
పరారీలో మరో ఇద్దరు నిందితులు
కేసు వివరాలను వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్‌రావు
హైదరాబాద్: చేతబడి చేయడంతోనే తన తండ్రి కాళ్లు, చేతులు పడిపోయాయని, సోదరి పెళ్లి ఆగిపోవడం, తన అనారోగ్యానికి కారణం అనే అనుమానంతో ఓ వ్యక్తిపై కక్ష పెంచుకొని నలుగురు స్నేహితులతో కలిసి కర్రలతో కొట్టి హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇరువురు పరారీలో ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వివరాలు ఇలా..
చందానగర్ పాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్న ఎండీ నజీర్(41) కారు డ్రైవర్. నెహ్రూనగర్‌కు చెందిన ఎండీ ఫక్రుద్దీన్(28) స్థానికంగా ఎల్రక్టీషియన్. ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇటీవల నజీర్ చేతబడి చేస్తున్నట్టు ఇరుగుపొరుగు వారు చెప్పడంతో పకృద్దీన్‌కు నజీర్‌పై అనుమానం మొదలై, ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఫక్రుద్దీన్ తండ్రి మోహీద్‌బేగ్‌కు కాళ్లు, చేతులు పనిచేయకపోవడానికి నజీర్ చేతబడి కారణమని భావించాడు. నెల రోజుల క్రిందట ఫక్రుద్దీన్ సోదరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ నిశి్చతార్ధానికి వచి్చన నజీర్ 15 రోజుల్లో చెల్లి పెళ్లి ఆగిపోతుందని చెప్పాడు. అదే జరిగింది. పైగా ఫక్రుద్దీన్ కూడా అనారోగ్యానికి గురికావడంతో నజీర్‌పై తీవ్ర అనుమానం ఏర్పడింది.
దీంతో నజీర్‌తో పలుమార్లు గొడవలు పడ్డారు. ఎలాగైనా నజీర్‌ను చంపాలని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఫక్రుద్దీన్ అదే కాలనీకి చెందిన స్నేహితుడు ఐటీ ఉద్యోగి మహ్మద్ అలీకి విషయం తెలిపాడు. దీంతో అలీ చందానగర్ బాబునగర్‌కు చెందిన రౌడీïÙటర్ ఎండీ బురాన్‌ను కలిసి జరిగిన విషయాలను ముగ్గురు ప్రస్తావించారు. నజీర్‌కు, ఎండీ బురాన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపార విషయంలో డబ్బులు ఇచి్చపుచ్చుకోవడంలో గొడవలు జరుగుతున్నాయి. నజీర్‌పై కోపం ఉందని తనతో కూడా గొడవపడుతున్నాడని ఎండీ బురాన్ వారికి తెలిపారు. దీంతో ఫక్రుద్దీన్, అలీ, బురాన్‌లు కలిసి పథకం ప్రకారం ఈనెల 21వ తేదీన రాత్రి 8:30 గంటల సమయంలో నజీర్‌ను ఫక్రుద్దీన్ శేరిలింగంపల్లి గోపీనగర్ చెరువు కట్ట వద్దకు తీసుకువెళ్లాడు.
ఆ తర్వాత వారి స్నేహితులు అలీ, బురాన్, మహ్మద్ ఖలీమ్, అజర్‌లను పిలిచారు. వీరందరు కలిసి చెరువు కట్టపై మద్యం సేవించారు. తర్వాత ఫక్రుద్దీన్ కుటుంబంపై చేతబడి చేస్తున్నావని నజీర్‌పై గొడవకు దిగారు. ఆ సమయంలో ఫక్రుద్దీన్ పథకం ప్రకారం నజీర్ తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. మిగతా స్నేహితులు కూడా నజీర్‌ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక పక్కనే ఉన్న గోపీనగర్ బస్తీవైపు పరిగెత్తాడు. అతని అరుపులు విని కాలనీవాసులు ఆస్పత్రికి తీసుకెళ్లమని హెచ్చరించారు. దీంతో అలీ, బురాన్, ఖలీమ్ æ, అజర్‌లు అక్కడి నుండి వెళ్లిపోగా ఫక్రుద్దీన్ గాయాలై అపస్మారక స్థితిలో పడి ఉన్న నజీర్‌ను వెనకాల ఎక్కించుకుని సమీపంలోని హైటెక్ బావర్చీ వద్దకు వచ్చి మళ్లీ స్నేహితులకు ఫోన్ చేశాడు.
దీంతో అందరూ కారులో రాగా ఫక్రుద్దీన్ నజీర్‌ను కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ చేర్పించి పారిపోయాడు. గాయాలతో ఉన్న నజీర్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు చందానగర్‌కు చెందిన నజీర్‌గా గుర్తించారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా హత్యలో ప్రధాన నిందితుడైప ఫక్రుద్దీన్, రౌడీ షీటర్ బురాన్, ఖలీమ్‌లను అరెస్ట్ చేసి విచారించగా హత్య చేసినట్టు అంగీకరించారు. ఈ హత్యలో పాల్గొన్న హఫీజ్‌పేట్‌కు చెందిన అజర్, గోపీనగర్‌కు చెందిన మహ్మద్ అలీ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment