స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని చెల్లించాలా? వద్దా? అనే అంశంపై త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ..రెరాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయని, అందువల్ల జీఎస్టీ విధించడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై పన్ను విధించడమేనని తెలిపారు.
ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం అక్టోబర్ 7, 2023న జరిగింది.
ఇక రెరా జీఎస్టీ చెల్లించే విషయంపై అకౌంటింగ్ అండ్ అడ్వైజరీ నెట్ వర్క్ సంస్థ మూర్ సింఘి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ మోహన్ మాట్లాడుతూ.. జూలై 18, 2022కి ముందు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ జీఎస్టీకి లోబడి లేవని అన్నారు.
ఈ సందర్భంగా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనుమతించబడదు అంటే జీఎస్టీ నుంచి రెరాను మినహాయిస్తే సానుకూల ఫలితాలే ఎక్కువ అని అన్నారు. రెరా జీఎస్టీ చెల్లించే అవసరం లేకపోతే డెవలపర్‌లు, గృహ కొనుగోలుదారులు ఇద్దరికీ ఖర్చులు తగ్గుతాయి. తత్ఫలితంగా రంగానికి గణనీయంగా లాభదాయకంగా ఉంటుందని అని మోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment