Realestate Business
-
నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!
చైనాలో కొత్త ఇళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈసారి గృహాల ధరలు 5.9 శాతం క్షీణించాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 5.8 శాతం పడిపోయింది. వరుసగా గత 16 నెలల నుంచి కొత్త ఇళ్ల ధరలు తగ్గుతుండడం గమనార్హం. 2015 అక్టోబర్ నెలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన గత తొమ్మిదేళ్లుగా వీటి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. అయితే చైనా ప్రభుత్వం వీటి ధరలను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) డేటా ఆధారంగా రాయిటర్స్ నివేదించింది.ఎన్బీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలోని ప్రధాన నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనూ రియల్ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గిపోయింది. దాంతో కొత్త ఇళ్ల ధరలు క్షీణిస్తున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో ఇది మారనుంది. రానున్న రోజుల్లో గృహాల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని 75.9% మంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చేసిన సర్వేలో 70 నగరాల్లో కేవలం మూడింటిలో మాత్రమే అక్టోబర్ నెలలో గృహాల ధరలు పెరిగాయి.ఇదీ చదవండి: మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’చైనాలోనే అతిపెద్ద కంపెనీగా పేరున్న రియల్ఎస్టేట్ సంస్థ ఎవర్‌గ్రాండ్ గ్రూప్ 2021లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాని ప్రభావం చైనాపై బలంగానే ఉంది. ఆ సంక్షోభం తర్వాత చైనా ప్రాపర్టీ సెక్టార్‌కు మద్దతుగా కొన్ని విధానాలు ప్రవేశపెట్టింది. ఈ విధానాల ప్రభావం త్వరలో చూడబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో ప్రాపర్టీ మార్కెట్ స్థిరీకరించబడుతుందని ధీమా వ్యక్తం చేసింది. -
రీట్స్, ఇన్విట్స్తో రిస్క్ హెడ్జింగ్
రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(రీట్స్), చిన్న, మధ్యతరహా(ఎస్ఎం) రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఇన్విట్స్)లను ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్‌గా వినియోగించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. రిస్క్ హెడ్జింగ్‌కు వీలుగా వీటి వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. వీటికితోడు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లకు వర్తించే నిబంధనల బాటలో స్పాన్సర్లతోపాటు.. తమ గ్రూప్‌లకు లాక్డ్ఇన్ రీట్స్, ఇన్విట్స్ యూనిట్ల బదిలీకి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. తద్వారా ఆయా సంస్థలు తమ ఆర్థిక లక్ష్యాలను వీడకుండా సొంత హోల్డింగ్స్ నిర్వహణకు వీలు చిక్కనుంది.ఇదీ చదవండి: త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..రీట్స్, ఇన్విట్స్ లెవరేజ్ మదింపులో ఫిక్స్డ్ డిపాజిట్లను నగదుకు సమానంగా పరిగణించేందుకు వీలు కల్పించనుంది. ఈ బాటలో రీట్, ఇన్విట్ సమీకరణకు క్రెడిట్ రేటింగ్ అవసరాలు, ఆయా సంస్థల బోర్డులలో ఖాళీలకు సభ్యుల ఎంపిక గడువు, ఆస్తుల మూలాల విస్తరణ తదితర అంశాలపై మార్గదర్శకాలకు తెరతీయాలని ప్రతిపాదించింది. ఇక మరోవైపు రీట్స్‌ను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించేలా ప్రతిపాదించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు రీట్స్, ఇని్వట్స్ సులభతర వ్యాపార నిర్వహణకు వీలైన చర్యలకు తెరతీయాలని సెబీ తాజా ప్రతిపాదనలలో అభిప్రాయపడింది. -
హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. కొవిడ్ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్‌ఫ్రంహోం కల్చర్‌కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజు పెరగగా, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. వచ్చే త్రైమాసికానికిగాను ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు ముంబైలో ఆఫీస్ స్థలం డిమాండ్ 90 శాతం ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయాల స్థలం 25 శాతం పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. దిల్లీ-ఎన్సీఆర్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14 శాతం అధికం. చెన్నైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 6 శాతం తగ్గి 1.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు -
హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..
నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో రెండు పడక గదుల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కోటి రూపాయలు ఉండాల్సిందే. ప్రస్తుతం నగరంలో సగటు చదరపు అడుగు ధర సుమారు రూ.5 వేలు పలుకుతోంది. ఇది బేస్ ధర మాత్రమే. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదికి రూ.70 లక్షల వరకు అవుతుంది. కారు పార్కింగ్, క్లబ్ హౌస్ సభ్యత్వం, గ్యాస్, ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వంటి మౌలిక వసతుల కోసం మరో పది లక్షల వరకు తీసుకుంటున్నారు. 5 శాతం జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్ఫర్ ఛార్జీలు కలిపి మరో 10 లక్షల వరకు అవుతున్నాయి. ఇంటీరియర్ కోసం మరో రూ.పది లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.కోటి పెడితే రెండు పడకల ఫ్లాట్ మాత్రమే వస్తోంది. మరింత విశాలంగా మూడు పడకల గది కావాలన్నా.. పై అంతస్తుల్లో ఉండాలంటే ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, తూర్పు, ఉత్తరం వైపు ఫ్లాట్ కావాలన్నా... చెరువు వైపు, గార్డెన్ వైపు ఉన్న బాల్కనీ కావాలన్నా అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. వీటితో పాటూ మూడు పడకల ఫ్లాట్ కావాలంటే కోటిన్నర అవుతోంది. ఇదంతా ఐటీ కారిడార్ బయటనే. ఐటీ కారిడార్‌లో అయితే రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగానే జనవరిలో కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. వెయ్యి నుంచి రెండువేల లోపు విస్తీర్ణం కలిగిన వాటి రిజిస్ట్రేషన్లు 71 శాతం జరిగాయి. కొందరు బిల్డర్లు సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల లోపల ఉండే రెండు పడకల గదుల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అఫర్డబుల్ హౌసింగ్ కింద వీటిని పరిగణిస్తారు. జీఎస్టీ 1 శాతమే ఉంటుంది. ఈ తరహా ఇళ్లు రూ.50 లక్షల ధరల్లో వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ విస్తీర్ణంలో కట్టడం లేదు. 2023 జనవరిలో వీటి రిజిస్ట్రేషన్లు 17 శాతం జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో 14 శాతానికి పడిపోయాయి. ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ -
హైదరాబాద్‌లో 3 పడకల ఇళ్లకే గిరాకీ.. ఏ ధరకు కొంటున్నారో తెలుసా..
మానవుల జీవనప్రమాణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు నివసించేందుకు ఇళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి రెండు పడక గదుల ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు. దాంతో నిర్మాణ సంస్థలూ వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. ఇప్పుడు మాత్రం ధర అధికమైనా సరే మూడు పడక గదుల ఇల్లు, విశాలమైన వరండా లాంటివి ఉండే ఇళ్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జులై-డిసెంబరు మధ్య ఫిక్కీ-అనరాక్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇళ్ల కొనుగోలుదారుల్లో సగానికి పైగా 3 బీహెచ్‌కే (మూడు పడక గదులు, హాలు, వంటగది) ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించారు. ఏడాది క్రితం 3బీహెచ్‌కే ఇల్లు/ఫ్లాట్ కొనుగోలుకు 42% మందే ఆసక్తి చూపించడం గమనార్హం. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటే ముంబయిలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2బీహెచ్‌కే వైపే చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 1బీహెచ్‌కే ఇళ్లపై ఆసక్తి తగ్గినా, ముంబయి, పుణెలో వీటికి గిరాకీ ఉందని తెలిసింది. పెరిగిన సగటు విస్తీర్ణం పెద్ద ఇళ్లకు గిరాకీ పెరుగుతుండటంతో, వాటి నిర్మాణాలూ అధికంగానే ఉంటున్నాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సగటు ఫ్లాటు విస్తీర్ణం 11% పెరిగిందన్నారు. 2022లో సగటు ఫ్లాటు విస్తీర్ణం 1,175 చదరపు అడుగులు ఉండగా, 2023లో 1,300 అడుగులకు చేరుకుందన్నారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. భారీగా అమ్మకాలు.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022తో పోలిస్తే గత ఏడాది ఇళ్ల విక్రయాల్లో 31% వృద్ధి కనిపించింది. మొత్తం 4.77 లక్షల ఇళ్లు 2023లో అమ్ముడయ్యాయి. కొత్తగా 4.46 లక్షల ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణాన్ని డెవలపర్లు ప్రారంభించారు. ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా రూ.45-90 లక్షల ఇల్లు/ఫ్లాట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరికొందరు రూ.90లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఇళ్లను కొనాలనే ఆసక్తితో ఉన్నారని సర్వే వెల్లడించింది. -
అదే జరిగితే.. ఇళ్ల కొనుగోలుదారులకు ఊరటే!
స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని చెల్లించాలా? వద్దా? అనే అంశంపై త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ..రెరాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయని, అందువల్ల జీఎస్టీ విధించడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై పన్ను విధించడమేనని తెలిపారు. ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం అక్టోబర్ 7, 2023న జరిగింది. ఇక రెరా జీఎస్టీ చెల్లించే విషయంపై అకౌంటింగ్ అండ్ అడ్వైజరీ నెట్ వర్క్ సంస్థ మూర్ సింఘి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ మోహన్ మాట్లాడుతూ.. జూలై 18, 2022కి ముందు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్ జీఎస్టీకి లోబడి లేవని అన్నారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనుమతించబడదు అంటే జీఎస్టీ నుంచి రెరాను మినహాయిస్తే సానుకూల ఫలితాలే ఎక్కువ అని అన్నారు. రెరా జీఎస్టీ చెల్లించే అవసరం లేకపోతే డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు ఇద్దరికీ ఖర్చులు తగ్గుతాయి. తత్ఫలితంగా రంగానికి గణనీయంగా లాభదాయకంగా ఉంటుందని అని మోహన్ తెలిపారు. -
కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకుంటున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్ ఎస్టేట్‌లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్‌లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి, లోక్‌సభ ఎన్నికలు రాబోతుండడంతో మార్కెట్లో కొంత స్తబ్ధత కన్పిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు. అయితే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు, స్థలం కొనాలో నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు. మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా కొన్నిచోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి. మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్ వేయండి. స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి. -
నివాసానికి ఒకటి.. అద్దెకు మరొకటి..!
ఉండటానికి సొంతిల్లు ఉన్నా స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ పెరిగింది. హైటెక్‌సిటీ వంటి కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ భవనాల స్థాయిలో గృహాలకు అద్దెలు వస్తుండటంతో రెండో ఇల్లు వైపు మొగ్గుచూపుతున్నారు. నగరంలో వివిధ కారణాలతో కొద్దినెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదించింది. గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం, మార్కెట్లో నగదు లభ్యత లేకపోవడం, ప్రవాస భారతీయుల పెట్టుబడులు తగ్గడం, ఎన్నికల సంవత్సరం, మార్కెట్లో సరఫరా పెరగడం వంటి కారణాలతో రియల్ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉంది. ఇలాంటి దశలోనూ అద్దె ఆవాసాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉందని ఈ రంగంలోని సంస్థలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్‌గా ఉన్న మాదాపూర్‌లో రెండు పడక గదుల ఇంటి అద్దె సగటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. కమ్యూనిటీ, అక్కడి సౌకర్యాలను బట్టి రూ.2లక్షల వరకు కూడా అద్దెలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య రెంట్లు ఉన్నాయి. స్థలానికి ప్రత్యామ్నాయంగా.. సొంతిల్లు ఉంటే భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా భావించి గతంలో స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాల సంస్కృతి మొదలయ్యాక వీటిలో అద్దెలు బాగా వస్తుండటంతో స్థలానికి ప్రత్యామ్నాయంగా రెండో ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాలు సైతం ఉండటంతో పన్ను భారం తగ్గించుకునేందుకు కొనేవారు ఉన్నారు. నెలనెలా ఆదాయం కోసం కూడా వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో చూస్తే అద్దెల రాబడి తక్కువలో తక్కువ 2.35 శాతం నుంచి గరిష్ఠంగా 4.03 శాతం వరకు ఉంటోంది. ఇల్లు కొనేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం, వార్షికంగా వచ్చిన అద్దెను పరిగణనలోకి తీసుకుని రాబడి లెక్కిస్తున్నారు. అంటే ఉదాహరణకు రూ.10 లక్షలతో ఇల్లు కొంటే వార్షికంగా 4 శాతం రూ.40 వేలు అద్దె వస్తుందని లెక్కకడుతున్నారు. దీనికి అదనంగా ఇంటి విలువ పెరగడం కలిసొచ్చే అంశం. ఇదీ చదవండి: చలిలో విద్యుత్ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే.. ఎప్పటి నుంచో ఉన్నదే.. అద్దె రాబడి కోసం వ్యక్తిగత ఇళ్లల్లో ప్రత్యేకంగా పోర్షన్లు నిర్మించడం సిటీలో ఎప్పటినుంచో ఉన్నదే. ఇందుకోసం జీ+2, 3, 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక అంతస్తులో పూర్తిగా యజమానులు ఉంటూ.. మిగతా అంతస్తుల్లో ఒక పడక, రెండు పడక గదులను అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. అద్దెల మీద వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు సిటీలో ఎందరో ఉన్నారు. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లను అద్దె రాబడి కోసం ఇటీవల ఎక్కువ మంది కొంటున్నారు. -
2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా..
సొంతిళ్లు అనేది సామాన్యుడి కళ. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతారు. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల అవసరాలు హెచ్చవుతున్నాయి. అందుకు అనువుగా రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. మారుతున్న జీవనప్రమాణాల వల్ల అధికశాతం జనాభా ఇప్పటికే ఇళ్లు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగిన మరో ఇంటికి మారాలని చూస్తున్నారు. దాంతో ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియాసెస్ ఫోరాస్ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం..2018 నాటికే జనాభా అవసరాలకు తగిన ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి అధికంగా ఉండనుంది. 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా రెరా వద్ద 19,050కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: 2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..? క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగానికి సానుకూలంగా ఉందని చెప్పారు. 2024లోనూ ఈ రంగంలో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లియాసెస్ ఫోరాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని వివరించారు. -
దానికదే పగుళ్లు పూడ్చుకునే కాంక్రీటు..!
భవన నిర్మాణంలో వాడే కాంక్రీటు దృఢంగా ఉంటుంది. అయితే వాతావరణంలోని తేమ లేదా ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల వల్ల కాంక్రీటు నిర్మాణాల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు దాని నిర్వహణకోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పగుళ్లతో కొన్నిసార్లు కాంక్రీటు మూలకాలు క్షీణించే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను నివారించటానికి డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు చేసుకుంటుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టి కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది. అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకు అనుగునంగా డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బయోఫైబర్లు రూపొందించారు. ఈ పాలిమర్ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు వాటికవే పూడిపోయేలా చేసి మన్నికగా ఉండే కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు కలిగిన హైడ్రోజెల్ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇదీ చదవండి: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో..! ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్ విస్తరిస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్‌తోపాటు బయటకు కనిపించే వాటికిసైతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయిస్తుంటారు. వంటగది ఎక్కడ రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్ ఎలా ఉంటే బావుంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలో స్థలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆధునిక భవన డిజైన్లలో కీలకం. అయితే చాలా మంది జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా భవనాల డిజైన్‌లో ఈ అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన ఇంటి విస్తీర్ణంతో దాని ధర కూడా పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల స్థలాన్ని లివింగ్ రూంకు వదిలిపెడుతుంటారు. అందుకు బదులుగా కొంత అదనంగా మరో 100 చదరపు అడుగుల స్థలాన్ని కలిపి భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరాల్లో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ‘ఎఫెక్టివ్ మల్టిపుల్’ అధికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటున కొన్ని సర్వేల ప్రకారం వంటగది, హాల్, కిచెన్.. వంటి గదుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తే ఎఫెక్టివ్ మల్టిపుల్ బావుంటుంది. ఎఫెక్టివ్ మల్టిపుల్ విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్ రూం విస్తీర్ణం పెంచుకోవాలి. ఇంటిని సమర్థంగా వాడుకోవానుకున్నా, విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్ వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో కొంతమేర కరెంట్ బిల్లు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. -
దళితుల భూములు లాక్కోవద్దు
డాపూర్(సంగారెడ్డి): సదాశివపేట దళితుల భూములు గుంజుకోవద్దని, హెచ్ఎండీ లేఅవుట్ పేరిట వారి భూముల్లో రియల్ ఎస్టేట్ దందా ఆపాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదాశివపేట దళితులు వారి భూములను రియల్ ఎస్టేట్ దందాకు ఇవ్వొద్దని కోరుతూ కులవ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ సదాశివపేట పట్టణ శివారులోని సర్వే నంబర్ 165లోగల 114.21 ఎకరాల భూమిలో గత 50 సంవత్సరాలుగా 200 మంది దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారన్నారు. హైదరాబాద్ – ముంబయి నేషనల్ హైవే కు ఆనుకొని ఆ భూములు ఉన్నాయన్నారు. వాటి విలువ సుమారు రూ.350 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పేద దళితుల భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తారా? అని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ లే అవుట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా సభ్యుడు మోహన్ దాస్, సదాశివపేట దళిత రైతులు సిద్దాపురం శంకరయ్య, చుక్కల మానేయ, కర్రె సుధాకర్, సంజీవులు, సునందరావు, అనూప్ కుమార్, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు . -
పుంజుకున్న హైదరాబాద్ రియల్టీ..ఇళ్ల ధరలు ఎంత శాతం పెరిగాయంటే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన రెసిడెక్స్ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. హైదరాబాద్ కాకుండా మిగిలిన ఏడు ప్రధాన పట్టణాలను పరిశీలించినట్టయితే.. అహ్మదాబాద్‌లో అత్యధికంగా 13.8 శాతం, బెంగళూరులో 2.5 శాతం, చెన్నైలో 7.7 శాతం, ఢిల్లీలో 3.2 శాతం, కోల్‌కతాలో 2.6 శాతం, ముంబైలో 1.9 శాతం, పుణెలో 0.9 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. సీక్వెన్షియల్‌గా (అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే) చూస్తే.. 50 పట్టణాలతో కూడిన రెసిడెక్స్ ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 2.6 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలో ఉన్న 1.7 శాతంతో పోలిస్తే పుంజుకుంది. అంతేకాదు, 2021 జూన్ నుంచి త్రైమాసికం వారీగా ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపిస్తోందని.. హౌసింగ్ మార్కెట్ కరోనా లాక్డౌన్ల నుంచి కోలుకున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇళ్ల ధరలను త్రైమాసికం వారీగా ట్రాక్ చేసేందుకు ఎన్‌హెచ్‌బీ 2007లో రెసిడెక్స్ ఇండెక్స్‌ను ప్రారంభించింది. -
కరోనాలోనూ 'రియల్' దూకుడు! రూ.65,000 కోట్లకు రియల్టీ!
కోల్‌కతా: రియల్ ఎస్టేట్ పరిశ్రమ 2024 నాటికి రూ.65,000 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2025 నాటికి దేశ జీడీపీలో రియల్టీ పరిశ్రమ వాటా 13 శాతానికి చేరుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 2019లో రూ.12,000 కోట్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనాకు సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ.. 2022లో మార్కెట్ సానుకూలంగా ఉంటుందని, రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేసింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ప్రస్తావిస్తూ.. టెక్నాలజీ ఆధారిత ఎకోసిస్టమ్ ఉన్న కార్యాలయ వసతులకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. డెవలపర్లు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, డిజిటల్ చానల్స్ ద్వారా వినియోగదారులను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. భారత రిటైల్ పరిశ్రమ 2021–2030 మధ్య 9 శాతం చొప్పున వృద్ది చెంది 2026 నాటికి 1400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది అంచనా. భారతీయులు ఆన్లైన్ రిటైల్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని, 2024 నాటికి దేశ ఈ కామర్స్ పరిశ్రమ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. వేర్ హౌసింగ్ (గోదాములు) రియల్ ఎస్టేట్ ఇక మీదటా వృద్ధిని చూస్తుందని, ఈ కామర్స్ విస్తరణ కలసి వస్తుందని.. ఈ విభాగంలో లావాదేవీలు 20 శాతం వృద్ధిని చూస్తాయని పేర్కొంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశ ఫైనాన్షియల్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తుంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. చదవండి👉హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
ప్రజాఉద్యమాలతోనే ముకుతాడు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలను కాపాడుకోవాలనే పట్టుదలతో ప్రజాభిప్రాయం ఉద్యమరూపం తీసుకుంటే ఏదైనా సాధించవచ్చని పర్యావరణవేత్త కెప్టెన్ జె.రామారావు చెప్పారు. ఏదైనా అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, ప్రజాగ్రహం పెల్లుబుకుతుందో అప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి తమ తప్పులను సరిచేసుకుంటాయన్నారు. కోర్టులు కలగజేసుకోవడం కంటే ప్రజాందోళనతోనే జీవో 111ను, ఈ జంట రిజర్వాయర్లను కాపాడుకోవచ్చని స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాణ వాయువును అం దిస్తూ ఊపిరితిత్తులుగా నిలిచిన నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వల అన్వేషణ, వెలికితీతను ప్రజల మద్దతుతో అడ్డుకోగలిగామన్నారు. అయితే, జీవో 111పై మాత్రం ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేకపోయామని ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామారావు చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇప్పటికే ఎన్నో ఉల్లంఘనలు... జీవో 111 పేరిట కఠిన నిబంధనలున్నా ఈ జంట జలాశయాల క్యాచ్మెంట్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. కాలేజీలు, కాటేజీలు, ఇళ్లు ఇలా అనేకం వచ్చేశాయి. ప్రభుత్వమే ఈ జీవోను ఉల్లంఘించి పోలీస్స్టేషన్లు తదితరాలు నిర్మిం చింది. ఇప్పుడు ఈ జీవోను ఎత్తేయడం ద్వారా అక్రమ నిర్మాణాలను ‘లీగలైజ్’చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ జలాశయాల్లోకి మురుగు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత చేటే. వీటికి కొద్దో గొప్పో రక్షణగా ఉన్న ఈ జీవోను ఎత్తేస్తే ఇవి కూడా హుస్సేన్‌సాగర్ మాదిరి కాలుష్య కాసారమవుతాయి. రియల్ ఎస్టేట్ కారణంగానే... రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇక్కడి భూముల విలువలకు రెక్కలొచ్చాయి. రియల్టర్లు, వ్యాపారవేత్తల ఒత్తిళ్లకు ప్రభు త్వం తలొగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జంట జలాశయాలు నగర తాగునీటి వనరులుగా కొన సాగాలనే ఉద్దేశంతో జీవో 111ను తెచ్చారు. వీటికి 10 కి.మీ పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, ఇతర కట్టడాలు నిర్మించకుండా ఆంక్షలు విధించారు. మంచి ఉద్దేశంతో ఇవన్నీ పెట్టినా ఆ తర్వాత ఉల్లంఘనలు పెరిగిపోయాయి. సర్కార్‌కు పీసీబీ జీ హుజూర్ పర్యావరణ చట్టాలు, నీటివనరులను కాపాడే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు వంటివి ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడంతో ప్రభుత్వ అధీనంలోని సంస్థగానే మిగిలిపోతోంది. అందువల్ల ఎన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా చూసీచూడనట్టు వదిలేయడంతో ఈ సంస్థ ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటుందనేది స్పష్టమౌతోంది. కేవలం తాగునీటితోనే ముడిపడలేదు ►ఈ జలాశయాల పరిరక్షణ కేవలం తాగునీటితోనే ముడిపడలేదు. పర్యావరణం, పచ్చ దనం, జీవవైవిధ్యంతోపాటు వాతావరణ మార్పుల నియంత్రణలో వీటి భాగస్వామ్యాన్ని అందరూ గ్రహించాలి. పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి.. వాటితో ముడిపడిన పచ్చదనం, జీవవైవిధ్యం మొత్తంగా మనచుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం. అందువల్ల వీటిలో దేనిని కాపాడుకోకపోయినా పర్యావరణం నాశనమైనట్టే. ఏదో కేవలం తాగునీటి వనరుల కోసం ఈ జలాశయాలపై ఆధారపడడం లేదని చెప్పి జీవో 111ను ఎత్తేస్తామనడం ఎంతమాత్రం సరికాదు. -
బకాయిలు..బాబోయ్!! హౌసింగ్ రుణాల్లో ‘మొండి బకాయిల’ భారం!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పోర్ట్‌ఫోలియో నాణ్యత మెరుగుపడినప్పటికీ, వాటి స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ)లు గత ఏడాది నవంబర్, డిసెంబర్‌ల్లో 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకుల రుణ నిబంధనావళి పరిధిలోకి హౌసింగ్ ఫైనాన్షియర్లను తీసుకు వస్తుండడం దీనికి నేపథ్యమని నివేదిక విశ్లేషించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గత ఏడాది నవంబర్ 12 వతేదీన రుణదాతలు అందరికీ వర్తించేలా కఠినమైన రుణ నాణ్యత రిపోర్టింగ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. తద్వారా హౌసింగ్ ఫైనాన్షియర్లు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) వాణిజ్య బ్యాంకుల నిబంధనావళి పరిధిలోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనలను 2021 డిసెంబర్ 31నాటికి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ గడువును 2022 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ఆర్బీఐ 2022 ఫిబ్రవరి 15వ తేదీన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో క్రిసిల్ ఆవిష్కరించిన నివేదికలోకి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మొండి బకాయిల్లో 2021–22 ప్రస్తుత (మార్చి) త్రైమాసికం ముగిసే నాటికి ఒక స్థిరీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. ► 2021 నవంబర్ తర్వాత కేవలం నెలరోజుల్లో (2021 డిసెంబర్ 31 నాటికి) చౌక గృహ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి స్థూల మొండిబకాయిలు 140 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఇతర ఫైనాన్షియల్ కంపెనీల విషయంలో ఏకంగా ఈ పెరుగుదల 3.3 శాతంగా ఉంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల అకౌంట్ల సవరణలు దీనికి కారణ. ఇలాంటి పరిస్థితి లేకపోతే ఎన్పీఏలు డిసెంబర్ నాటికి కేవలం 2.6 శాతం పెరిగేది. దీని ప్రకారం, కొత్త నిబంధనల నేపథ్యం వల్ల ఎన్పీఏలు 70 బేసిస్ పాయింట్లు పెరిగాయన్నమాట. అయితే 2022 మార్చి ముగిసే నాటికి 3 శాతానికి ఎన్పీఏలను పరిమితమయ్యే అవకాశం ఉంది. ► మరో రకంగా చెప్పాలంటే, కొత్త నిబంధనలు లేకపోతే రుణ నాణ్యత 40 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం కూడా ఉంది. ►హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలను వాణిజ్య బ్యాంకుల పరిధిలోనికి తీసుకురావడానికి సంబంధించి గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించినప్పటికీ, ఈ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే, ఇప్పటికే పలు హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేస్తున్నాయి. ► రుణాల విషయంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అనవసర వ్యయాల కట్టడి, వసూళ్ల విషయంలో మరింత వ్యవస్థాపరమైన పటిష్టత వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ► కాగా, ఎన్బీఎఫ్సీలకన్నా హెచ్ఎఫ్సీల రుణ నాణ్యత కొంత మెరుగ్గా వుండే అవకాశాలు ఉన్నాయి. ► రుణాల విషయంలో 95 శాతం ఉన్న 35 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను క్రిసిల్ తన నివేదిక కోసం అధ్యయనం చేసింది. -
రియల్ ఎస్టేట్ రంగానికి మరో ఎదురు దెబ్బ
కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. దేశంలో సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రీటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ.10 నుంచి 15కి పెరిగింది. ఇప్పుడు అదే సిమెంట్ ధర రూ.15 నుంచి రూ.20లకు పెరిగి రానున్న రోజుల్లో సిమెంట్ ధర రూ.400తో ఆల్ టైమ్ హై రికార్డ్‌కు చేరుకోనున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. అయితే సిమెంట్ ధరలు పెరగడానికి కారణం దేశంలో బొగ్గు, డీజిల్ ధరలు పెరగడమే కారణమని క్రిసిల్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నిర్మాణ రంగంపై భారం వాస్తవానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు 11-13 శాతం పెరిగినట్లు క్రిసిల్ అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం కరోనా లాక్డౌన్ల నేపథ్యంలో పరిశ్రమ దీన్ని వృద్ధిగా భావించట్లేదు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెరిగితే గానీ తమకు లాభాలు వచ్చే పరిస్థితి లేదని, మార్కెట్లో 75శాతం వాటా ఉన్నా 17 సిమెంట్ కంపెనీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు క్రిసిల్ తెలిపింది. సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి దేశంలోనే సిమెంట్ ధరలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా ధర రూ.54పెరిగింది.సెంట్రల్ రీజియన్‌లో రూ.20 పెరిగితే, ఉత్తరాది రాష్ర్టాల్లో రూ.12, పశ్చిమాది ప్రాంతాల్లో రూ.10, తూర్పు నగరాల్లో రూ.5 మేర పెరిగింది. ఆయా కంపెనీలను బట్టి మార్కెట్లో బస్తా ధర రూ.350 నుంచి రూ.400 పలుకుతుండగా.. ఈ క్రమంలో సిమెంట్ ధరలు మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి చేర్చగలవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. -
పల్లెకు ‘బదిలీ’ లేదు.. ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకే
►రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తున్న తరుణంలో పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీలకు ఏటా లక్షల రూపాయల ఆదాయం ట్రాన్స్ఫర్ డ్యూటీ రూపంలో లభించేది. ►ప్రస్తుతం బదిలీ సుంకాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలోనే వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో, ఆ రూపేణా గ్రామాలకు నిధులు సమకూరని పరిస్థితి ఏర్పడింది. సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ ఫీజులోని 1.5 శాతం బదిలీ సుంకం ద్వారా ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు వస్తున్న ఆదాయం ఇక మీదట ఆగిపోయే పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్ ఫీజును (స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ కలిపి) 6 శాతం నుంచి 7.5 శాతానికి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో గ్రామాలకు వెళ్లాల్సిన 1.5 శాతం బదిలీ సుంకాన్ని (ట్రాన్స్ఫర్ డ్యూటీ) కూడా రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలోనే వసూలు చేయాలని ప్రభుత్వం తాజా గా నిర్ణయించింది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీల ఆదాయమంతా నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరనుంది. గతంలో ఇలా.... గతంలో 6 శాతంగా ఉన్న మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజులో 4 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం బదిలీ సుంకం,, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద వసూలు చేసేవారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే వ్యత్యాసం లేకుండా రిజిస్ట్రేషన్ ఫీజు రాష్ట్ర వ్యాప్తంగా 0.5 శాతం తీసుకునేవారు. కానీ తాజా సవరణల్లో ఈ రిజిస్ట్రేషన్ ఫీజును గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విడివిడిగా ఖరారు చేశారు. తాజాగా పెంచిన ఉత్తర్వుల ప్రకారం అమ్మకపు లావాదేవీలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతంగానే కొనసాగించగా, గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని 2 శాతంగా ఖరారు చేశారు. దీంతో సమస్య వచ్చిపడింది. గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు కింద 2 శాతం, స్టాంపు డ్యూటీ 5.5 శాతం వసూలు చేస్తే ఇక ట్రాన్స్ఫర్ డ్యూటీ ఉండనట్టేనని అర్ధమవుతోంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 శాతం వసూలు చేస్తే అప్పుడు మొత్తం ఫీజు 9 శాతం అవుతుంది. అలా వసూలు చేయడం చట్టప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో రిజిస్ట్రేషన్ ఫీజును (స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ కలిపి) 7.5 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఏ రూపంలో వసూలు చేసినా మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా 7.5 శాతానికి మించకూడదు. అలా మించకూడదంటే ట్రాన్స్ఫర్ డ్యూటీని గ్రామాలకు మినహాయించాల్సిందేనని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. ఆర్థిక కష్టాలు తప్పనట్టే.. బదిలీ సుంకం ద్వారా పట్టణ శివారు గ్రామాలకు ఎక్కువగా లబ్ధి జరిగేది. అక్కడ జరిగే రియల్ వ్యాపారాన్ని బట్టి ప్రతి ఏటా రూ.4–5 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చేది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేని మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీలకు కూడా ఏటా రూ.50 వేల వరకు నిధులు వచ్చేవి. ఈ బదిలీ సుంకాన్ని సాధారణ నిధి (జనరల్ ఫండ్) కింద పరిగణిస్తుండడంతో ఆయా గ్రామాల సర్పంచ్ల విచక్షణ మేర గ్రామంలో అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు వినియోగించేవారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద గ్రామాలకు నిధులు బంద్ అయితే ఆ మేరకు గ్రామాలకు ఆర్థిక కష్టాలు తప్పవని పంచాయతీరాజ్ శాఖ వర్గాలంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీడీ మినహాయించాలంటే పంచాయతీరాజ్ శాఖ ద్వారానే ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందో.. గ్రామ పంచాయతీలు ట్రాన్స్ఫర్ డ్యూటీ రూపంలో నష్టపోనున్న మొత్తాన్ని ప్రభుత్వం ఏ రూపంలో సమకూరుస్తుందో వేచి చూడాల్సిందే...! గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ విలువలు భారీగా పెంపు రాష్ట్రంలో నిర్మాణాలకు సంబంధించిన విలువలను కూడా ప్రభుత్వం భారీగానే సవరించింది. రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్సీసీ/స్లాబ్) నిర్మాణాలకు గాను గతంలో పట్టణ ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.700గా ఉన్న విలువను ఇప్పుడు రూ.1,100గా నిర్ధారించారు. ఆర్సీసీయేతర నిర్మాణాలకు గతంలో రూ.380 ఉండగా, ఇప్పుడు చదరపు అడుగుకు రూ.750గా ఖరారు చేశారు. ఇలా స్లాబ్ నిర్మాణాల విలువలు పట్టణ ప్రాంతాల్లో 60 శాతం పెరగ్గా, నాన్ ఆర్సీసీ నిర్మాణాల విలువలు 100 శాతం వరకు పెరిగాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏకంగా దాదాపు 200 శాతం మేరకు విలువలు సవరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్సీసీ నిర్మాణాలకు గాను చదరపు అడుగుకు గతంలో రూ.440 ఉన్న విలువను ఇప్పుడు రూ.900కు (120 శాతం వరకు) పెంచారు. అదే నాన్ ఆర్సీసీ నిర్మాణాలకు సంబంధించి రూ.215గా ఉన్న చదరపు అడుగు విలువను దాదాపు 200 శాతం పెంపుతో రూ.600గా ఖరారు చేశారు. ఇలావుండగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెంపుదలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు ప్రక్రియ పూర్తయింది. -
అభివృద్ధిలో ప్రజా కోణం ఏది?
దేశానికి, ఆయా రాష్ట్రాలకు ఏ మోడల్ అవసరం అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అభివృద్ధి అంటే ఏమిటి? కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడమే అభివృద్ధి అవుతుందా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగితే అభివృద్ధి అవుతుందా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందని సంతోషపడ్డారు. బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల విలువ బాగా పెరిగిన మాట నిజం. కొన్ని ప్రతిష్టాత్మక ప్రాంతాలలో గజం లక్ష నుంచి రెండు లక్షల వరకు ధర పలుకుతుంది. అదే సమయంలో లక్షలాది మంది ఇళ్లు లేక, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. కాని స్థలాభావం కారణంగా ఆశించిన రీతిలో వాటిని ప్రభుత్వం నిర్మించలేక పోతోంది. గత కార్పొరేషన్ ఎన్నికలలో ఆ ప్రభావం కూడా పడి టీఆర్ఎస్కు నష్టం జరిగింది. తాజాగా కేసీఆర్ తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనుక్కోవచ్చని చెబుతున్నారు. గతంలో ఇది రివర్స్‌లో ఉందని ఆయన అన్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నడూ కేసీఆర్‌ను కానీ, టీఆర్ఎస్ నేతలను కానీ విమర్శించలేదు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నేతల స్వరంలో ఎందుకు మార్పు వచ్చిం దన్నది ఆసక్తికర అంశమే అవుతుంది. అభివృద్ధిలో మార్గాలు వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రణాళిక ప్రకారం నవరత్నాల హామీలను అమలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. పలువురు రెండు రాష్ట్రాల మధ్య పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. అది కేసీఆర్‌కు కాస్త చికాకుగా ఉంటోంది. ఉదాహరణకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని ఇక్కడ కార్మికులు కోరారు. కేసీఆర్ ఒప్పుకోలేదు. కాని ఏపీలో మాత్రం జగన్ చేసి చూపించారు. కేసీఆర్ కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు వంటి ప«థకం గత ఎన్నికలలో బాగా ఉపయోగపడింది. అలాగే జగన్ కూడా రైతు భరోసాతో పాటు అమ్మ ఒడి, చేయూత, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్లు ఇంటివద్దకు తీసుకు వెళ్లి ఇవ్వడం వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో అమరావతిలోనే మొత్తం డబ్బు అంతా ఖర్చు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించి రాజకీయంగా దెబ్బతిన్నారు. అయితే అమరావతి ముప్పై గ్రామాల పరిధిలో రాజధాని గ్రామాలలో అక్కడ అభివృద్ధి ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో ఆ 30 గ్రామాలు దాటి విజయవాడ వైపుకాని, గుంటూరు వైపు కాని భూముల ధరలు ఆ రోజుల్లోనే తగ్గిపోయాయి. దానికి తోడు రాజధాని గ్రామాలలో మినహా గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పొలాలను, స్థలాలను గ్రీన్ జోన్ కింద ప్రకటించడంతో అసలు కొనేవాడు లేకపోయాడు. అప్పటి నుంచే ఏపీలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందన్నది వాస్తవం. కాని కేసీఆర్ ప్రకటన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎంతో సంతోషం కలిగించింది. జగన్‌ను విమర్శించడానికి ఆయన ఈ పాయింట్ వాడుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి మూడు రాజధానుల విధానం ప్రతిపాదించారు. దాంతో అమరావతి ప్రాంతంలో రేట్లు కొంతమేర తగ్గాయి. కాని అదే సమయంలో విశాఖపట్నం, కర్నూలు తదితర ప్రాంతాలలో భూముల రేట్లు బాగా పెరిగాయి. విశాఖపట్నంలో అయితే ఎకరా భూమి వెల 107 కోట్ల రూపాయల వరకు ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతటా భూముల ధరలు పెరిగాయి. పేదలకు వసతుల కల్పనే అసలు అభివృద్ధి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేసీఆర్ పనిగట్టుకుని ఏపీని తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. జగన్ సోదరి షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్న నేపథ్యం ఏమైనా ఈ వ్యాఖ్యల వెనుక ఉందా? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం వస్తుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. భవిష్యత్తులో ఆమె ప్రకటించే విధానాలు, ఆమె యాత్రలలో వచ్చే స్పందనను బట్టి రాజ కీయం సాగుతుంది. ఆమె కూడా రాజన్న రాజ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కూడా వైఎస్ అభిమానులు గణనీయంగానే ఉన్నారు. ఒకవేళ షర్మిల పార్టీ వారిని ఆకర్షించితే టీఆర్ఎస్కు కూడా కొంత నష్టం జరగవచ్చు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రమేయం లేకపోయినా, టీఆర్ఎస్కు ఈ పరిణామం నచ్చలేదేమోననిపిస్తుంది. షర్మిలతో టీఆర్ఎస్ నేతలే పార్టీ పెట్టిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తుంటే, బీజేపీ చొరవతోనే ఆమె పార్టీ విషయంలో ముందుకు వెళుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరో మూడేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలలో వైఎస్ ప్రభావం తగ్గించడానికిగాను కేసీఆర్ రియల్ ఎస్టేట్ కామెంట్లు చేశారా అన్న అనుమానం వస్తోంది. అలాగే కేటీఆర్ ఆశ్చర్యకరంగా చంద్రబాబును పొగుడుతూ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. దళితులకు ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని ఎంతమేర నెరవేర్చారో టీఆర్ఎస్ నేతలు చెప్పవలసి ఉంటుంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ముప్పై లక్షల మందికి సెంటు నుంచి సెంటున్నర వరకు పేదలకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం ఆ పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్ సమకూర్చారు. ఇది అభివృద్ధిగా పరిగణించరా? కొందరు కేసీఆర్ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల భావనకు తొలుత ప్రాముఖ్యత వచ్చినా, ఆశించిన రీతిలో వాటి నిర్మాణం జరగలేదు. అది కొంత ఆయనకు మైనస్ అయింది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కేసీఆర్ తెలివిగా రియల్ ఎస్టేట్ పెరిగిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ముఖ్యం రియల్ ఎస్టేట్ అన్నది ఆయా పరిస్థితులను బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. హైదరాబాద్ పలుమార్లు ఆటుపోట్లు ఎదుర్కొంది. హైదరాబాద్‌లో ఇళ్లు లేని పేదలకు ఏపీలో మాదిరి ఇక్కడ ప్రభుత్వం స్థలాలు ఇవ్వగలదా? అన్నదానికి సమాధానం దొరకదు. ఏపీలో గతంలో మాదిరి స్పెక్యులేషన్ ఉండకపోవచ్చు. అంతమాత్రాన తెలంగాణలో కన్నా ఏపీలో భూముల రేట్లు తక్కువగా ఉన్నాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. కేసీఆర్ మాటలు మోతుబరులకు అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంటే, ఏపీలో మాత్రం పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి. రియల్ ఎస్టేట్ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై లక్షల మంది పేదలకు సెంటు నుంచి సెంటున్నర వరకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్ సమకూర్చారు. ఇది అభివృద్ధి కాదా? కొందరు కేసీఆర్ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి. వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
రియల్ ఎస్టేట్ మళ్లీ జోరందుకుంది
సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ వేగం పుంజుకుంది. లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతుల జారీ ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో రియల్ ఎస్టేట్ లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ దాదాపుగా స్తంభించిపోయింది. ఆ తర్వాత క్రమంగా లాక్డౌన్ నిబంధనల సడలింపుతో గత ఏడాది ద్వితీయార్థం నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్ల రిజిస్ట్రేషన్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అన్నిరకాల అనుమతులను నిర్ణీత కాలంలో జారీచేస్తుండడం కూడా ఇందుకు దోహదపడుతోంది. ఆన్లైన్లో అనుమతులు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు అన్నింటికీ పురపాలక శాఖ ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అత్యంత పారదర్శకంగా అనుమతులు జారీచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ లే అవుట్లకు అయితే 21 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి అనుమతులివ్వాలి. అపార్టుమెంట్లు, ఇతర భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులు జారీచేయాలి. ఆ నిర్ణీత గడువు ముగియగానే ‘డీమ్డ్ టు బి అప్రూవ్డ్’గా.. అంటే, అనుమతులు జారీ అయినట్లుగానే పరిగణించేలా కూడా విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇది రియల్టర్లతోపాటు సామాన్య భవన నిర్మాణదారులకు కూడా ఎంతో సానుకూలంగా ఉంది. ►రాష్ట్రంలో 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే.. 2018–19లో 613 ఎకరాల్లో కేవలం 98 లేఅవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అదే.. 2019–20లో 2,777 ఎకరాల్లో 326 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మూడు రెట్లు పెరిగాయి. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇక 2020–21లో కరోనా మహమ్మారి ప్రతికూల పరిస్థితులను అధిగమించి మరీ రికార్డు స్థాయిలో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు చేయడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నాటికి ఏకంగా 2,633 ఎకరాల విస్తీర్ణంలో 330 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి దాదాపు 500 లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈ ఏడాది లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మొదటిస్థానంలో కొనసాగుతోంది. ►అలాగే, రాష్ట్రంలో 110 పట్టణ స్థానిక సంస్థల్లో.. 44 ప్రధాన మున్సిపాల్టీల్లో 2018–19లో కేవలం 29 లేఅవుట్లకు 150 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలెత్తడంతో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంది. 2019–20లో 65 లేఅవుట్లకు 428 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే, 2020–21లో కరోనా పరిస్థితులను అధిగమిస్తూ జనవరి 21నాటికి 55 లేఅవుట్లకు 317 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 550 ఎకరాల్లో 75 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు అవుతాయని భావిస్తున్నారు. ►గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే తీరులో రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతోంది. 2018–19లో 897 ఎకరాల్లో 175 లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు కాగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019–20లో 176 లేఅవుట్లకు 1,284 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. 2020–21లో ఇప్పటికే 73 లేఅవుట్లకు 460 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు చేశారు. భవన నిర్మాణాల్లోనూ విశాఖ, కృష్ణా ముందంజ రాష్ట్రంలో అపార్ట్మెంట్లు, ఇతర భవనాలు, ఇళ్ల నిర్మాణం కూడా ఊపందుకుంది. మున్సిపల్ శాఖ రికార్డు స్థాయిలో భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. ►రాష్ట్రంలో 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 2020, జనవరి 20 నాటికి 2,136 భవన నిర్మాణ అనుమతులు జారీచేశారు. ►ఇక రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2020, జనవరి 20 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,59,574 అపార్టుమెంట్లు, ఇతర భవనాలు, ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1,42,507 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. ►వీటిలో 20,197 అనుమతులతో విశాఖ జిల్లా మొదటిస్థానంలో ఉంది. ►17,247 భవన నిర్మాణ అనుమతులతో ‘కృష్ణా’ రెండో స్థానంలో.. ►15,247 అనుమతులతో పశ్చిమ గోదావరి జిల్లా మూడో స్థానంలో ఉంది. ఆక్యుపెన్సీ రేటూ పెరిగింది రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలోని కొత్త భవన నిర్మాణాల్లో ఆక్యుపెన్సీ కూడా బాగా పెరుగుతోంది. పురపాలక శాఖ అన్ని అనుమతులు ఆన్లైన్ విధానంలో జారీచేస్తుండటం రియల్టర్లు, సామాన్యులకు సౌలభ్యంగా మారింది. వార్డు సచివాలయాలు కేంద్రంగా కార్యకలాపాలు సాగుతుండటంతో నిర్మించిన భవనాలను పరిశీలించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీచేయడం సరళంగా మారింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నాటికి రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల పరిధిలో ఆక్యుపెన్సీ ఫీజుల రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం సమకూరింది. 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రూ.3.703 కోట్లు వసూలైంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ పురపాలక శాఖకు ఆక్యుపెన్సీ ఫీజుల రూపంలో రూ.10.39 కోట్లు ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక ఏడాది ముగిసేనాటికి దాదాపు రూ.12కోట్లు సమకూరుతుందని ఆ శాఖ అంచనా వేస్తోంది. గత నాలుగేళ్లలో ఆక్యుపెన్సీ ఫీజుల్లో ఇదే అత్యధికం. ఆక్యుపెన్సీ దరఖాస్తులకూ అనుమతులు ఇక 2020–21లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం ఇంతవరకు 2,893 దరఖాస్తులు రాగా వాటిలో 2,572 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. తద్వారా రాష్ట్రంలో కొత్తగా 19,242 గృహ యూనిట్లు వాడుకలోకి వచ్చాయి. 15 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన 112 దరఖాస్తులతో 100 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. తద్వారా కొత్తగా 2,207 గృహ యూనిట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ విషయంలో విశాఖ మొదటి స్థానంలో ఉండగా.. కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సరళంగా అనుమతుల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో అన్ని రకాల అనుమతులు నిర్ణీత వ్యవధిలో పారదర్శకంగా జారీచేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా మళ్లీ గాడిలో పడింది. దాంతో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు వేగం పుంజుకున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి అన్ని అనుమతులు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తుండటంతో సామాన్యులకు సౌలభ్యంగా ఉంది. – వి.రాముడు, డైరెక్టర్, పట్టణ ప్రణాళిక విభాగం మళ్లీ మంచి రోజులు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. కొత్త వెంచర్లు, అపార్టుమెంట్ల నిర్మాణం ఊపందుకుంటోంది. స్వస్థలాలకు వెళ్లిపోయిన భవన నిర్మాణ కార్మికులు కూడా తిరిగి వస్తున్నారు. రియల్టర్లు చెల్లిస్తున్న లేబర్ సెస్‌ను ‘రెరా’ కార్మికులకు విడుదల చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. నిర్మాణ సామగ్రి ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – మద్దులూరి హరి ప్రేమ్‌నాథ్, అధ్యక్షుడు, క్రెడాయ్, ఒంగోలు శాఖ -
ఎవరీ మహేష్.. హత్యకు కారణం ఏంటి?
