నకిలీ పోలీస్ గార్లపాటి ప్రభాకర్
కోదాడఅర్బన్ : ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ నజీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం లకారానికి చెంది న గార్లపాటి ప్రభాకర్ ఇటీవల పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లోని సాయితేజ హోటల్‌కు వెళ్లి యజమానిని ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు పదివేలు లంచం ఇవ్వాలని లేనిపక్షంలో తప్పుడు కేసు పెట్టిస్తానని బెదిరించడంతో యజమాని ఆందోళన చెందిన అడిగిన డబ్బు ఇచ్చాడు.
రెండురోజుల కిత్రం లక్ష్మిపురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మట్టపల్లి శ్రీను వద్దకు వెళ్లి బెదిరింపులకు పా ల్పడ్డాడు. ఈ క్రమంలో సోమవా రం ఖమ్మం క్రాస్‌రోడ్‌లో వేచి ఉన్న శ్రీను దగ్గరకు ప్రభాకర్ రావడంతో అతడి గుర్తింపు కార్డు చూపాలని అడిగాడు. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీను స్నేహితులు ప్రభాకర్‌ను వంటమాస్టర్‌గా గుర్తించి అతడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో కానిస్టేబుల్‌గా చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు అంగీకరించాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment