చెన్నై: ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న శివశంకర్ బాబాపై చెన్నై పోలీసులు ఆదివారం లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. చెన్నై సమీపంలోని కీలంబాక్కంలో తన స్కూలుకు చెందిన పలువురు విద్యార్థినులను ఈ బాబా లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. శివశంకర్ బాబా సుశీల్ హరి పేరిట ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా స్కూల్‌లో చదివిన పలువురు విద్యార్థినులు …బాబా తమపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతే తమ ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ శివశంకర్ బాబాకు సమన్లు జారీ చేసింది. కాగా ముగ్గురు విద్యార్థినులు చేసిన ఫిర్యాదుతో కీలంబాక్కం మహిళా పోలీసులు శివశంకర్ బాబాపై పోక్సో చట్టం కింద పలు కేసులు దాఖలు చేశారు. అయితే కేసు తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం దీన్ని సీబీసీఐడీకి ట్రాన్స్ ఫర్ చేసింది. కేసుకు సంబంధించి సమాచారం పొందడానికి ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 13 మంది బాధితులను అధికారులు కలిసి వివరాలు సేకరించనున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన సమన్లపై శివశంకర్ కమిటీ ముందు హాజరు కాలేదు. ఛాతీ నొప్పితో తమ గురువు డెహ్రాడున్ లోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని ఆయన శిష్యులు కమిటీకి తెలిపారు.
చదవండి: మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment