చైనాలో కొత్త ఇళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈసారి గృహాల ధరలు 5.9 శాతం క్షీణించాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 5.8 శాతం పడిపోయింది. వరుసగా గత 16 నెలల నుంచి కొత్త ఇళ్ల ధరలు తగ్గుతుండడం గమనార్హం. 2015 అక్టోబర్ నెలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన గత తొమ్మిదేళ్లుగా వీటి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. అయితే చైనా ప్రభుత్వం వీటి ధరలను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) డేటా ఆధారంగా రాయిటర్స్ నివేదించింది.
ఎన్‌బీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలోని ప్రధాన నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గిపోయింది. దాంతో కొత్త ఇళ్ల ధరలు క్షీణిస్తున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో ఇది మారనుంది. రానున్న రోజుల్లో గృహాల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని 75.9% మంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చేసిన సర్వేలో 70 నగరాల్లో కేవలం మూడింటిలో మాత్రమే అక్టోబర్ నెలలో గృహాల ధరలు పెరిగాయి.
ఇదీ చదవండి: మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’
చైనాలోనే అతిపెద్ద కంపెనీగా పేరున్న రియల్‌ఎస్టేట్ సంస్థ ఎవర్‌గ్రాండ్ గ్రూప్ 2021లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాని ప్రభావం చైనాపై బలంగానే ఉంది. ఆ సంక్షోభం తర్వాత చైనా ప్రాపర్టీ సెక్టార్‌కు మద్దతుగా కొన్ని విధానాలు ప్రవేశపెట్టింది. ఈ విధానాల ప్రభావం త్వరలో చూడబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో ప్రాపర్టీ మార్కెట్ స్థిరీకరించబడుతుందని ధీమా వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment