mindspace road
-
మాదాపూర్‌లో రెండు భారీ భవనాల కూల్చివేత..!
-
మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ లిస్టింగ్ భేష్
గత నెలాఖరున పబ్లిక్ ఇష్యూకి వచ్చిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రీట్) ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 275కాగా.. బీఎస్ఈలో రూ. 29 లాభంతో రూ. 304 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 309 వరకూ ఎగసింది. ఇది 12 శాతం వృద్ధికాగా.. ఒక దశలో రూ. 299 వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. జులై 27న ముగిసిన ఇష్యూకి 13 రెట్లు అధికంగా స్పందన లభించిన విషయం విదితమే. రహేజా గ్రూప్ కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ గత నెలలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించింది. తద్వారా 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ తదుపరి వచ్చిన రెండో రీట్ ఇష్యూగా నిలిచింది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు మైండ్‌స్పేస్ సెబీకి దాకలు చేసిన ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కాగా.. ఐపీవో ద్వారా ఇంతక్రితం ఎంబసీ ఆఫీస్ రీట్ రూ. 4,750 కోట్లు సమీకరించింది. బ్యాక్‌గ్రౌండ్ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. సెబీ వద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సంస్థగా రిజిస్టర్ అయిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల మార్కెట్ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
13రెట్లు సబ్‌స్క్రైబయిన మైండ్‌స్పేస్ రీట్ ఐపీఓ
రహేజా గ్రూప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ - మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఐపీఓ ఆశించిన స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. ఎక్చ్సేంజ్‌ల గణాంకాల ప్రకారం., ఐపీఓలో భాగంగా 6.77 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుండగా, 87.8 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 10.61 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్, హైనెట్ వర్త్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 15రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. మొత్తం మీద ఐపీఓ ఇష్యూ 13రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.4500 కోట్లను సమీకరించనుంది. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.274 - 275 ను కంపెనీ నిర్ణయించింది. కోవిడ్-19 సంబంధిత అంతరాయాలున్నప్పటికీ..., ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని ప్రదర్శించడంతో భారీస్థాయిలో ఐపీఓ సబ్‌స్కైబ్ అయ్యిందని కంపెనీ సీఈవో రమేశ్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ రీట్ ఐదు ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్స్‌ను ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై నగరాల్లో నిర్వహిస్తోంది. -
సోమవారం నుంచి మైండ్‌స్పేస్ రీట్ ఐపీవో
కె.రహేజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రీట్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూ ధర రూ. 274-275కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 200 యూనిట్లకు బిడ్స్ దాఖలు చేయవలసి ఉంటుంది. యూనిట్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్‌చేయనుంది. ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఇప్పటికే మైండ్‌స్పేస్‌లో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్లను విక్రయానికి ఉంచగా.. మరో రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. 2019 మార్చిలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ తదుపరి వస్తున్న రెండో రీట్ ఇష్యూ ఇది. ఎంబసీ ఆఫీస్ రీట్ ద్వారా రూ. 4,750 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 75 శాతం ఐపీవోలో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు 75 శాతం(9.2 కోట్ల యూనిట్లు), సంపన్న వర్గాలు, రిటైలర్లకు మిగిలిన 25 శాతం(3.07 కోట్ల యూనిట్లు) చొప్పున విక్రయించనున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్లో మైండ్‌స్పేస్ బిజినెస్ తెలియజేసింది. కాగా.. వ్యూహాత్మక సంస్థలు, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి తాజాగా రూ. 2,644 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌ను రూ. 275 ధరలో యూనిట్లను జారీ చేసింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో సింగపూర్ సావరిన్ ఫండ్ జీఐసీ, ఫిడిలిటీ గ్రూప్, క్యాపిటల్ గ్రూప్ తదితరాలున్నాయి. దీంతో ఐపీవో యూనిట్లలో 58.74 శాతాన్ని విక్రయించినట్లయ్యింది. ఫలితంగా ఐపీవో ద్వారా మిగిలిన రూ. 1856 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఏర్పాటులో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తోపాటు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. కాగా.. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సెబీ వద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ సంస్థగా రిజిస్టర్ అయిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్.. మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ ప్రాపర్టీలను కలిగి ఉంది. మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల మార్కెట్ విలువను 2020 మార్చికల్లా రూ. 23,675 కోట్లుగా మదింపు చేసినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది. కంపెనీ ప్రధానంగా లీజుల(అద్దెలు) రూపంలో ఆదాయాన్ని పొందుతుంటుంది. యూనిట్ హొల్డర్లకు డివిడెండ్ల రూపంలో ఆదాయం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ- ఐపీవోకు రెడీ
రియల్టీ సంస్థ కే రహేజా గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ముంబై సంస్థ రహేజా గ్రూప్ ప్రమోట్ చేసిన మైండ్‌స్పేస్ బిజినెస్‌లో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ సైతం ఇన్వెస్ట్ చేసింది. ఈ నెలాఖరుకల్లా మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కే రహేజా గ్రూప్ ఆఫర్ డాక్యుమెంట్‌ను దాఖలు చేసింది. చివరి వారంలో తాజాగా అందిన వివరాల ప్రకారం మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 4,500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కే రహేజా గ్రూప్‌తోపాటు బ్లాక్‌స్టోన్ రూ. 3,500 కోట్ల విలువైన యూనిట్స్‌ను విక్రయించనున్నాయి. అంతేకాకుండా రూ. 1,000 కోట్ల విలువైన యూనిట్లను సైతం అదనంగా జారీ చేయనున్నాయి. పలు సంస్థలు మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్‌లో క్యాపిటల్ ఇన్కమ్ బిల్డర్, అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సిరీస్, జీఐసీ ప్రయివేట్ లిమిటెడ్ తదితర పలు సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్లో కంపెనీ పేర్కొంది. యూనిట్‌కు రూ. 275 ధరలో 4.09 కోట్ల యూనిట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూలో ఇది 25 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా రూ. 1125 కోట్లను సమకూర్చుకోనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. రెండో కంపెనీ ఐపీవో ద్వారా మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రెండో ఆర్ఈఐటీగా నిలవనుంది. గతంలో పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్‌చేసిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఆర్ఈఐటీ రూ. 4,750 కోట్లను సమీకరించడం ద్వారా 2019 ఏప్రిల్‌లో లిస్టయ్యింది. కాగా.. వివిధ సంస్థల ద్వారా మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీలో ప్రస్తుతం బ్లాక్‌స్టోన్ 15 శాతం వాటాను కలిగి ఉంది. ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నైలలో 29.5 మిలియన్ చదరపు అడుగుల లీజబుల్ ఏరియాను మైండ్‌స్పేస్ ఆర్ఈఐటీ కలిగి ఉన్నట్లు కే రహేజా కార్ప్ పేర్కొంది. వీటి విలువ రూ. 23,675 కోట్లుగా అంచనా. హైదరాబాద్‌లో మైండ్‌స్పేస్ మాధాపూర్, మైండ్‌స్పేస్ పోచారం ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. డివిడెండ్ల ఆదాయం ఆర్ఈఐటీలు సాధారణంగా నికర లాభాల నుంచి వాటాదారులకు అధిక మొత్తంలో డివిడెండ్లను పంచుతుంటాయి. అయితే గత బడ్జెట్లో కంపెనీలపై విధించే డివిడెండ్ పంపిణీ పన్ను(డీడీటీ) స్థానే వ్యక్తిగత(డివిడెండ్ అందుకునే వారిపై) పన్నులను ప్రతిపాదించిన విషయం విదితమే. కాగా.. కోవిడ్-19 కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితులతో పదేళ్ల కాలావధి గల జీసెక్యూరిటీల రేటు కనిష్టానికి చేరినట్లు రియల్టీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మైండ్‌స్పేస్ ఐపీవోకు రావడం ద్వారా పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు పలు అవకాశాలు లభించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కంపెనీ ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల కంపెనీల నుంచి అధికంగా ఆదాయం పొందుతుండటం సానుకూల అంశమని తెలియజేశారు. -
మైండ్ స్పేస్ ఉద్యోగికి కరోనా టెస్ట్‌లో నెగిటివ్
-
రాణిగిరి
ఉదయం ఏడు గంటలు. సన్ డే మార్నింగ్... హాలిడే మూడ్‌లో అక్కడక్కడా వెహికిల్స్ కనిపించే రహదారి ఆటపాటలతో ఒకటే సందడిగా మారింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా... అంతా కలసి రోడ్డును మైదానంలా ఫీలైపోయి ఆడేసుకుంటున్నారు. ఎవరికి తోచిన యాక్టివిటీ వారు చేసేసుకుపోతున్నారు. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మాదాపూర్ మైండ్‌స్పేస్ రోడ్డు వరకు దాదాపు నాలుగు గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఇదే హంగామా! మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక ‘రాహ్‌గిరి’ ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. సీనియర్ సిటిజన్స్, యువతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గల్లీఫుట్బాల్, క్రికెట్, సైక్లింగ్, రన్నింగ్, స్కేటింగ్.. ఒకటేమిటి అన్నీ ఇక్కడే! మదర్‌హుడ్ ఇండియా హాస్పిటల్ ‘మహిళల భద్రత’పై పెయింటింగ్ పోటీ, టీఏఎఫ్ ఆధ్వర్యంలో ‘స్ట్రాంగ్ విమెన్.. స్ట్రాంగ్ నేషన్’ సైకిల్ రైడ్ పోటాపోటీగా జరిగాయి. జుంబా డ్యాన్స్‌లో మల్కాజ్గిరి డీసీపీ రమారాజేశ్వరి ఉత్సాహంగా అడుగులు కదిపారు. రాయదుర్గం