అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్ని సుప్రీం కోర్ట్ ప్యానల్ తప్పుపట్టింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల్ని ఉల్లంఘించ లేదని తెలిపింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి.
గత శుక్రవారం అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ విలువ 9.34 లక్షల కోట్లు ఉంది. అయితే, సుప్రీం కోర్ట్ ప్రకటనతో.. సోమవారం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ కంపెనీ స్టాక్స్ దూసుకెళ్లాయి. వెరసీ ఆ సంస్థ విలువ అమాంతం పెరిగి రూ.10 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ వ్యాల్యూ ఈ ఒక్క రోజే 18 శాతం పెరిగింది. అదానీ విల్ మార్ 10 శాతం, అదానీ పోర్ట్స్ 8.15శాతం అంబుజా సిమెంట్ 6 శాతానికి చేరుకున్నాయి.
173 పేజీల నివేదిక విడుదల
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై ఖండిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఒపీ భట్, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉన్న కమిటీ 173 పేజీల నివేదికను విడుదల చేసింది. అందులో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచే చర్యలు,సెబీ చేసిన దర్యాప్తులో అదానీ గ్రూప్ అవకతవకలు పాల్పడినట్లు ఎక్కడా కనిపించలేదని సూచించింది.
చదవండి👉 ఈవీ బైక్ కొనుగోలు దారులకు భారీ షాక్.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు?
Comments
Please login to add a commentAdd a comment