Viral Video: Two Men Broke Liquor Shop Get Drunk Caught Police - Sakshi
Sakshi News home page

Viral Video: దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు!

Published Tue, Sep 6 2022 4:51 PM | Last Updated on Tue, Sep 6 2022 5:26 PM

Viral Video: Two Men Broke Liquor Shop Get Drunk Caught Police - Sakshi

చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్‌ షాపుకి డ్రిల్లింగ్‌ మిషన్‌తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్‌ అయ్యి ప్లాన్‌ మార్చుకున్నారు.

కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్‌ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్‌ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో  ఓపెన్‌ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో  అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్‌ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement