యువతిని వేధిస్తున్న కానిస్టేబుళ్లపై కేసు నమోదు | Case files on police Constables due to woman harassment in Tamilnadu | Sakshi
Sakshi News home page

యువతిని వేధిస్తున్న కానిస్టేబుళ్లపై కేసు నమోదు

Published Tue, Aug 5 2014 8:59 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Case files on police Constables due to woman harassment in Tamilnadu

తిరువొత్తియూరు: గిండిలోని ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఇద్దరి పోలీస్‌కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. గిండికి చెందిన యువతి ఆంతోనియ. ఈమె గిండికి చెందిన పోలీసు కానిస్టేబుల్ మహేష్, సెంధిల్‌పై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తన భర్తపై సదరు కానిస్టేబుళ్లు అనవసరంగా కేసు నమోదు చేశారని పేర్కొంది.

ఆపై తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు వివరించింది. డెప్యూటీ కమిషనర్ కన్నన్ దీనిపై విచారణ చేపట్టారు. నేరం రుజువుకావడంతో కానిస్టేబుళ్లపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జార్జి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement