
రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు(రీట్స్), చిన్న, మధ్యతరహా(ఎస్‌ఎం) రీట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు(ఇన్విట్స్)లను ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్‌గా వినియోగించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. రిస్క్ హెడ్జింగ్‌కు వీలుగా వీటి వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. వీటికితోడు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లకు వర్తించే నిబంధనల బాటలో స్పాన్సర్లతోపాటు.. తమ గ్రూప్‌లకు లాక్‌డ్‌ఇన్ రీట్స్, ఇన్విట్స్ యూనిట్ల బదిలీకి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. తద్వారా ఆయా సంస్థలు తమ ఆర్థిక లక్ష్యాలను వీడకుండా సొంత హోల్డింగ్స్ నిర్వహణకు వీలు చిక్కనుంది.
ఇదీ చదవండి: త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..
రీట్స్, ఇన్విట్స్ లెవరేజ్ మదింపులో ఫిక్స్‌డ్ డిపాజిట్లను నగదుకు సమానంగా పరిగణించేందుకు వీలు కల్పించనుంది. ఈ బాటలో రీట్, ఇన్విట్ సమీకరణకు క్రెడిట్ రేటింగ్ అవసరాలు, ఆయా సంస్థల బోర్డులలో ఖాళీలకు సభ్యుల ఎంపిక గడువు, ఆస్తుల మూలాల విస్తరణ తదితర అంశాలపై మార్గదర్శకాలకు తెరతీయాలని ప్రతిపాదించింది. ఇక మరోవైపు రీట్స్‌ను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించేలా ప్రతిపాదించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు రీట్స్, ఇని్వట్స్ సులభతర వ్యాపార నిర్వహణకు వీలైన చర్యలకు తెరతీయాలని సెబీ తాజా ప్రతిపాదనలలో అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment