REITs
-
రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్ ఏయూఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల (ఇన్విట్స్) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 21 లక్షల కోట్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) పోర్ట్‌ఫోలియోలోని 125 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ వచ్చే కొన్నేళ్లలో 4 రెట్లు పెరిగి 400 మిలియన్ చ.అ.లకు చేరనుంది.బుధవారమిక్కడ ఈ సాధనాలపై రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రీట్స్, ఇన్విట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ విషయాలు తెలిపారు. సాధారణంగా రియల్టీ, ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరమవుతుందని, కానీ రీట్స్, ఇన్విట్స్ ద్వారా చాలా తక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రీట్స్‌లో కనిష్టంగా రూ. 100–400కి కూడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఎఫ్‌వో ప్రీతి ఛేడా, హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ సీఎఫ్‌వో అభిషేక్ ఛాజర్, నెకస్స్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈవో రాజేష్ దేవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశీయంగా 26 ఇన్విట్స్ ఉండగా, లిస్టెడ్ రీట్స్ నాలుగు ఉన్నాయి. -
ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్
దేశీయంగా తొలిసారి రిజిస్టర్డ్ స్మాల్ మీడియం (ఎస్ఎం) రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్) పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. డిసెంబర్ 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. తద్వారా రూ.353 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వెల్లడించింది. సంస్థ నుంచి వెలువడుతున్న తొలి ఎస్ఎం రీట్ పథకం ప్రాప్‌షేర్ ప్లాటినాకు రూ.10–10.5 లక్షల ధరల శ్రేణిని ప్రకటించింది.ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఎలాంటి యూనిట్లను ఆఫర్ చేయకపోగా.. పూర్తిగా ప్లాటినా యూనిట్లను జారీ చేయనున్నట్లు ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(పీఎస్‌ఐటీ) పేర్కొంది. ఇష్యూ నిధులను ప్లాటినా ఎస్పీవీకిగల ప్రెస్టీజ్ టెక్ ప్లాటినా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రాప్‌షేర్ ప్లాటినా తరహా ఎస్ఎం రీట్స్వల్ల ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడులకు వీలు కలగనున్నట్లు ప్రాపర్టీ షేర్ డైరెక్టర్ కునాల్ మోక్టన్ తెలియజేశారు. నిరవధిక అద్దె రిటర్నులు(ఈల్డ్స్), పెట్టుబడుల వృద్ధి ద్వారా హైబ్రిడ్ రాబడులకు వీలున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!ప్రాప్‌షేర్ ప్లాటినా 2,46,935 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని కలిగి ఉంది. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్‌వద్ద ప్రెస్టీజ్ టెక్ ప్లాటినాకు చెందిన లీడ్ గోల్డ్ ఆఫీస్ బిల్డింగ్‌లో ఈ ఆస్థిని కలిగి ఉంది. యూఎస్ టెక్ కంపెనీకి పూర్తిస్థాయిలో 9 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఇందుకు 4.6 ఏళ్ల సగటు వెయిటేజీ లాకిన్తోపాటు ప్రతీ మూడేళ్లకు 15 శాతం అద్దె పెంపు ప్రాతిపదికను ఎంపిక చేసుకుంది. వెరసి తాజా పథకం 2026లో ఇన్వెస్టర్లకు 9 శాతం పంపిణీ ఈల్డ్‌ను అంచనా వేస్తోంది. 2027లో 8.7 శాతం, 2028లో 8.6 శాతం చొప్పున రిటర్నులకు వీలుంది. యూనిట్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
రీట్స్, ఇన్విట్స్తో రిస్క్ హెడ్జింగ్
రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(రీట్స్), చిన్న, మధ్యతరహా(ఎస్ఎం) రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఇన్విట్స్)లను ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్‌గా వినియోగించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. రిస్క్ హెడ్జింగ్‌కు వీలుగా వీటి వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. వీటికితోడు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లకు వర్తించే నిబంధనల బాటలో స్పాన్సర్లతోపాటు.. తమ గ్రూప్‌లకు లాక్డ్ఇన్ రీట్స్, ఇన్విట్స్ యూనిట్ల బదిలీకి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. తద్వారా ఆయా సంస్థలు తమ ఆర్థిక లక్ష్యాలను వీడకుండా సొంత హోల్డింగ్స్ నిర్వహణకు వీలు చిక్కనుంది.ఇదీ చదవండి: త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..రీట్స్, ఇన్విట్స్ లెవరేజ్ మదింపులో ఫిక్స్డ్ డిపాజిట్లను నగదుకు సమానంగా పరిగణించేందుకు వీలు కల్పించనుంది. ఈ బాటలో రీట్, ఇన్విట్ సమీకరణకు క్రెడిట్ రేటింగ్ అవసరాలు, ఆయా సంస్థల బోర్డులలో ఖాళీలకు సభ్యుల ఎంపిక గడువు, ఆస్తుల మూలాల విస్తరణ తదితర అంశాలపై మార్గదర్శకాలకు తెరతీయాలని ప్రతిపాదించింది. ఇక మరోవైపు రీట్స్‌ను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించేలా ప్రతిపాదించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు రీట్స్, ఇని్వట్స్ సులభతర వ్యాపార నిర్వహణకు వీలైన చర్యలకు తెరతీయాలని సెబీ తాజా ప్రతిపాదనలలో అభిప్రాయపడింది. -
‘నేరుగా బ్యాంకు నుంచే రుణాలు ఇప్పించండి’
బ్యాంకుల నుంచి నేరుగా రుణాన్ని పొందే సదుపాయాన్ని కల్పించాలని భారత స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్) పరిశ్రమ ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ)ను కోరింది. దాంతోపాటు రీట్స్‌ను ఈక్విటీలుగా వర్గీకరించాలని తెలిపింది. ప్రస్తుతం బాండ్ల జారీ లేదా బ్యాంకింగేతర సంస్థలు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం రీట్స్‌కు ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి లేదని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఐఆర్‌ఏలో 5 నమోదిత సంస్థలు ఉన్నాయి. ఐఆర్ఏకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంబసీ రీట్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరవింద్ మైయా మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి పొందే విషయమై ఆర్బీఐతో చర్చిస్తున్నామని తెలిపారు. స్థిరాస్తి పరిశ్రమకు నిధులు భారీ స్థాయిలో కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం రీట్స్‌ను ‘హైబ్రిడ్’ పెట్టుబడి మార్గంగా వర్గీకరించారని, ఇది మదుపర్లను అయోమయానికి గురి చేస్తోందని బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలోక్ అగర్వాల్ వెల్లడించారు. రీట్స్‌ను ఈక్విటీలుగా వర్గీకరిస్తే.. ఇవి కూడా సూచీల్లో (ఇండెక్స్) చేరే వీలుండి, రీట్స్‌లోకి నిధుల రాక పెరిగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. భారత్ రీట్స్ నిబంధనల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్‌తో పాటు అమెరికాలో రీట్స్‌ను ఈక్విటీగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్‌లో రీట్స్ రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, స్థిరాస్తి రంగంలో గిరాకీ పెరుగుతూనే ఉందని ఐఆర్ఏ తెలిపింది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం -
రీట్స్‌కు భారీ అవకాశాలు
కోల్‌కతా: దేశీయంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు భారీ అవకాశాలున్నట్లు పరిశ్రమ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో ఇతర ఆస్తులలోకి సైతం రీట్ నిధులు ప్రవేశించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇండస్ట్రియల్, డేటా సెంటర్లు, ఆతిథ్యం, హెల్త్‌కేర్, విద్య తదితర రంగాలోకి రీట్స్ విస్తరించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రియల్టీ రంగంలో ఆదాయాన్ని ఆర్జించే కంపెనీలు రీట్స్ జారీ చేసే సంగతి తెలిసిందే. రియల్టీ ఆస్తులలో పెట్టుబడుల ద్వారా స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టయ్యే రీట్స్ మదుపరులకు డివిడెండ్ల ఆర్జనకు వీలు కల్పిస్తుంటాయి. తొలి దశలోనే ఇతర ప్రాంతీయ మార్కెట్లతో పోలిస్తే ప్రస్తుతం దేశీయంగా రీట్స్ తొలి దశలోనే ఉన్నట్లు కొలియర్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్ సర్వీసుల ఎండీ పియూష్ గుప్తా పేర్కొన్నారు. అమెరికాసహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని సింగపూర్ తదితర దేశాలతో పోలిస్తే దేశీ రీట్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 10 శాతానికంటే తక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే దేశీయంగా కార్యాలయ మార్కెట్ పరిమాణంతో చూస్తే భారీ వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రీట్ మార్కెట్ అవకాశాలపై ఆశావహంగా ఉన్నట్లు లిస్టెడ్ కంపెనీ.. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ డిప్యూటీ సీఎఫ్‌వో అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆఫీస్ రీట్ మార్కెట్ విస్తరణకు చూస్తున్నట్లు తెలియజేశారు. చెన్నైలో 5 మిలియన్ చదరపు అడుగుల(ఎంఎస్ఎఫ్) కార్యాలయ ఆస్తుల(స్పేస్)ను విక్రయించేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర నగరాలలోనూ విస్తరించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 35 ఎంఎస్ఎఫ్ ఆఫీస్ స్పేస్‌తో పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 8 ఎంఎస్‌ఎఫ్‌లో బిజినెస్ పార్క్‌లను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 2 ఎంఎస్ఎఫ్ సిద్ధంకానున్నట్లు వెల్లడించారు. డివిడెండ్ ఈల్డ్ దేశీయంగా లిస్టెడ్ రీట్స్ డివిడెండ్ ఈల్డ్తోపాటు ఇతర అంశాలపై ఆధారపడి విజయవంతమవుతుంటాయని గుప్తా పేర్కొన్నారు. అంతర్జాతీయ నియంత్రణలకు అనుగుణమైన స్థాయిలో నిబంధనలు రూపొందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో దేశీయంగా రీట్స్ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఆతిథ్యం, ఆరోగ్య పరిరక్షణ, విద్య తదితర రంగాలకూ విస్తరించవచ్చని అంచనా వేశారు. ఈ బాటలో దేశీయంగా తొలిసారి రిటైల్ (మాల్స్) ఆధారిత నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ 2023 మే నెలలో లిస్టయినట్లు ప్రస్తావించారు. దేశీయంగా మొత్తం 667 ఎంఎస్ఎఫ్ ఆఫీస్ స్పేస్‌లో 380 ఎంఎస్ఎఫ్(ఏ గ్రేడ్) లిస్టింగ్‌కు అర్హత కలిగి ఉన్నట్లు కొలియర్స్ ఇండియా విశ్లేషించింది. ప్రస్తుతం 3 లిస్టెడ్ రీట్స్ 74.4 ఎంఎస్ఎఫ్ పోర్ట్‌ఫోలియోతో ఉన్నట్లు తెలియజేసింది. దీనిలో 25 శాతం వాటాతో బెంగళూరు, 19 శాతం వాటాతో హైదరాబాద్ తొలి రెండు ర్యాంకుల్లో నిలుస్తున్నట్లు పేర్కొంది. -
మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ లిస్టింగ్ భేష్
గత నెలాఖరున పబ్లిక్ ఇష్యూకి వచ్చిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రీట్) ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 275కాగా.. బీఎస్ఈలో రూ. 29 లాభంతో రూ. 304 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 309 వరకూ ఎగసింది. ఇది 12 శాతం వృద్ధికాగా.. ఒక దశలో రూ. 299 వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. జులై 27న ముగిసిన ఇష్యూకి 13 రెట్లు అధికంగా స్పందన లభించిన విషయం విదితమే. రహేజా గ్రూప్ కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ గత నెలలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించింది. తద్వారా 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ తదుపరి వచ్చిన రెండో రీట్ ఇష్యూగా నిలిచింది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు మైండ్‌స్పేస్ సెబీకి దాకలు చేసిన ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కాగా.. ఐపీవో ద్వారా ఇంతక్రితం ఎంబసీ ఆఫీస్ రీట్ రూ. 4,750 కోట్లు సమీకరించింది. బ్యాక్‌గ్రౌండ్ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. సెబీ వద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సంస్థగా రిజిస్టర్ అయిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల మార్కెట్ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
13రెట్లు సబ్‌స్క్రైబయిన మైండ్‌స్పేస్ రీట్ ఐపీఓ
రహేజా గ్రూప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ - మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఐపీఓ ఆశించిన స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. ఎక్చ్సేంజ్‌ల గణాంకాల ప్రకారం., ఐపీఓలో భాగంగా 6.77 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుండగా, 87.8 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 10.61 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్, హైనెట్ వర్త్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 15రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. మొత్తం మీద ఐపీఓ ఇష్యూ 13రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.4500 కోట్లను సమీకరించనుంది. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.274 - 275 ను కంపెనీ నిర్ణయించింది. కోవిడ్-19 సంబంధిత అంతరాయాలున్నప్పటికీ..., ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని ప్రదర్శించడంతో భారీస్థాయిలో ఐపీఓ సబ్‌స్కైబ్ అయ్యిందని కంపెనీ సీఈవో రమేశ్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ రీట్ ఐదు ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్స్‌ను ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై నగరాల్లో నిర్వహిస్తోంది. -
సోమవారం నుంచి మైండ్‌స్పేస్ రీట్ ఐపీవో
కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రీట్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూ ధర రూ. 274-275కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 200 యూనిట్లకు బిడ్స్ దాఖలు చేయవలసి ఉంటుంది. యూనిట్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్‌చేయనుంది. ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఇప్పటికే మైండ్‌స్పేస్‌లో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్లను విక్రయానికి ఉంచగా.. మరో రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ తదుపరి వస్తున్న రెండో రీట్ ఇష్యూ ఇది. ఎంబసీ ఆఫీస్ రీట్ ద్వారా రూ. 4,750 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 75 శాతం ఐపీవోలో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు 75 శాతం(9.2 కోట్ల యూనిట్లు), సంపన్న వర్గాలు, రిటైలర్లకు మిగిలిన 25 శాతం(3.07 కోట్ల యూనిట్లు) చొప్పున విక్రయించనున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్లో మైండ్‌స్పేస్ బిజినెస్ తెలియజేసింది. కాగా.. వ్యూహాత్మక సంస్థలు, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి తాజాగా రూ. 2,644 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌ను రూ. 275 ధరలో యూనిట్లను జారీ చేసింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో సింగపూర్ సావరిన్ ఫండ్ జీఐసీ, ఫిడిలిటీ గ్రూప్, క్యాపిటల్ గ్రూప్ తదితరాలున్నాయి. దీంతో ఐపీవో యూనిట్లలో 58.74 శాతాన్ని విక్రయించినట్లయ్యింది. ఫలితంగా ఐపీవో ద్వారా మిగిలిన రూ. 1856 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. కాగా.. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సెబీ వద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సంస్థగా రిజిస్టర్ అయిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల మార్కెట్ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ- ఐపీవోకు రెడీ
రియల్టీ సంస్థ కే రహేజా గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ముంబై సంస్థ రహేజా గ్రూప్ ప్రమోట్ చేసిన మైండ్‌స్పేస్ బిజినెస్‌లో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ సైతం ఇన్వెస్ట్ చేసింది. ఈ నెలాఖరుకల్లా మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కే రహేజా గ్రూప్ ఆఫర్ డాక్యుమెంట్‌ను దాఖలు చేసింది. చివరి వారంలో తాజాగా అందిన వివరాల ప్రకారం మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 4,500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కే రహేజా గ్రూప్‌తోపాటు బ్లాక్‌స్టోన్ రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్స్‌ను విక్రయించనున్నాయి. అంతేకాకుండా రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను సైతం అదనంగా జారీ చేయనున్నాయి. పలు సంస్థలు మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్‌లో క్యాపిటల్ ఇన్కమ్ బిల్డర్, అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సిరీస్, జీఐసీ ప్రయివేట్ లిమిటెడ్ తదితర పలు సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్లో కంపెనీ పేర్కొంది. యూనిట్‌కు రూ. 275 ధరలో 4.09 కోట్ల యూనిట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూలో ఇది 25 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా రూ. 1125 కోట్లను సమకూర్చుకోనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. రెండో కంపెనీ ఐపీవో ద్వారా మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రెండో ఆర్ఈఐటీగా నిలవనుంది. గతంలో పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్‌చేసిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఆర్ఈఐటీ రూ. 4,750 కోట్లను సమీకరించడం ద్వారా 2019 ఏప్రిల్‌లో లిస్టయ్యింది. కాగా.. వివిధ సంస్థల ద్వారా మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీలో ప్రస్తుతం బ్లాక్‌స్టోన్ 15 శాతం వాటాను కలిగి ఉంది. ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నైలలో 29.5 మిలియన్ చదరపు అడుగుల లీజబుల్ ఏరియాను మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ కలిగి ఉన్నట్లు కే రహేజా కార్ప్ పేర్కొంది. వీటి విలువ రూ. 23,675 కోట్లుగా అంచనా. హైదరాబాద్‌లో మైండ్‌స్పేస్ మాధాపూర్, మైండ్‌స్పేస్ పోచారం ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. డివిడెండ్ల ఆదాయం ఆర్ఈఐటీలు సాధారణంగా నికర లాభాల నుంచి వాటాదారులకు అధిక మొత్తంలో డివిడెండ్లను పంచుతుంటాయి. అయితే గత బడ్జెట్లో కంపెనీలపై విధించే డివిడెండ్ పంపిణీ పన్ను(డీడీటీ) స్థానే వ్యక్తిగత(డివిడెండ్ అందుకునే వారిపై) పన్నులను ప్రతిపాదించిన విషయం విదితమే. కాగా.. కోవిడ్-19 కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితులతో పదేళ్ల కాలావధి గల జీసెక్యూరిటీల రేటు కనిష్టానికి చేరినట్లు రియల్టీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మైండ్‌స్పేస్ ఐపీవోకు రావడం ద్వారా పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు పలు అవకాశాలు లభించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కంపెనీ ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల కంపెనీల నుంచి అధికంగా ఆదాయం పొందుతుండటం సానుకూల అంశమని తెలియజేశారు. -
రీట్స్ ద్వారా సీపీఎస్ఈ స్థలాల విక్రయం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాల విక్రయానికి రీట్స్ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృ ఆస్తుల విక్రయానికి కూడా రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది. రీట్స్ విధానంపై ఆర్థిక శాఖ చూపు.... వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ ఆస్తులను పూర్తిగా అమ్మేయడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ, లేదా రీట్స్ విధానాన్ని గానీ చేపట్టాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది. అలాగే శతృ స్థిరాస్తుల విక్రయానికి రీట్స్‌ను పరిశీలించాలని సదరు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పాకిస్తాన్, లేదా చైనా దేశాలకు వలస వెళ్లి భారత పౌరసత్వం కోల్పోయిన పౌరుల ఆస్తులను శతృ ఆస్తులుగా పరిగణిస్తారు. శతృ ఆస్తులకు కస్టోడియన్‌గా హోమ్ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది. 2014లోనే రీట్స్ నిబంధనలు... రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ 2014లోనే రూపొందించినా, ఇవి ఇంకా ప్రాచుర్యం పుంజుకోలేదు. ఇటీవలనే ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థకు చెందిన రీట్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్, అమెరికాకు చెందిన ప్రముఖ పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌లు సంయుక్తంగా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. రూ.300 ఇష్యూ ధరతో ఇటీవలనే ఐపీఓకు వచ్చిన ఈ సంస్ట్ రీట్ ఇప్పుడు రూ.337 ధర వద్ద ట్రేడవుతోంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా రీట్స్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. రీట్స్ విధానంలో స్థలాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. -
రీట్స్ నిబంధనల సరళీకరణ!
♦ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం ♦ విదేశీ ఫండ్ మేనేజర్ల నిబంధనల కూడా సరళీకరణ ♦ రెండు సంప్రదింపుల పత్రాలు విడుదల చేసిన సెబీ ముంబై: రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్) నిబంధనలను, విదేశీ ఫండ్ మేనేజర్లు సంబంధించిన నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సరళీకరించనున్నది. భారత క్యాపిటల్ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇన్వెస్టర్లు, రియల్టర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రీట్స్ నిబంధనలను సరళీకరించనున్నది. విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనల సరళీకరణ కారణంగా మరిన్ని విదేశీ ఫండ్లు మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అంచనా. రీట్స్, విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనల సరళీకరణపై రెండు వేర్వేరు సంప్రదింపుల పత్రాలను సెబీ విడుదల చేసింది. ఈ సంప్రదింపుల పత్రాలపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిబంధనలను రూపొందిస్తుంది. శుక్రవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ మేరకు సెబీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే 2015-16 సెబీ వార్షిక నివేదిక కూడా ఆమోదం పొందింది. 20 శాతం పెట్టుబడులకు ఓకే ...నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో రీట్స్ ప్రస్తుతం తన నిధుల్లో 10 శాతం వరకూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పరిమితిని 20 శాతం వరకూ పెంచాలని సెబీ ప్రతిపాదిస్తోంది. రీట్స్‌కు స్పాన్సరర్ల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచింది. రీట్స్‌పై సెబీ తాజా ప్రతిపాదనల పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిబంధనల కారణంగా ఏడాదిలోపు రీట్స్ వస్తాయని నిపుణులంటున్నారు. ఈ ప్రతిపాదనల వల్ల రీట్స్ నుంచి భారత రియల్టీ మార్కెట్లో అవసరమైన నిధులు వస్తాయని సీబీఆర్ఈ సౌత్ ఏషియా సీఎండీ అన్షుమన్ మ్యాగజైన్ చెప్పారు. మరోవైపు భారత్‌లో నియమితులయ్యే విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనలను కూడా సెబీ సరళీకరించనున్నది. విదేశీ ఫండ్ మేనేజర్లు పోర్ట్‌ఫోలియో మేనేజర్లుగా వ్యవహరించడానికి వీలుగా నిబంధనలను సరళీకరించాలని సెబీ ప్రతిపాదిస్తోంది. -
రియల్టీ, ఇన్‌ఫ్రాల్లో లక్ష కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ల ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు లభించే అవకాశముందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ఈఐటీ, ఇన్విట్ల ఏర్పాటుకు వీలుకల్పిస్తూ రూపొందించిన కొత్త మార్గదర్శకాలకు సెబీ బోర్డు ఆదివారం ఆమోదముద్ర వేసింది. దీంతో యూఎస్, యూకే, జపాన్, హాంకాంగ్, సింగపూర్ తదితర అభివృద్ధి చెందిన మార్కెట్లను పోలి దేశీయంగానూ కొత్త పెట్టుబడి అవకాశాలకు తెరలేవనుంది. కొత్త నిబంధనల వల్ల ఆర్ఈఐటీ, ఇన్విట్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. సెబీ బోర్డు సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. గత నెలలో జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రియల్టీ, మౌలిక రంగాలకు కొత్త పెట్టుబడులను తీసుకువచ్చే ప్రతిపాదనలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జైట్లీ హాజరైన తాజా సమావేశంలో సెబీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ద్వారా వీటికి మరింత ఊపునివ్వనుంది. కాగా, బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ వీటికి పన్ను ప్రయోజనాలను కల్పించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి చిన్న ఇన్వెస్టర్లకు నో ఆర్ఈఐటీ, ఇన్విట్లలో పెట్టుబడి పెట్టేందుకు చిన్న(రిటైల్) ఇన్వెస్టర్లు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది. వీటిని రూపొందించడంలో ఉన్న క్లిష్టత, రిస్క్‌లు వంటి అంశాల కారణంగా ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు అనుమతించడంలేదు. ఆర్‌ఈఐటీలలో కనీస పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షలు కాగా, ఇన్విట్లలో కనీసం రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బోర్డు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ యూకే సిన్హా విలేకరులకు ఈ విషయాలను వెల్లడించారు. దేశీయంగా రియల్టీ, ఇన్ఫ్రా రంగాల వృద్ధికి ఈ ట్రస్ట్‌లు దోహదపడనున్నట్లు సిన్హా పేర్కొన్నారు. వీటి ద్వారా కొత్త పెట్టుబడులకు వీలు చిక్కడంతో బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు, ప్రవాస భారతీయులు, సంస్థల నుంచి దీర్ఘకాలిక నిధులు లభిస్తాయని వివరించారు. ఎఫ్ఐఐలు, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు తదితర సంస్థలకు వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) రంగానికి రూ. 65 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరపడతాయని గతంలోనే ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు వీలు కల్పించే బాటలో ప్రభుత్వం బడ్జెట్లో ఇన్విట్స్కు తెరలేపింది. ఇదే విధంగా రియల్టీ రంగానికి ప్రధానంగా అందరికీ అందుబాటులో గృహాలు, పట్టణాల అభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రతిపాదనల అమలుకు ఆర్ఈఐటీలు సహకరించనున్నాయి. బ్రోకర్లకు ఒకే రిజిస్ట్రేషన్ వివిధ స్టాక్ ఎక్స్ఛేంజీలలో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు స్టాక్ బ్రోకర్లు ఇకపై పలుమార్లు రిజిస్ట్రేషన్లు చేసుకోవలసిన అవసరం ఉండబోదు. ఇందుకు సరళీకరించిన నిబంధనలకు సెబీ బోర్డు అనుమతించింది. దీంతో సెబీ వద్ద ఒకసారి రిజిస్టర్కావడం ద్వారా బ్రోకర్లు వివిధ ఎక్స్ఛేంజీలలో కార్యకలాపాలను చేపట్టేందుకు వీలు ఏర్పడుతుంది. ఆహ్వానించదగ్గ పరిణామం న్యూఢిల్లీ: ఆర్ఈఐటీ, ఇన్విట్ల కొత్త మార్గదర్శకాలకు సెబీ బోర్డు ఆమోదముద్ర వేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా దేశ, విదేశాల నుంచి ఈ రెండు రంగాలకూ 15-20 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వరకూ పెట్టుబడులు లభించే అవకాశముందని పలువురు అధికారులు, నిపుణులు అంచనా వేశారు. మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేందుకు ఈ రెండు రంగాలకు ట్రస్ట్‌ల ద్వారా వీలు చిక్కనుందని అభిప్రాయపడ్డారు. క్రెడాయ్, జోన్స్ లాంగ్ లాసాఎల్లే ఇండియా, కేపీఎంజీ ఇండియా, వాకర్ చండియాక్ అండ్ కంపెనీ, నారెడ్కో తదితర సంస్థల ప్రతినిధులు రానున్న ఐదేళ్లలో అటు రియల్టీ, ఇటు ఇన్ఫ్రా రంగాలకు అవసరమైన నిధులు సమకూరతాయని వ్యాఖ్యానించారు. రియల్టీ రంగానికి 10 బిలి యన్ డాలర్లు, ఇన్ఫ్రా రంగానికి మరో 10 బిలియన్ డాలర్ల చొప్పున నిధులు లభించే అవకాశముందని చెప్పారు. మార్కెట్ ఉల్లంఘనలపై కన్ను సెబీకి జైట్లీ సూచన మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంపైన, వారి ఇక్కట్ల తొలగింపుపైన దృష్టిపెట్టాలని సెబీని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. మార్కెట్లలో జరగడానికి అవకాశమున్న ఉల్లంఘనలపై కన్నేయాలని సూచించారు. ఆదివారం ఇక్కడ జరిగిన సెబీ బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనల అమలు గురించి, దేశంలో పెట్టుబడుల వాతావరణం గురించి కూడా ఆయన చర్చించారని సెబీ చైర్మన్ యు.కె.సిన్హా సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు.