woman harassment
-
జార్ఖండ్‌లో యువతిపై దారుణం.. బట్టలు విప్పి చెట్టుకి కట్టేసి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు -
ఉద్యోగి భార్యపై కన్నేసి.. భర్తలేని సమయంలో ఇంటికి వచ్చి...
హైదరాబాద్: తనవద్ద పనిచేస్తున్న ఉద్యోగి భార్యపై కన్నేసి ఆమెను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌రోడ్ నెం 2లోని ఇందిరానగర్‌లో నివసించే బొల్లి బాలమద్దిలేటి ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. అదే సంస్థలో హౌజ్ కీపింగ్ ఉద్యోగిని ఐదు రోజుల క్రితం బైక్‌పై అతడి ఇంటి వద్ద దింపేందుకు వచ్చిన బాలమద్దిలేటి సదరు ఉద్యోగి భార్యపై కన్నేశాడు. మర్నాడు ఆమె భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చిన మద్దిలేటి ఆమెతో మాటలు కలిపాడు. రెండ్రోజుల పాటు ఆమెను వెంబడిస్తూ వేధించడమేగాక తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేఐసి మంగళవారం నాంపల్లిలోని 10వ స్పెషల్ మెట్రో పాలిటన్ మెజి్రస్టేట్ ఎస్.లక్ష్మణ్‌రావు ఎదుట హాజరు పర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. -
పోకిరీ మైనర్.. అమ్మాయిల్ని వేధిస్తున్న వారిలో 11.11% వీరే
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తున్న అతివల్ని వేధిస్తున్న పోకిరీల్లో మైనర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఆరున్నర నెలల కాలంలో నగర షీ టీమ్స్ బృందాలు పట్టుకున్న వారిలో 11.11 శాతం వీళ్లే ఉండటం ఆందోళనకర అంశం. లాక్డౌన్ పూర్తిగా తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అతివలకు వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలోనే నిఘా ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశించారు. షీ టీమ్స్ పని తీరుపై ఆయన బుధవారం భరోసా కేంద్రంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు. ► ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు షీ టీమ్స్‌ను మొత్తం 889 మంది బాధితులు ఆశ్రయించారు. తీవ్రత ఆధారంగా వీటిలో 97 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయగా మరో 22 పెట్టీ (చిన్న స్థాయి) కేసులుగా మారాయి. ►మొత్తం 288 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 201 మందిని మందలించి విడిచిపెట్టారు. మరో 87 మందిని మాత్రం ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. మిగిలిన ఫిర్యాదులను దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా మూసేశారు. ►బహిరంగ ప్రదేశాల్లో రెచి్చపోయే పోకిరీలకు చెక్ చెప్పడానికి షీటీమ్స్‌కు చెందిన బృందాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో పట్టుబడిన 135 మందిలో 15 మంది (11.11 శాతం) మైనర్లే ఉన్నారు. వీరికి అధికారులు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ►బాధితుల్లో 41 శాతం మంది నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారిలో 30 శాతం మంది వాట్సాప్ ద్వారా, 14 శాతం మంది మెయిల్ ద్వారా, 12 శాతం మంది క్యూ ఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా, మిగిలిన వారు హాక్ఐ యాప్, ఫేస్బుక్, 100 ద్వారా ఆశ్రయించారు. ►వీటిలో 21 శాతం కేసులు ఫోన్ ద్వారా వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. 17 శాతం కేసులు నేరుగా వెంటపడి వేధించడం, 9 శాతం కేసులు పెళ్లి పేరుతో మోసాలు, 14 శాతం కేసులు బ్లాక్ మెయిలింగ్, మిగిలినవి ఫొటోల మార్ఫింగ్, ప్రాంక్ కాల్స్ తదితరాలు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ వాడండి మహిళలపై జరుగుతున్న వేధింపుల తరహా నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించండి. చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. బాధితురాళ్లు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన పెంచండి. – షీ టీమ్స్‌తో నగర కొత్వాల్ -
