‘పులి’(ఆ)హోర
గాండ్రింతువు నీవు... ఆరగింతులే నిన్ను... అంటూ చెలరేగిపోయాడా భోజనప్రియుడు. లొట్టలేసుకుంటూ తినేశాడు. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కిస్తున్నాడు. చైనాలో క్సూ అనే సంపన్న రియల్ ఎస్టేట్ వ్యాపారికి పులి మాంసం అంటే మహా మక్కువ. వేటగాళ్లకు డబ్బులు పడేసి మరీ పులి మాంసం తెప్పించుకునేవాడు. అలా... ఎంచక్కా మూడు పులుల్ని లాగించేశాడు.
మనోడి ‘పులి’తేన్పులు ఆ చెవినా ఈ చెవినా పడి చివరికి పోలీసుల చెవిలో కూడా పడడంతో.. రక్షక భటులు వచ్చి ఇదేమి ‘భక్షణ’? అని రంకెలేస్తూ క్సూ గారిని తీసుకెళ్లి జైలులో పడేశారు. ఏకంగా 14మంది సప్లయర్లను పెట్టుకుని మరీ ‘పుల్లు’గా పులుల్ని ఆరగించేస్తున్నాడనే నేరం రుజువు కావడంతో కోర్టు ఈ టైగర్ ఈటర్‌కి పదమూడేళ్ల శిక్ష విధించింది.