
న్యూఢిల్లీ: గతేడాది అత్యధిక స్థాయిలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ లావాదేవీల నిర్వహణతో సీబీఆర్‌ఈ అగ్రస్థానంలో నిలిచింది. ఎంఎస్‌సీఐ రియల్ అసెట్స్ ప్రకారం 2024లో 63.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. కీలకమైన పారిశ్రామిక (68.7 శాతం), రిటైల్ (64.1 శాతం) తదితర విభాగాల్లోనూ అగ్రగామిగా నిలి్చంది.
పెట్టుబడులకు సంబంధించి ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్ టాప్ హబ్‌లుగా (చెరి 23 శాతం) నిలవగా, బెంగళూరు (18 శాతం), చెన్నై (10 శాతం), హైదరాబాద్ (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సీబీఆర్‌ఈ ఇండియా ఎండీ (క్యాపిటల్ మార్కెట్స్, ల్యాండ్) గౌరవ్ కుమార్ తెలిపారు.
మరోవైపు అంతర్జాతీయంగాను కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విక్రయాల్లో 22 శాతం మార్కెట్ వాటాతో సీబీఆర్‌ఈ నంబర్ 1 ర్యాంకులో కొనుసాగుతోంది. ఆదాయాన్ని అందించే ప్రాపర్టీలను కొనుగోలు, చేసి విక్రయించే ప్రక్రియను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ సేల్స్‌గా వ్యవహరిస్తారు.
ఆఫీస్ బిల్డింగ్‌లు, రిటైల్ స్పేస్‌లు, హోటళ్లు, స్థలం లాంటి రియల్ ఎస్టేట్ అసెట్లు అద్దె రూపంలో ఆదాయాన్ని అందిస్తాయి. అలాగే వాటి విలువ కూడా పెరుగుతుంది. సీబీఆర్‌ఈ లాంటి సంస్థలు ఈ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలివ్వడం, లావాదేవీలను నిర్వహించడం, కొనుగోలుదారులు–విక్రేతలను అనుసంధానించడం ద్వారా పెట్టుబడులు, విక్రయాల్లాంటి విషయాల్లో తోడ్పాటు అందిస్తాయి.