రహేజా గ్రూప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ - మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఐపీఓ ఆశించిన స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. ఎక్చ్సేంజ్‌ల గణాంకాల ప్రకారం., ఐపీఓలో భాగంగా 6.77 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుండగా, 87.8 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 10.61 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్, హైనెట్ వర్త్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 15రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. మొత్తం మీద ఐపీఓ ఇష్యూ 13రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.4500 కోట్లను సమీకరించనుంది. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.274 - 275 ను కంపెనీ నిర్ణయించింది. కోవిడ్-19 సంబంధిత అంతరాయాలున్నప్పటికీ..., ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని ప్రదర్శించడంతో భారీస్థాయిలో ఐపీఓ సబ్‌స్కైబ్ అయ్యిందని కంపెనీ సీఈవో రమేశ్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ రీట్ ఐదు ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్స్‌ను ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై నగరాల్లో నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment