వచ్చారు. అయితే ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొనడంతో పెద్దల మధ్య పెట్టారు. చివరకు ఇద్దరికి మార్చి 25వ తేదీన వివాహం చేస్తామని అమ్మాయి తరఫు వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో లాల్ అహమ్మద్, అతని భార్య, పెద్ద కోడలు.. పంజా సెంటర్లోని తమ కూల్ డ్రింక్ షాపు వద్ద ఉండగా అమ్మాయి తరఫు బంధువులైన షేక్ అహ్మద్ (హందీ), ఖాజా, గౌస్, మున్నా, బాబు, షమీబుద్దీన్, సద్దామ్ ఓ కారులో వచ్చి షాపును ధ్వంసం చేయడమే కాకుండా మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అంతే కాకుండా చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే, సమీపంలోని టీ దుకాణం వద్ద ఉన్న లాల్ అహమ్మద్ పెద్ద కుమారుడు షాబాషీపై బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న కొత్తపేట సీఐ మురళీకృష్ణ, పోలీసు సిబ్బంది దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నకిలీ బంగారంతో బ్యాంక్‌కు బురిడీ
నెల్లూరు(క్రైమ్): నకిలీ బంగారు గాజులు పెట్టి బ్యాంక్‌లో రుణం తీసుకుని మోసగించిన ఘటనలో ఇద్దరు మహిళలపై ఐదోనగర పోలీసులు శనివారం చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. టైలర్స్ కాలనీకి చెందిన సుగుణ, రంగనాయకులపేటకు చెందిన శైలజ స్నేహితులు. ఈ నెల 1వ తేదీ కరెంట్ ఆఫీసు సెంటర్లోని సిండికేట్ బ్యాంక్ సుగణ తన పేరుపై ఖాతాను తెరిచింది. అదే రోజు నాలుగు బంగారు గాజులను బ్యాంక్‌లో పెట్టి రూ.82 వేలు రుణం తీసుకుంది. మళ్లీ ఈ నెల 8న స్నేహితులిద్దరూ మరో నాలుగు (ఇంతకు ముందు కుదువ పెట్టిన) గాజులు తీసుకుని బ్యాంక్‌కు లోను కోసం వచ్చారు. అనుమానం వచ్చిన గోల్డ్ అప్రైజర్ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంక్ టైమ్ అయిపోయిందని మరుసటి రోజు రావాలని మేనేజర్ వారికి సూచించాడు. దీంతో వారు వెళ్లిపోయారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ గతంలో లోను కోసం తాకట్టు పెట్టిన గాజులు, ప్రస్తుతం తీసుకు వచ్చిన గాజులను అప్రైజర్‌తో తనిఖీ చేయించగా అన్నీ నకిలీవని తేలింది. దీంతో మహిళలు బ్యాంక్‌ను మోసగించిన ఘటనపై శనివారం బ్యాంక్ అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్ ఎన్. రవికుమార్ ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సీహెచ్ కొండయ్య ఇద్దరు మహిళలపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై ఏడాదిగా అత్యాచారం
రామాయంపేట(మెదక్): బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న మండలంలోని కాట్రియాలకు చెందిన సంతోష్‌రెడ్డి అనే యువకునిపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..సంతోష్‌రెడ్డి మండలంలోని లక్ష్మాపూర్‌లో డిష్ నడిపిస్తాడు. అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి మోసగించి ఏడాదిగా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తన తల్లికి తెలపడంతో, ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి అదృశ్యంపై కేసు నమోదు
మాదాపూర్: హైదరాబాద్‌లో యువతి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జైపూర్‌కి చెందిన సస్రీ నిర్లిప్త(24) నిరుద్యోగురాలు. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేట సైబర్‌హిల్స్‌లో తన అన్నయ్య ఇంట్లో నివాసముంటుంది. ఈ నెల 10వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన సస్రీ నిర్లిప్త తిరిగి రాకపోవడంతో ఆమె అన్నయ్య పరంజిత్ దాస్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి యజమాని కుమారుడి లైంగిక వేధింపులు
-
ఇంటి యజమాని కుమారుడి లైంగిక వేధింపులు
హైదరాబాద్: మల్లేపల్లి విజయనగర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంటిలో పనులు చేసుకునే మైనర్ బాలికలపై ఇంటి యజమాని కుమారుడు రిజ్వాన్ లైంగిక వేధింపులకు దిగిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. బాధితులు హుమాయున్‌నగర్ ఏసీపీని ఆశ్రయించడంతో ఇంటి యజమాని కుమారుడి దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముగ్గురు బాలికలను వేధిస్తున్నాడని... ఇంకా ఇంటి యజమాని చెరలో మరో ఇద్డరు బాధితులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. రిజ్వాన్ తల్లిదండ్రులు కూడా కుమారుడికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నామని ఏసీపీ గౌస్ మొయినుద్దీన్ తెలిపారు. ఇంటి యజమాని అదుపులో ఉన్న బాధితులను వారి చెరనుంచి విడిపించి అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మనస్తాపంతో కోర్టులో ఆత్మహత్యాయత్నం
ఏలూరు: భార్య తనపై కేసు నమోదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఏలూరులో జరిగింది. ఏలూరు పవర్ కాలనీకి చెందిన ప్రేమ్‌కిషోర్‌కు నాగలక్ష్మితో వివాహమైంది. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నాగలక్ష్మి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సోమవారం విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన ప్రేమ్‌కిషోర్ తన భార్య చేసిన పని వల్ల మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు
హైదరాబాద్ : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళ్తే.. కవాడిపల్లికి చెందిన ఓ మహిళ పట్ల నర్సింహ అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. మహిళ పొలంలో పనులు చేస్తుండగా అక్కడకు వచ్చిన నర్సింహ ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.