సాక్షి, విజయవాడ: బెజవాడ శివారులో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలసి మద్యం సేవిస్తున్న ఓ యువకుడిని కొందరు ఆగంతకులు కిరాతంగా కాల్చిచంపారు. మృతుడు నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ గజకంటి మహేష్(33)గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటన శనివారం అర్ధరాత్రి నున్న బైపాస్‌రోడ్డు ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. మహేష్ తన నలుగురు స్నేహితులు కుర్ర హరి కృష్ణ(24), ఉయ్యూరు దినేష్(29), యండ్రపతి గీతక్ సుమంత్ అలియాస్ టోనీ, కంచర్ల అనుదీప్ అలియాస్ దీపులతో కలిసి శనివారం రాత్రి నున్న బైపాస్ రోడ్డులోని ఓ బార్లో మద్యం కొనుగోలు చేసి.. నున్న మ్యాంగో మార్కెట్ వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి రోడ్డుపైనే కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో సిగరెట్లు, బీరు సీసాలు ఖాళీ అవడంతో మహేష్ స్నేహితులు టోనీ, అనుదీప్ తీసుకొచ్చేందుకు బార్ వద్దకు వెళ్లారు. ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి 7.65 ఎంఎం తుపాకీ చూపించి డబ్బులు కావాలంటూ అకారణంగా మహేష్‌తో గొడవ పెట్టుకున్నారు. పక్కనున్న స్నేహితులు గొడవ ఎందుకని సర్ది చెబుతుండగానే వెనుక ఉన్న వ్యక్తి తుపాకీతో మహేష్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మహేష్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఘటన అనంతరం పారిపోదామనుకున్న నిందితులు ఒకరు స్కూటీపై మరొకరు బాధితుల కారులో పారిపోయారు. కొంత దూరం వెళ్లాక ముస్తాబాద్ రోడ్డులో వదిలేశారు. రక్తపు మడుగుల్లో ఉన్న మహేష్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ హాస్పిటల్‌కు స్నేహితులు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అసలు ఎవరీ మహేష్.. విజయవాడ క్రీస్తురాజుపురం ప్రాంతానికి చెందిన గజకంటి మహేష్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మహేష్ తండ్రి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కొంతకాలం క్రితం చనిపోవడంతో మహేష్‌కు ఆ ఉద్యోగం లభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పోలీసు కంట్రోల్ రూమ్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే కారణంతో ఈ ఏడాది మే నెలలో సీపీ ద్వారకా తిరుమలరావు మహేష్‌ను సస్పెండ్ చేశారు. సెప్టెంబరు చివరాఖరున సస్పెన్షన్ ఎత్తివేశాక గత 15 రోజుల కిందట విధుల్లో చేరాడు. మహేష్‌కు 2015లో వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. కారణం ఏంటి? భార్యతో విడాకులు తీసుకున్న మహేష్ నగరంలోని ఓ మహిళా డాక్టర్‌తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తెలిసింది. అలానే మహేష్ సోదరి వరసయ్యే ఓ మహిళ గుంటూరుకు చెందిన ఓ వివాహితుడితో ప్రేమయాణం సాగిస్తున్నట్లు.. దీనికి మహేష్ సాయం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం గ్రహించిన ఆ వివాహితుడి భార్య తరపు వ్యక్తులు కానీ, మహేష్ ప్రేమిస్తున్న డాక్టర్ తరపు వ్యక్తులు కానీ.. లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలెత్తిన వివాదాలు కానీ మహేష్ హత్యకు దారి తీశాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలు.. ఈ కేసును ఛేదించేందుకు నగర పోలీసు కమిషనర్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ హత్య మిస్టరీగానే ఉంది. పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. -
డాలర్ సిరి.. హెచ్ 1బీ వీసా ఉంది మరి
మారుతున్న ట్రెండ్.. స్వదేశంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి బదులుగా అమెరికాలో విలాసవంతమైన జీవనం గడపాలనుకునే భారతీయుల సంఖ్య నాలుగైదేళ్లుగా పెరుగుతోంది. ఎటూ కొన్నాళ్లకు గ్రీన్‌కార్డు వస్తుంది కదా... ఇల్లు కొను క్కుంటే బాగుంటుందని అను కుంటున్న వాళ్ల సంఖ్య పెరుగు తోంది. అదీ అత్యంత విలాస వంతమైన గృహాల కొనుగోలుకు ఎక్కువ మంది భారతీయులు ఇష్టపడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోట సోషియాలజీ ప్రొఫెసర్ ఎలిజబెత్ హెగర్ బోయ్లే ఓ నివేదికలో ప్రస్తావించారు. ఆయన బృందం భారతీయులు ఎక్కువగా నివసించే శాన్‌జోస్, డాలస్, హ్యూస్టన్, న్యూజెర్సీ, షికాగో, బోస్టన్, అట్లాంటా వంటి నగరాల్లో సర్వే నిర్వహించింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘పొద్దుంటే మాపుండదు, మాపుంటే రేపుండదు.. బతుకులేమో ఎండిపాయే, మొండిమాను బతుకులాయే’ ఓ సినిమాలో ఈ పాట చరణం కర్ణాటక రాష్ట్రంలోని షిమోగలో ఒక నిరుపేద కుటుంబానికి అక్షరాలా వర్తిస్తుంది. కూలీ పనులు చేస్తూ ఓ పూట తిని ఓ పూట ఉపవాసం ఉంటూ చదివించిన కొడుకు అమెరికా వెళ్లి ఉద్యోగంలో స్థిరపడి ఐదేళ్ల తరు వాత (1990 దశకంలో ఆఖరులో) సొంతూ రుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్ అద్దెకు తీసుకుని వెళ్లిన ఘటనను జాతీయ పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. విదేశీ సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి అమెరికా తీసుకు వచ్చిన హెచ్1బీ వీసా అతని కలను సాకారం చేసింది. అంతేకాదు లక్షలాది మంది భారతీయ కుటుంబాల్లో సిరులు నింపింది. 2017లో భార తీయ ఐటీ ఉద్యోగులు ఇక్కడకు బదిలీ చేసిన మొత్తం రూ.4.42 లక్షల కోట్లు (65 బిలియన్ డాలర్లు). ఈ మొత్తం ఆ ఏడాది దేశంలోని 16 రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ. భారతీయులు అమెరికా వెళ్లడం 1970 దశకంలో మొదలైనా అత్యంత ధనవంతులైన పెట్టుబడిదారులు, వైద్యులకు మాత్రమే అవకాశం ఉండేది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను గమనించి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి 1990 దశకం మధ్యలో అమెరికా తీసుకువచ్చిన హెచ్1బీ వీసా విధానం తెలుగు రాష్ట్రాల్లో వేలాది దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటునిచ్చింది. హెచ్1బీ వీసా విధానానికి పూర్వం (1995కి ముందు) అమెరికా నుంచి భారత్‌కు బదిలీ అయిన మొత్తం 5 బిలియన్ డాలర్లుకాగా ఈ వీసాతో ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభమైన తరువాత మొదటి ఏడాది భారత్‌కు తరలివచ్చిన నగదు 6 బిలియన్ డాలర్లు. ఆ పరంపర 24 సంవత్సరాలుగా కొనసాగుతూ అమెరికా నుంచి వస్తున్న డబ్బు ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గిన దాఖలా కనిపించలేదు. 1998లో 10 బిలియన్ డాలర్లను తాకిన విదేశీ సంపద... 2014కు వచ్చేసరికి గరిష్టంగా 70 బిలియన్ డాలర్లు (రూ. 3.22 లక్షల కోట్లు) దాటింది. ఆ తరువాత అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కొంత మార్పు వచ్చి అక్కడే ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేయడం ప్రారంభించడంతో 2017కు వచ్చేసరికి 5 బిలియన్లు తగ్గి 65 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత 2–3 ఏళ్లలో భారతీయ అమెరికన్లలో బాగా మార్పు కనిపించిందని, పుట్టిన పిల్లలను అమెరికాలోనే చదివించడం, విలాసవంతమైన ఇళ్లు, కార్లు కొనుగోలు చేయడం వంటి చర్యల ఫలితంగా భారత్‌కు పంపుతున్న మొత్తం తగ్గుతూ వస్తోందని యూనివర్సిటీ అఫ్ మిన్నెసోట అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు... వేలాది మంది భారతీయ అమెరికన్లు మిలియనీర్లు అయ్యారని ఆ అధ్యయనం విశ్లేషించింది. గ్రీన్‌కార్డు (శాశ్వత నివాసం) కలిగి ఉన్న వాళ్లే కాదు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ మిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ నికర విలువగలవారు 26 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. 13 ఏళ్ల క్రితమే 40 బిలియన్ డాలర్లు... సమాచార సాంకేతిక రంగంలో పనిచేసే నిపుణులు భారత్ నుంచి ఏటా వేల సంఖ్యలో అమెరికాకు తరలివెళ్లడంతో 2000 దశకం రెండో భాగం నుంచి భారీగా డాలర్లు వచ్చిపడ్డాయి. 2005కు ముందు 20 బిలియన్ డాలర్లు మాత్రమే బదిలీకాగా ఆ తరువాత మూడేళ్లకు (2008) అది 50 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. దాదాపు ఆరేడు సంవత్సరాలపాటు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు సంపాదించిన మొత్తంలో 65 శాతానికిపైగా స్వదేశానికి పంపారు. ఏటేటా ఇక్కడి నుంచి వెళ్లే సాంకేతిక నిపుణుల సంఖ్య పెరగడంతో 2014కు వచ్చేసరికి 70 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఆ తరువాత మూడేళ్లపాటు కొంత మేర తగ్గడానికి భారతీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడమే ప్రధాన కారణం. దానికితోడు ఎప్పుడు వస్తుందో తెలియని వలస ఆధారిత ప్రతిభ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడటం కంటే ఈబీ–5 (అర మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే వచ్చే గ్రీన్‌కార్డు) పథకానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. గడచిన మూడేళ్లలో హెచ్1బీపై ఉద్యోగం చేస్తున్న లేదా వారి భాగస్వాములు 38 వేల మంది ఈబీ–5 సథకానికి దరఖాస్తు చేశారు. మామూలుగా 8–10 ఏళ్లు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడటం కంటే 5 లక్షల డాలర్లు అమెరికా మౌలిక సదుపాయాల సంస్థల్లో పెట్టుబడి పెడితే ఏడాదిలో గ్రీన్‌కార్డు తెచ్చుకోవచ్చన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టారు. ఇండియా తరువాత ఛైనా... అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్వదేశానికి డబ్బు పంపుతున్న దేశాల జాబితాలో భారత్‌దే అగ్రస్థానం. 2014, 2015లలో అమెరికా నుంచి భారత్‌కు 70 బిలియన్ డాలర్లు వస్తే 2016లో 68 బిలియన్ డాలర్లు, 2017లో 65 బిలియన్ డాలర్లు వచ్చిపడింది. భారత్ తరువాత స్థానం చైనాదే. 2012కు ముందు అగ్రస్థానంలో ఉన్న చైనా 2013 నుంచి భారత్ కంటే వెనుకబడింది. చైనీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టడం వల్లే భారత్ మొదటి స్థానంలోకి వచ్చిందని, సంపాదనలో భారత్ కంటే వారిదే పైచేయి అని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 2017లో భారత్ తరువాత స్థానంలో చైనా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఫ్రాన్స్, నైజీరియా, పాకిస్తాన్, ఈజిప్ట్, జర్మనీ, వియత్నాం ఉన్నాయి. స్టాన్‌ఫర్డ్ నివేదిక ప్రకారం భారత్ నుంచి అమెరికా వచ్చిన వారిలో 89 శాతం మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారే. సహజంగా ఆ రుణం తీర్చడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రెండో ప్రాధాన్యతగా స్వదేశంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు డబ్బు పంపారు. ‘రియల్’కు ఊతమిచ్చిన అమెరికా డాలర్... అమెరికాలో హెచ్1బీపై ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటంతో వారు స్వదేశానికి డబ్బు బదిలీ చేయడం కూడా అంతే స్థాయిలో పెరిగింది. హైదరాబాద్, పుణే, విశాఖపట్నం, భువనేశ్వర్, నోయిడా, జైపూర్, నాగ్‌పూర్ వంటి పట్టణాలు, నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి అమెరికా డాలర్ పాత్ర గణనీయమైనదని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మానవాభివృద్ది విభాగం అసొసియేట్ ప్రొఫెసర్ ఆంటోని లైజింగ్ అంటోనియో పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఓ బృందం భారత్, చైనాలకు చెందిన 1,100 మంది హెచ్1బీ, 550 మంది గ్రీన్‌కార్డు కలిగిన వారిని ఆదాయానికి సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టింది. వాటి ప్రకారం చూస్తే భారత్‌కు డబ్బు పంపిన వారిలో 74 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టామని చెప్పారు. మరో 16 శాతం మంది తమ కుటుంబాల ఉన్నతికి ఖర్చు చేశామని పేర్కొనగా 8 శాతం మంది డాలర్ రేటు పెరిగినప్పుడల్లా రూపాయల్లో ఎక్కువ సొమ్ము వస్తుందన్న ఉద్దేశంతో బదిలీ చేశామన్నారు. రెండు శాతం మంది తాము అమెరికాలోనే ఇల్లు, కార్లు కొనుగోలు చేయడానికి ఖర్చు చేశామని వివరించారు. ఊరికి ఇద్దరు లేదా ముగ్గురు... డాలర్ డ్రీమ్ తెలుగు రాష్ట్రాలను గత పదేళ్లుగా ఊపేస్తోంది. ఒకరిని చూసి మరొకరు అప్పు చేసైనా సరే అమెరికా వెళ్లాలనే పట్టుదల పెరిగింది. ఊరికి ఇద్దరు లేదా ముగ్గురు అమెరికాలో ఉన్నారు. వెళ్లాలనుకునేవారు ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే జీఆర్ఈ, టోఫెల్ శిక్షణకు వెళ్తున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో ఈ శిక్షణా సంస్థలు విపరీతంగా వెలిశాయి. అప్పులు ఇస్తామంటూ బ్యాంకులు ఉదారంగా ముందుకు వస్తున్నాయి. 2010కి ముందు ఏటా రూ. 1,500–2,000 కోట్ల మధ్య విద్యా రుణాలు ఇచ్చిన భారతీయ బ్యాంకులు... 2012 తరువాత రుణాలను 12 వేల కోట్లకు పెంచాయి. -
ఎయిర్పోర్ట్ పేరుతో రియల్ఎస్టేట్ వ్యాపారం
-
వసూళ్ల దందా..!
- సివిల్ కేసులపైనే పోలీసుల కన్ను - ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు - యల్ ఎస్టేట్ నుంచి ఇసుక దాకా అంతా వారి కనుసన్నల్లోనే... - టార్గెట్లు పెడుతున్న ఉన్నతాధికారులు? సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో పోలీసులు నింది తులు, ఫిర్యాదులదారుల నుంచి వసూళ్లు చేస్తూ తమ ప్రత్యేక శైలిని చాటుకుంటున్నారు. ఏఎస్ఐలు, సీనియర్ పోలీసు సిబ్బందిని సెటిల్మెంట్లు, వసూళ్ల కోసం పురమాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. చాలాచోట్ల ఇటీవలే పోలీసు ఉద్యోగంలోకి వచ్చిన ఎస్ఐలను పక్కన పెట్టి కొందరు సిబ్బంది వసూళ్లకు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులతో చెలరేగుతున్న ఇసుక మాఫియాకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అండగా నిలుస్తున్నారు. ఉన్నతాధికారులకు కూడా రెగ్యులర్ మామూళ్లు ఇస్తూ బుట్టలో వేసుకుని కిందిస్థాయి పోలీసు సిబ్బంది చెలరేగి పోతున్నారు. సర్కిల్, డివిజన్ స్థాయి అధికారులు కిందిస్థాయి అధికారులకు నెల మామూళ్ల కోసం టార్గెట్లు విధిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. చిల్లర కేసులు మొదలు.. చిన్నా చితకా కేసులు మొదలకుని రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల దాకా ఏ ఒక్క అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా సాగే షాద్‌నగర్, మహబూబ్‌నగర్ ప్రాంతంలో కొందరు అధికారులు ఏకంగా వ్యాపారంలో భాగస్వాములుగా చేరి చక్రం తిప్పుతున్నారు. రియల్ వ్యాపారంలో ఎదురయ్యే చిన్నా చితక సమస్యల్లో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇసుక వ్యాపారం జోరుగా సాగే మండలాల్లో పోస్టింగులు తెచ్చుకుంటున్న కొందరు అధికారులు అడ్డు తగిలే స్థానికులపై కేసుల నమోదు పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. మహిళపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, వ్యక్తుల అదృశ్యం, దోపిడీ ఘటనలు నిత్యం జిల్లాలో ఏదో మూలన చోటు చేసుకుంటున్నాయి. వీటిని అరికట్టాల్సిన పోలీసుల దృష్టి సొంత దందాలపైనే ఎక్కువగా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి.