హైదరాబాద్: తనవద్ద పనిచేస్తున్న ఉద్యోగి భార్యపై కన్నేసి ఆమెను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌రోడ్ నెం 2లోని ఇందిరానగర్‌లో నివసించే బొల్లి బాలమద్దిలేటి ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు.
అదే సంస్థలో హౌజ్ కీపింగ్ ఉద్యోగిని ఐదు రోజుల క్రితం బైక్‌పై అతడి ఇంటి వద్ద దింపేందుకు వచ్చిన బాలమద్దిలేటి సదరు ఉద్యోగి భార్యపై కన్నేశాడు. మర్నాడు ఆమె భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చిన మద్దిలేటి ఆమెతో మాటలు కలిపాడు. రెండ్రోజుల పాటు ఆమెను వెంబడిస్తూ వేధించడమేగాక తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకంగా ప్రవర్తిస్తున్నాడు.
దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేఐసి మంగళవారం నాంపల్లిలోని 10వ స్పెషల్ మెట్రో పాలిటన్ మెజి్రస్టేట్ ఎస్.లక్ష్మణ్‌రావు ఎదుట హాజరు పర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment