రాణిగిరి
ఉదయం ఏడు గంటలు. సన్ డే మార్నింగ్... హాలిడే మూడ్‌లో అక్కడక్కడా వెహికిల్స్ కనిపించే రహదారి ఆటపాటలతో ఒకటే సందడిగా మారింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా... అంతా కలసి రోడ్డును మైదానంలా ఫీలైపోయి ఆడేసుకుంటున్నారు. ఎవరికి తోచిన యాక్టివిటీ వారు చేసేసుకుపోతున్నారు. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి మాదాపూర్ మైండ్‌స్పేస్ రోడ్డు వరకు దాదాపు నాలుగు గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఇదే హంగామా! మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక ‘రాహ్‌గిరి’ ఆద్యంతం ఉల్లాసంగా సాగింది.
సీనియర్ సిటిజన్స్, యువతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గల్లీఫుట్‌బాల్, క్రికెట్, సైక్లింగ్, రన్నింగ్, స్కేటింగ్.. ఒకటేమిటి అన్నీ ఇక్కడే! మదర్‌హుడ్ ఇండియా హాస్పిటల్ ‘మహిళల భద్రత’పై పెయింటింగ్ పోటీ, టీఏఎఫ్ ఆధ్వర్యంలో ‘స్ట్రాంగ్ విమెన్.. స్ట్రాంగ్ నేషన్’ సైకిల్ రైడ్ పోటాపోటీగా జరిగాయి. జుంబా డ్యాన్స్‌లో మల్కాజ్‌గిరి డీసీపీ రమారాజేశ్వరి ఉత్సాహంగా అడుగులు కదిపారు.
రాయదుర్గం