అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన తాజా ఆరోపణలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. హిండెన్ బర్గ్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ తాజాగా నివేదిక స్పష్టంగా తెలుపుతుందని అన్నారు.
చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ సెబీ.. సమగ్రత, దాని చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో రాజీ పడింది అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.
అంతేకాదు,సెబీ చైర్‌పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
The integrity of SEBI, the securities regulator entrusted with safeguarding the wealth of small retail investors, has been gravely compromised by the allegations against its Chairperson.
Honest investors across the country have pressing questions for the government:
- Why… pic.twitter.com/vZlEl8Qb4b— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2024
Comments
Please login to add a commentAdd a comment