ఫేక్ ఆఫీసర్..! రహస్యంగా తీసిన వీడియోలతో బ్లాక్మెయిల్
సాక్షి, చెన్నై: సామాజిక మాధ్యమాల ద్వారా తాను పోలీసు అధికారిగా పేర్కొంటూ మహిళలకు లైంగిక వేధింంపులు ఇస్తున్న ప్రబుద్ధుడి గట్టును భార్య బయటపెట్టింది. మంగళవారం మదురై కమిషనరేట్‌లో ఆధారాలతో సహా సమర్పించి పట్టించింది. గత ప్రభుత్వంలో ఓ మంత్రి వద్ద ముత్తు గన్‌మెన్‌గా పనిచేశాడు. అయితే తానో పోలీసు అధికారిగా నమ్మించి ఏడాది క్రితం సుభాషిణిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు మదురై రిజర్వ్ బ్యాంక్ కాలనీ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన తర్వాత భర్త గురించి తెలిసినా సర్దుకుపోయింది. అయితే ఓ రోజు భర్త సెల్ ఫోన్ తీసి చూడగా మహిళలకు ఇస్తున్న బెదిరింపులు వెలుగు చూశాయి. దీంతో భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లి పోయింది. మళ్లీ ఇలాంటి పనులు చేయనని లిఖిత పూర్వకంగా రాసి ఆమెను కాపురానికి తీసుకొచ్చాడు. కొద్ది రోజులు బాగున్న ముత్తు మళ్లీ పాత ఫందాను కొనసాగించాడు. మహిళలను హోటళ్లకు తీసుకెళ్లడం, వారితో గడిపిన దృశ్యాలను చిత్రీకరించి బెదిరించడం చేస్తుండేవాడు. మదురై కమిషనరేట్‌లో ఫిర్యాదు అధికారినని చెప్పి తనను మోసం చేయడమే కాకుండా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న భర్తపై మదురై కమిషనరేట్‌లో భార్య సుభాషిణి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఫేక్‌ఐడీలతో తన భర్త సాగిస్తున్న లైంగిక వేధింపులు, మహిళలతో చాటింగ్‌లు, బెదిరింపులు, వసూళ్లపై ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు సమర్పించింది. మహిళలపై తన భర్త సాగిస్తున్న తీరుతో న్యాయం కోసం కమిషనరేట్‌ను ఆశ్రయించినట్టు సుభాషిణి తెలిపారు. గతంలో తాను ఇదే రకంగా ఓ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, మంత్రి గన్‌మెన్ కావడంతో అక్కడి సిబ్బంది వెనక్కు తగ్గారని, ఇక తన భర్త తప్పించుకోలేడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును ఉన్నతాధికారులకు పంపించి విచారణ చేస్తున్నారు. చదవండి: కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది -
బయటికి వచ్చేశారు
ఎక్కడ ఇబ్బంది కలిగినా, భయం అనిపించినా, ఇంటికి రాగానే అన్నీ మరచిపోతాం. ఇల్లు ఒక భరోసా, ఇల్లు ఒక నమ్మకం, ఇల్లు ఒక విశ్వాసం. మరి ఆ ఇంట్లోనే నరకం కనిపిస్తే ఏం చేయాలి? వలెరి, రచెల్, నాన్సీ, విక్టోరియా... ఇల్లు చూస్తే భయపడుతున్న అమ్మాయిలు వీరు. ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాలలో కనీసం 11 లక్షలమంది మహిళలు నిత్యం గృహ హింసకు గురవుతున్నారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, సంతానం.. ఎవరో ఒకరి కారణంగా వీరు శారీరకంగా, మానసికంగా ఇంట్లో రక్షణ లేకుండా ఉన్నారని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. ఈ నలుగురి అనుభవాలను వింటే.. స్త్రీ జీవితం ఎక్కడైనా ఒకేలా ఉందనిపిస్తుంది! వలెరి ఉదయం ఐదు గంటలకే లేచి, ఆయన లేవకముందే పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఆయన కోసం ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం చాలా టైమ్ కేటాయిస్తాను. నాకు రెండుసార్లు వివాహం అయ్యింది. రెండు వివాహాలలోను.. నన్ను నియంత్రించడం, నిరంతరం అసభ్యంగా మాట్లాడుతూ హింసించడం అనుభవం అయ్యాయి. నా మొదటి భర్త చొక్కాకి పొరపాటున మరక ఉండిపోయిందని, నా భర్త నాకు వాతలు పెట్టాడు. నా రెండో భర్త ఉద్యోగానికి బయటకు వెళుతూ, నన్ను మెట్ల మీద నుంచి తోసేశాడు, నేను స్పృహ తప్పి పడిపోయాను. ఇటువంటివి ఎన్నని లెక్కించగలను? నా పిల్లలను దృష్టిలో ఉంచుకుని చాలాకాలం అన్నీ అనుభవించాను. చివరికి నేను ఎందుకూ పనికిరాననే భావన నాలో ఏర్పడింది. ప్రపంచం ఎందుకు ఇలా నడుస్తుందో అర్థం కాదు, సాటి మనిషిని హింసించే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? కాలం ఎంత మారుతున్నా వారి ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. నేనే బయటికి వచ్చేశాను. రచేల్ నా చుట్టూ ఉన్న సంప్రదాయ యూదు కుటుంబాల వారు.. నా భర్త నన్ను హింసించడం కళ్లారా చూశారు. ఒక్కరూ నా వైపు న్యాయం మాట్లాడలేదు. నా గురించి, నా పిల్లలకు సంబంధించిన కుశలప్రశ్నలు అడగలేదు. ఆయన గదిలోనే కనీసం నేల మీద పడుకోవాలన్నా భయమే. నేను వద్దు అనడానికి వీలు లేదు. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆయన బెడ్రూమ్లోకి వెళ్లవలసిందే. ఆయన ఎన్ని విధాలుగా హింసించినా, నేను శుభ్రంగా ముఖం కడుక్కుని, శుభ్రంగా రెడీ అయ్యి, ఏమీ జరగనట్టుగా ప్రవర్తించవలసిందే. ఇలాగే రోజులన్నీ గడిచాయి. కబోర్డ్‌లో డబ్బాల మీద లేబుల్స్ దగ్గర నుంచి అన్నీ ఆయన చెప్పినట్టుగా ఉండాలి. ఆయన కనుసన్నల్లోనే జరగాలి. పదిహేడు సంవత్సరాల తరువాత నేను ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. ఇంతకాలం నా గొంతు నేను నొక్కుకున్నానని అర్థం చేసుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. అప్పుడే నాలో శక్తి బయలుదేరింది. నేను ఇంక బాధితురాలిగా ఉండకూడదని నిశ్చయించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాన్సీ మొదట్లో నేను చాలా సంబరపడ్డాను. అతను ప్రతిరోజు నాకోసమే వస్తున్నాడని, నన్ను కలుస్తున్నాడని నా తరువాతే తనకి అందరూ అని భావించాను. నేను వేరేవారితో ఉంటే, వెంటనే నాకు మెసేజ్ పెట్టేవాడు. నా మీద తనకి ప్రేమ చాలా ఎక్కువ అనుకున్నాను. అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినప్పుడు అతనిలో ఎటువంటి భావమూ లేదు. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అంతకుముందు ఎన్నడూ నన్ను ఎవ్వరూ కొట్టలేదు. అంతకుముందు ఎన్నడూ లేనంత భయంకరంగా నన్ను హింసించాడు. గట్టిగా తన్నాడు, చెంప మీద కొట్టాడు, చేతులతో బయటకు తోసేశాడు, తల పగలగొట్టాడు. చివరగా నా గొంతు పట్టుకున్నాడు. నేను భయంతో వీధులలోకి పరుగులు తీసి, పబ్లిక్ టాయిలెట్లో దాక్కున్నాను. నన్ను వెంటాడుతూ వెనకే వచ్చాడు. ఆ టాయిలెట్‌కి రెండు దారులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. హమ్మయ్య నేను తప్పించుకున్నాను అనుకునేంతలోనే అతడు నా మీదకు రాబోయాడు. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను పిలిచాను. ఇటువంటి విషయాలను మరచిపోవాలన్నా సాధ్యపడదు. కానీ ఎలా తప్పించుకోవాలో మాత్రం తెలుసుకున్నాను. ఆ తరువాత నేను మగవారితో ఒంటరిగా ఉండటం మానేశాను. అందరూ ఒకేలా ఉండరని తెలిసినా కూడా నాలో ఆ భయం పోలేదు. విక్టోరియా నేను ఇద్దరు మగవారి కారణంగా గృహహింసను అనుభవించాను. నాతో సన్నిహితంగా ఉంటూనే నన్ను హింసించారు వారు. ఆ తరువాత నేను వారి నుంచి దూరంగా వచ్చేశాను. నా మాజీ భర్త మా ఇంటి తలుపులన్నీ మూసేసి, ఆ తరువాత నన్ను, నా కొడుకుని హింసించేవాడు. వాడిని కొట్టకుండా అడ్డుపడేదాన్ని. నా భర్త నా తల మీద సుత్తితో బలంగా కొట్టాడు. 11 సంవత్సరాల నా బిడ్డ నా మాజీ భర్తను ఇంట్లో నుంచి పొమ్మని బయటికి తోసేశాడు. అలా ఆ రోజు నా కొడుకే నన్ను రక్షించాడు. నేను ఆసుపత్రి నుంచి వచ్చాక, నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకు దగ్గర నుంచి నాకు ‘‘అమ్మా! ప్లీజ్, ఇంటికిరా, నాకు నువ్వు కావాలి’’ అని ఒక మెసేజ్ వచ్చింది. నా ప్రయత్నం విరమించుకున్నాను. ఈ రోజుకీ నాకు పీడకలలు వస్తున్నాయి. నిద్రపోతే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భయం నన్ను విడిచిపెట్టట్లేదు. అందుకే కళ్లు మూసుకోలేకపోతున్నాను. – రోహిణి -
చట్టంతో కొట్టండి
రేపల్లె ప్రాంతంలోని ఎనిమిదో తరగతి బాలిక రోజూ ఇంటి సమీపంలోని వరుసకు బాబాయి అయిన వ్యక్తి వద్ద సాయంత్రం కబుర్లు చెపుతూ కూర్చొంటుంది. కొద్ది రోజుల తర్వాత కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళితే గర్భిణిగా నిర్ధారించారు. బాలికను అడిగితే బాబాయి అనే మానవ మృగం చేసిన పని కారణంగానే గర్భిణి అయినట్లు తేలింది. బయటకు తెలిస్తే పరువుపోతుందని తల్లిదండ్రులు బాలికకు గర్భస్రావం చేయించారు. పాఠశాలలోఅవగాహన కార్యక్రమానికి వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌కు బాలిక చెప్పిన అమానుషం ఇది. ఇటీవల తెనాలిలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్న మృగాడు ఆమె కూతురుపై కన్నేశాడు. మహిళకు నిద్రమాత్రలు వేసి.. బాలికపై మానవ మృగం లా వ్యవహరించాడు. కడుపు నొప్పితో బాధ పడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయిస్తే గర్భిణిగా తేలింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలికకు అవగాహనలేని కారణంగా ఏం జరుగుతుందనే విషయం కూడా తెలుసుకోలేకపోయింది. గుంటూరు: మన ఇంటికి వచ్చే బంధువులు, సన్నిహితుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. లేకుంటే అభం శుభం తెలియని పసిమొగ్గలను చిదిమేసి వారి భవిష్యత్‌పై మాయనిమచ్చ వేసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో బాధిత బాలికలు మగవారిపై చిన్న వయసులోనే సదభిప్రాయాన్ని కోల్పోతారని మానసిక వైద్యులు చెబుతున్నారు. స్పర్శ ద్వారా గ్రహించేలా అవగాహన కల్పించాలి ఇటీవల కాలంలో మైనర్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం పాఠ్యాంశాలతో సరిపెట్టకుండా టీనేజీ బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి అర్థమయ్యేలా వివరించాలని వైద్యులు చెబుతున్నారు. బాలికలపై తాకకూడని ప్రదేశాల్లో ఎవరైనా చేతులు వేస్తే సమీపంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంగానీ, పెద్దగా కేకలు వేయడంగానీ చేయాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకం... నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమయ్యాయి. తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ కారణంగా పిల్లలపై ప్రత్యేక దృష్టి నిలపలేకపోతున్నారు. ఇదే అవకాశంగా భావిస్తున్న మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి. మంచిచెడుల గురించి చెప్పాలి. పిల్లలతో కలసి ఒకే గదిలో నిద్రించే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. మహిళలు వేధింపులకు గురైతే రక్షణ పొందేందుకు చట్టాలు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్లు ఇలా... ♦ పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసులు నమోదైతే కనీసం ఏడేళ్ల జైలు, – జరిమానా విధించే అవకాశం ఉంది. ♦ సెక్షన్–100 ప్రకారం ఆత్మరక్షణ కోసం దాడి చేస్తే తప్పు లేదు. ♦ సెక్షన్ 294 ప్రకారం అసభ్యకరంగా ప్రవర్తిస్తే కనీసం మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ♦ సెక్షన్ 354(బీ) ప్రకారం మహిళల దుస్తులను బలవంతంగా తొలగిస్తే మూడు నుంచి ఐదేళ్ల శిక్ష పడుతుంది. ♦ సెక్షన్(సీ) ప్రకారం మహిళలు, విద్యార్థినుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే మూడేళ్ల శిక్ష పడుతుంది. ♦ సెక్షన్ 354(డీ) ప్రకారం ఉద్దేశపూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, పని చేసే ప్రాంతంలో యజమాని వేధింపులకు గురి చేసినా మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ♦ సెక్షన్ 494 ప్రకారం భార్య ఉండగా మరొకరిని వివాహం చేసుకుంటే జైలు శిక్షపడుతుంది. ♦ సెక్షన్ 498(ఏ) ప్రకారం వివాహితను హింసిస్తే కనీసం మూడేళ్లు శిక్షతోపాటు జరిమానా ఉంటుంది. ♦ సెక్షన్ 499 ప్రకారం ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడితే శిక్ష విధిస్తారు. ♦ సెక్షన్ 509 ప్రకారం మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా జైలు శిక్ష ఖాయం. -
‘మహిళలను అగౌరవపరిచిన వారికి శిక్ష పడాల్సిందే’
న్యూఢిల్లీ: మహిళల పట్ల గౌరవభావం లేని వారితో కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అమర్యాదకరంగా వ్యవహరిస్తే కఠిన శిక్షలుంటాయని అటువంటి వారికి హెచ్చరికలు పంపాలని స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ తెలిపారు. ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై మెజిస్టీరియల్ కోర్టు విధించిన శిక్షను తొలగించటానికి ఆయన నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ 2015 మే 25న బల్మీకి బస్తీలోని ఎంసీడీ టాయిలెట్లోకి వెళ్లింది. అదే సమయంలో కుమార్ అనే వ్యక్తి ప్రవేశించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు అతని నుంచి తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన మెజిస్టీరియల్ కోర్టు కుమార్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీనిపై కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ గురువారం తీర్పు సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ఒక వివాహితతో ఎలా మెలగాలో తెలియని వ్యక్తికి ఆ శిక్ష సబబేనని తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించటం ఐపీసీ ప్రకారం శిక్షార్హమైన తీవ్ర నేరాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని చెప్పారు. దీనిపై బాధితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. సదరు మహిళ తప్పుడు ఉద్దేశంతోనే, పథకం ప్రకారం కావాలనే ఈ కేసులో కుమార్‌ను ఇరికించిందని, విచారణ సందర్భంగా ఆమె భర్తను సరియైన రీతిలో విచారణ జరపలేదని పేర్కొన్నారు. -
స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి
మాదాపూర్: మాదాపూర్ హెచ్ఐసీసీలో ఐసీఓజీ, ఎఫ్వోజీఎస్ఐ, ’ధీర’ ఆధ్వర్యంలో ‘స్టాఫ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్’ పేరిట శనివారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ తార లావణ్యత్రిపాఠి, డాక్టర్ శాంతకుమారి, లలితా కుమార మంగళం, త్రిపురాన వెంకటరత్నం, సీఎన్ పురంధరే తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లి..
కుత్బుల్లాపూర్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన యువకులు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు అందడంతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మీకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కాలనీలో నివాసముంటున్న మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ఇంటి పై అంతస్తులో అద్దెకు ఉండే నలుగురు యువకులు ఈ నెల 18న ఆమెతో అసభ్యంగా మాట్లాడటంతో పాటు ఇంటి లోపలికి వెళ్లి ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో బాధితురాలి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు
హైదరాబాద్ : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళ్తే.. కవాడిపల్లికి చెందిన ఓ మహిళ పట్ల నర్సింహ అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. మహిళ పొలంలో పనులు చేస్తుండగా అక్కడకు వచ్చిన నర్సింహ ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిని వేధిస్తున్న కానిస్టేబుళ్లపై కేసు నమోదు
తిరువొత్తియూరు: గిండిలోని ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఇద్దరి పోలీస్కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. గిండికి చెందిన యువతి ఆంతోనియ. ఈమె గిండికి చెందిన పోలీసు కానిస్టేబుల్ మహేష్, సెంధిల్‌పై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తన భర్తపై సదరు కానిస్టేబుళ్లు అనవసరంగా కేసు నమోదు చేశారని పేర్కొంది. ఆపై తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు వివరించింది. డెప్యూటీ కమిషనర్ కన్నన్ దీనిపై విచారణ చేపట్టారు. నేరం రుజువుకావడంతో కానిస్టేబుళ్లపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జార్జి ఆదేశాలు జారీ చేశారు.