ప్రేమించినందుకు చంపబోయారు | Killing for Love | Sakshi
Sakshi News home page

ప్రేమించినందుకు చంపబోయారు

Published Sun, Mar 11 2018 2:15 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

Killing for Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చిట్టినగర్‌ (విజయవాడ వెస్ట్‌) : ప్రేమించినందుకు ఓ యువకుడి కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు చెందిన దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు దాడికి పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఇస్లాంపేట హామీద్‌ వీధికి చెందిన షేక్‌ లాల్‌ అహమ్మద్‌కు ముగ్గురు కుమారులు. 

ఆఖరి వాడైన కరీముల్లా మంగళగిరికి చెందిన బీబీ ఆయిషా ప్రేమించుకున్నారు.  గత నెల ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి 27వ తేదీ తిరిగి వచ్చారు. అయితే ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొనడంతో పెద్దల మధ్య పెట్టారు. చివరకు ఇద్దరికి మార్చి 25వ తేదీన వివాహం చేస్తామని అమ్మాయి తరఫు వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో లాల్‌ అహమ్మద్, అతని భార్య, పెద్ద కోడలు.. పంజా సెంటర్‌లోని తమ కూల్‌ డ్రింక్‌ షాపు వద్ద ఉండగా అమ్మాయి తరఫు బంధువులైన షేక్‌ అహ్మద్‌ (హందీ), ఖాజా, గౌస్, మున్నా, బాబు, షమీబుద్దీన్, సద్దామ్‌ ఓ కారులో వచ్చి షాపును ధ్వంసం చేయడమే కాకుండా మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

అంతే కాకుండా చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే, సమీపంలోని టీ దుకాణం వద్ద ఉన్న లాల్‌ అహమ్మద్‌ పెద్ద కుమారుడు షాబాషీపై బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న కొత్తపేట సీఐ మురళీకృష్ణ, పోలీసు సిబ్బంది దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement