case files
-
HYD: ఐటీ ఉద్యోగిపై జొమాటో డెలివరీ బాయ్ దాడి.. ప్రేమే కారణం?
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమై యువకుడు దాడి చేశాడు. ఆమె మెడపై, చేతులపై కత్తితో దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో, హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. వాసవిపై గణేశ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటూ గణేశ్.. వాసవిని హోటల్ వద్దకు పిలిచాడు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చింది. వారిద్దరూ మాట్లాడుకున్న కాసేపటికే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, ఆవేశానికి లోనైన గణేశ్.. తన బ్యాగులో ఉన్న కత్తిలో ఒక్కసారిగి ఆమెపై దాడి చేశాడు. మెడ, చేతిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తనను ప్రేమించలేదన్న కోపంతోనే గణేశ్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, వాసవి, గణేశ్.. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, గణేశ్ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఇక, వీరిద్దరూ గచ్చిబౌలి ఏరియాలోని ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు! -
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు దాసరి అరుణ్
-
‘డర్టీ హరి’ మూవీ నిర్మాతపై కేసు
సాక్షి, హైదరాబాద్: ‘డర్టీ హరి’ మూవీ నిర్మాతపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి మెట్రో పిల్లర్లపై ఇటీవల అతికించిన ఈ మూవీ పోస్టర్లు స్త్రీలను అవమానించేలా.. అగౌరవపరిచేలా ఉన్నాయని, అంతేగాక యువతను తప్పదోవ పట్టించే విధంగా ఆసభ్యకరమై ఆశ్లీల చిత్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీపై ఐపీసీ సెక్షన్ 292 చట్టం కింద మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. (చదవండి: నిర్మాతలు నష్టపోకూడదని...) అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో సన్నివేశాలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని, ఇంకా కొన్ని సన్నివేశాలైతే శ్రుతిమించి ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ హాట్ టాపిక్‌గా మారింది. అలాగే తాజాగా అతికించిన పోస్టర్లు సైతం మితిమీరి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన ఈ చిత్రంలో శ్రావణ్‌రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్క్ కె రోబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను శివరామకృష్ణ, సతీశ్‌బాబు, సాయిపునీత్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఫ్రైడే మూవీస్‌లో ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల కానుంది. (చదవండి: రాముడు... రావణుడు కాదు!) -
అవినీతి ఆరోపణలు.. ఈడీ కేసులు
రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమలుపుకి కారణమైన అజిత్ పవార్ సహా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పైనా, ఇతర నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు. ఎన్సీపీ నేతలపై మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం మొదలుకొని పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయి. అజిత్ పవార్, ఇరిగేషన్ స్కాం... అజిత్ పవార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుని మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుని బట్టి విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్ పవార్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే తన నిర్ణయాలన్నీ సెక్రటరీ స్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా తీసుకున్నవేనని అజిత్ పవార్ ఆ తరువాత సమర్థించుకున్నారు. సెప్టెంబర్ 2012న అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి, తిరిగి నియామకం అయ్యారు. శరద్ పవార్, అజిత్ పవార్లపై ఈడీ కేసు... ఈ యేడాది సెప్టెంబర్‌లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెలముందు ఎన్సీపీ నేత శరద్‌పవార్, అజిత్పవార్లపై ఇతర మనీ ల్యాండరింగ్ కేసులతో పాటు 25 వేల కోట్ల మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంకు కుంభకోణం కేసుని మోపారు. 2010 నవంబర్ 10 నుంచి 2014 సెప్టెంబర్ 26 వరకు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఎటువంటి నిబంధనలను పాటించకుండా, ఆర్థిక బలాలను పరిగణనలోనికి తీసుకోకుండా చక్కెర ఫ్యాక్టరీలకు విచ్చలవిడిగా రుణాలివ్వడం ద్వారా జనవరి 1, 2007 నుంచి 2017 డిసెంబర్ 31 మధ్య కాలంలో ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఎంఎస్సీసీ బ్యాంకుల నుంచి కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలకు ఎటువంటి పూచీ లేకుండా రుణాలిచ్చి, ఆ తరువాత వాటిని ఖాయిలాపడ్డ పరిశ్రమలుగా చూపించారన్న ఆరోపణలున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్సీపీ, శివసేనల నేతలు దిలీప్రావ్ దేశ్‌ముఖ్, ఇషార్లాల్ జైన్, జయంతి పాటిల్, శివాజీ రావ్, ఆనంద్‌రావు. రాజేంద్ర షింఘేన్, మాధవ్ పాటిల్‌లపై ఈడీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంకుల చట్టాలను, ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించిన విషయాన్ని నాబార్డ్ ఆడిట్ రిపోర్టు వెల్లడించింది. చగన్ భుజ్‌బల్‌పై ఈడీ కేసు... మనీ ల్యాండరింగ్, నేరపూరిత దుష్ప్రవర్తన, కుట్ర, మోసపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎన్సీపీ నాయకుడూ, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్‌ను 2016 మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండగా 2005లో ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండా, కె.ఎస్.చమాంకర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని భుజ్‌బల్‌పై ఆరోపణలున్నాయి. -
‘నేను దేవుడిని’.. నిర్మాతలపై కేసు నమోదు
బంజారాహిల్స్: క్రైస్తవుల మత విశ్వాసాలను కించపరిచేలా నేను దేవుడిని పేరుతో షార్ట్ ఫిలిం రూపొం దించిన సదరు నిర్మాణదారులపై కేసులు నమోదు చేయాల్సిందిగా క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త జెరుసాలెం మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజా రాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నేను దేవుడిని లఘుచిత్ర నిర్మాతలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా చిత్రాన్ని నిర్మించారని, దళిత క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు చిత్ర నిర్మాణదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీఎస్టీ మోసాలపై కొరడా
సాక్షి,సిటీబ్యూరో: జీఎస్టీ మోసాలపై తూనికలు, కొలతల శాఖ కొరడా ఝులిపించింది. జీఎస్టీ తగ్గినా పాత ధరల ప్రకారమే వస్తువులను విక్రయిస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థలపై గురువారం దాడులు నిర్వహించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 28 శాతం ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గించడం, మరికొన్ని వస్తువులపై జీఎస్టీని ఎత్తి వేశారు. అయితే పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు యథావిధిగా పాత ధరల ప్రకారమే విక్రయాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ అధికారులు 36 మందితో 18 బృందాలుగా ఏర్పడి గ్రేటర్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ ఉల్లంఘన, ఎంఆర్పీకి అదనంగా జీఎస్టి వసూలు, తగ్గిన జీఎస్టీ ధరలను అమలు చేయకపోవడం తదితర మోసాలను గుర్తించి 62 కేసులు నమోదు చేశారు. కేసులు ఇలా. జీఎస్టీ ఉల్లంఘన, అదనపు వసూళ్లపై తూనికలు, కొలుతల శాఖ అధికారులు మల్కాజిగిరిలోని యష్ ఎలక్ట్రానిక్స్–1, షా ఎలక్ట్రానిక్స్–1, పంజాగుట్టలోని– ఏషియన్ ఎలక్ట్రానిక్స్–1, బంజారాహిల్స్‌లోని రిలయన్స్ డిజిటల్–3, తార్నాకలోని బిగ్‌బజార్–1, చిక్కడపల్లిలోని లోటస్ హోం నీడ్స్–1, మాధాపూర్‌లోని రిలయన్స్ మార్ట్–1, సరూర్‌నగర్‌లోని బజాజ్ హోం అప్లయెన్సెస్–3, సికింద్రాబాద్ లోని కోపాల్ కంప్యూటర్స్ అండ్ లాప్టాప్స్–1, ఆబిడ్స్‌లోని మెట్రో–1, 7స్టెప్ల్ ఫుట్‌వేర్–1, సెంట్రో–1, మోచి–2, ఇసిఐఎల్ – మోర్ సూపర్ మార్కెట్–1, శ్రీ గురుకప గ్లాస్ ప్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్–1, బాలానగర్‌లోని గౌరవ్ సూపర్ మార్కెట్–1, మలక్‌పేట్‌లోని వెంకటరమణ పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్–3, శంషాబాద్‌లోని హనుమాన్ హార్డ్‌వేర్–1, భగవతి ట్రేడర్స్–1.లపై కేసులు నమోదు చేశారు. జీఎస్టీ మోసాలపై కఠిన చర్యలు కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరకుండా కొందరు వ్యపారులు పాతధరలకే విక్రయాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కొత్త ధరల అమలుపై అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలి. తగ్గిన ధరలకు అనుగుణంగా వస్తువులను విక్రయించకపోతే ఆయా వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేయాలి. –అకున్ సబర్వాల్తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ -
వరకట్న వేధింపులపై వివాహిత ఫిర్యాదు
తెనాలి: స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషనులో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పట్టణంలోని బాలాజీరావుపేట మసీదు బజారుకు చెందిన భవ్యకు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నివాసి నల్లగొండ వెంకట నాగబాలకృష్ణతో 2015 డిసెంబరు 7న వివాహమైంది. వివాహ సందర్భంగా రూ.2 లక్షల నగదు, 12 సవర్ల బంగారం, 6 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు. ప్రస్తుతం నాగబాలకృష్ణ కానూరులోని ఓ బ్యాంకు బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజరుగా చేస్తున్నాడు. వివాహమై కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. మగబిడ్డ కలిగాడు. తర్వాతనుంచి భర్త వైఖరి మారిపోయింది. తాగుడు వంటి వ్యసనాలకు అలవాటుపడి వేధింపులకు గురిచేస్తున్నట్టు భవ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందంగా లేనని తూలనాడటం, ఆడపడుచు చెప్పుడు మాటలతో భౌతిక హింసకు పాల్పడుతూ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్టు ఆరోపించారు. అత్తమామలకు ఈ విషయం తెలిసినా కొడుకుకు వత్తాసు పలుకుతున్నారని, విడాకులిస్తే తమ బిడ్డకు రెండో వివాహం చేసుకుంటామని చెబుతున్నారని భవ్య వాపోయింది. దీంతో విసిగిపోయి, తెనాలి వచ్చేసినట్టు తెలిపారు. తలిదండ్రులు తన అత్తమామలతో మాట్లాడటంతో బాగా చూసుకుంటామని హామీనివ్వడంతో మళ్లీ కాపురానికెళ్లినట్టు వివరించారు. అయినప్పటికీ పద్ధతి మారకపోగా, ఈనెల 18వ తేదీ రాత్రి తనను హింసించి, ఇంట్లోంచి బయటకు గెంటేసినట్టు భవ్య ఆరోపించారు. ఆ రాత్రి అక్కడే ఉండి, 19 ఉదయం విజయవాడ వచ్చానని, చేతిలో చార్జీలక్కూడా డబ్బుల్లేవని ఫోనులో తెలియజేయడంతో తలిదండ్రు లొచ్చి తీసుకెళ్లారు. భవ్య తెనాలి త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయగా ఈనెల 20న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
రేపు ‘బాబు’పై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు కాకినాడ : ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఈ నెల 8వ తేదీన పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లోని మెయిన్‌రోడ్డు లేదా ప్రధాన కూడళ్ళల్లో పార్టీ శ్రేణులంతా సమావేశమై రెండేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలను వంచించిన తీరుపై చైతన్యవంతం చేయాలన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన దగాకోరు తనాన్ని ఎండకట్టాలన్నారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమీపంలోని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు ముఖ్యనేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. -
కాపు నేతలపై కేసుల వర్షం ..!
ముద్రగడ సహా 27 మంది కాపు నేతలపై కేసులు ఐపీసీ సెక్షన్లు 19/16, 120 (బి), పోలీసు యాక్ట్ సెక్షన్లు 7(1), 307, 71 సభకు హాజరైన నేతలపై దృష్టి గ్రామాల్లో పోలీసులు ఆరా, వీడియోల పరిశీలన టీడీపీ మినహా అన్నిపార్టీల నేతలపై కేసులు కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణచివేసే కుట్ర 63 కేసుల్లో ఏ1 నిందితుడిగా ముద్రగడ ఆమరణ దీక్షకు ముందే అరెస్టు చేసే అవకాశం జిల్లా అంతటా బలగాల మోహరింపు అడుగడుగునా వాహనాల తనిఖీలు సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలవాసులంతా సౌమ్యులని, కాపులు సహనశీలురనీ, బయటి నుంచి వచ్చిన శక్తులే విధ్వంసం సృష్టించాయనీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు భిన్నంగా ప్రభుత్వం కాపు నాయకులే లక్ష్యంగా బలమైన కేసులు బనాయిస్తోంది. కాపు ఐక్యగర్జన సభ తదనంతరం చోటు చేసుకున్న విధ్వంసకర చర్యల్లో ముద్రగడ పద్మనాభంతో సహా 27 మంది కాపు నేతలపై కేసులు నమోదు చేసింది. ఈ ఘటనలతో సంబంధంలేని కాపు నాయకులను సైతం నిందితులుగా చేస్తూ బలమైన కేసులు బనాయించి కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ.వెయ్యికోట్లు విడుదల చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో ఊరూరా ఇవే హామీలిచ్చారు. ఆ తర్వాత అధికారం చేపట్టి 18 నెలలైనా చంద్రబాబు ఆ ఊసు ఎత్తకపోవడంతో ముద్రగడ నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం కాపు ఐక్యగర్జన నిర్వహించారు. ఆ సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం, పోలీసుస్టేషన్‌పై దాడి తదితర సంఘటనలను సాకుగా చూపి కాపులను, కాపు నేతలను, కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగానే సభ నిర్వహించిన ముద్రగడ పద్మనాభంతో పాటు వేదికపై ఉన్న నాయకులందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం సాయంత్రానికి 150 మంది నిందితులను గుర్తించామని, వారిపై తుని టౌన్, రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలో 63 కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. అందులో ముద్రగడను ప్రథమ నిందితుడి (ఏ1)గా చేర్చుతూ పోలీసులు బుధవారం వరకూ ఏకంగా 63 కేసులు నమోదు చేశారు. మిగతావారిని ఇతరులు అని నమోదు చేసినట్లు చెప్పారు. కానీ ఆ ఇతరుల జాబితాలో మాత్రం కాపు ఐక్యగర్జన సభకు హాజరైన నాయకులతో పాటు సభకు వెళ్లని కొందరు నాయకులు ఉన్నట్టు తెలిసింది. ఐపీసీ సెక్షన్లు 19/16, 120 (బి), పోలీసు యాక్ట్ సెక్షన్లు 7(1), 307, 71తో పాటు మరికొన్ని సెక్షన్లను ఒక్కో నాయకుడిపై ఒక్కోవిధంగా నమోదు చేసినట్టు సమాచారం. వైఎస్సార్సీపీ సహా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాజరైనా కేసే... కాపు ఐక్యగర్జన సభకు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పలువురు కాపు నాయకులు హాజరయ్యారు. సభ తర్వాత వారిలో చాలామంది ముద్రగడను అనుసరించలేదు. ముద్రగడ హఠాత్తుగా రైలు, రాస్తారోకోలకు పిలుపునివ్వడంతో వారంతా నిర్ఘాంతపోయారు. అక్కడ జరుగుతున్న గందరగోళంతో చాలామంది వేదిక దగ్గర నుంచే వెనుదిరిగారు. విద్రోహులు తగులబెట్టిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ వద్దకు కానీ, తుని రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు కానీ వారు వెళ్లలేదు. కానీ పోలీసులు మాత్రం వేదికపైనున్న నేతలందరిపైనా ఆయా విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన కేసులను బనాయించినట్టు తెలిసింది. సభకు వెళ్లని నాయకులపై కూడా కేసులు నమోదు చేసేందుకు కారణాలు వెదుకుతున్నారు. మరోవైపు సభకు ఎవరు హాజరయ్యారంటూ గ్రామాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. సెల్ఫోన్లతో తీసిన వీడియోలను పరిశీలిస్తూ సభకు వచ్చినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేసులు... కాపు ఐక్యగర్జన సభ పార్టీలకు అతీతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి హుకుం మేరకు టీడీపీ ముఖ్యనేతలు హాజరు కాకపోయినా... మధ్య, దిగువ శ్రేణి నాయకులు చాలావరకూ హాజరయ్యారు. కానీ కేసుల్లో దాదాపుగా నిందితులంతా వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారే ఉండటం గమనార్హం. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముద్రగడ పద్మనాభంతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన స్థానిక తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పేర్లు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు (కాంగ్రెస్), రాష్ట్ర మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ (బీజేపీ), కొప్పన మోహనరావు, వట్టి వసంతకుమార్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్సీ గంగాభవానీ (కాంగ్రెస్), తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. కాపు సంఘ నాయకులు నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, సినీనటుడు జీవీ సుధాకర్‌పై కేసులు నమోదు చేశారు. వారితో పాటు బీజేపీకి చెందిన అడపా నాగేంద్ర (విజయవాడ), నల్లా పవన్ (అమలాపురం) ఎల్లా దొరబాబు పేర్లు ఉన్నట్టు తెలిసింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ముత్యాల వీరభద్రరావు (కొత్తపేట), దూలిపూడి చక్రం (పసుపులంక), జామి తేనెలంకల (ముమ్మిడివరం) పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో వేదపాలేనికి చెందిన బండారు శ్రీనివాసరావు ఒక్కరే టీడీపీకి చెందినవారు. ఈ జాబితాలో నం.1 చానల్ ఎండీ ఎంఎస్ఆర్ నాయుడు పేరు కూడా ఉంది. అంతేగాకుండా సభ నిర్వహణకు స్థలం ఇచ్చిన రాజా చినబాబు, వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మరికొందరి నేతల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నట్టు తెలిసింది. సభకు రాకపోయినా మరికొందరు కాపు నాయకులపైనా కొన్ని సెక్షన్లతో పోలీసులు కేసులు నమోదు చేసినట్టు సమాచారం. 63 కేసుల్లో ఎ-1 ముద్రగడ సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం, పోలీసుస్టేషన్‌పై దాడి తదితర సంఘటనల్లో ముద్రగడను ప్రథమ నిందితుడి (ఏ1)గా చేర్చుతూ పోలీసులు బుధవారం వరకూ 63 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసువర్గాలే చెబుతున్నాయి. ముద్రగడ శుక్రవారం తన స్వగ్రామం కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టకముందే ఆయనను అరెస్టు చేయాలని పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి, ప్రధాని తదితర అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో కాస్త వేచిచూసే ధోరణి అవలంబించాలని నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి సూచనలు వస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పలువురు తూర్పుగోదావరి జిల్లాలో మకాం వేసి సమీక్షిస్తున్నారు. ఆమరణ నిరాహారదీక్షకు దిగిన తర్వాత ముద్రగడను అరెస్టు చేయడం కష్టసాధ్యమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ముందుగానే అరెస్టు చేస్తే... ఒకవేళ ఆయన హెచ్చరించినట్టు జైలులో దీక్ష చేసినా బలవంతంగానైనా విరమింపజేయడానికి వీలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. -
నిత్య పెళ్లి కూతురిపై పీడీయాక్ట్
హైదరాబాద్ : జాయింట్ కలెక్టర్‌ను అని నమ్మించి పలు మోసాలకు పాల్పడిన ఓ మహిళపై పోలీసులు పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణగౌడ్ తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు,అలియాస్ రాణి,బుజ్జి అలియాస్ అలేఖ్యారెడ్డి,హేమలత బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లో ఉండేది. కూలి పని చేసుకునే ఆమె ఎల్బీనగర్కు చెందిన రవీంద్రను వివాహం చేసుకుంది. కొద్ది కాలంపాటు అతడితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన హేమ భర్త వేధిసున్నాడంటూ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టింది. అనంతరం మోతీనగర్, బోరబండ ప్రాంతానికి వచ్చి జగదీష్‌ను రెండో పెళ్లి చేసుకుని అతడిపై కూడా కేసుపెట్టింది. తర్వాత పూర్ణచందర్‌ను మూడోపెళ్లి చేసుకుని అతనిపైనా కేసు పెట్టింది. చివరగా కరీంనగర్‌కు చెందిన కిశోర్‌ను నాలుగో పెళ్లి చేసుకుంది.ఆ తరువాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్,ఆర్.ఐగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుని పలువురిని మోసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలామంది వద్ద నుంచి భారీమొత్తంలో డబ్బులు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు. చివరగా ఆస్తికోసం బంధువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిత్య పెళ్లి కూతురిని ఫిబ్రవరి 11న ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా ఆమెపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. 18 మందిపై కేసు
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 2 లో శనివారం అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 18 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే 8 కార్లు, 11 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నంద్యాల కౌన్సిల్ విషయంలో టిడిపివారిపై కేసులు
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 17 మందిపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నుంచి 10 కార్లు, 6 బైకులు, ఆటో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. -
మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు
ఏలూరు: ప్రముఖ టీవీ చానల్లో క్రైమ్ రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం... కేసు నమోదు మరిచిపోకముందే... అదే జిల్లాలో మరో టీవీ రిపోర్టర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నర్సాపురం సమీపంలోని లక్ష్మణేశ్వర గ్రామానికి చెందిన ఆదిబాబు అనే వ్యక్తిని ఓ టీవీలో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వేండ్ర శ్రీనివాసరావు బెదిరించి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాంతో ఆదిబాబు మిన్నకుండ పోయాడు. అయితే ఇటీవల కాలంలో రిపోర్టర్ వేధింపులు ఆదిబాబుపై అధికమయ్యాయి. దీంతో బాధితుడు ఆదివారం నర్సాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వేండ్ర శ్రీనివాసరావుపై 341, 290, 323, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ టీవీ చానల్లో క్రైం రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విద్యా సంస్థ నుంచి భారీగా నగదు డిమాండ్ చేసి .... రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
యువతిని వేధిస్తున్న కానిస్టేబుళ్లపై కేసు నమోదు
తిరువొత్తియూరు: గిండిలోని ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఇద్దరి పోలీస్కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. గిండికి చెందిన యువతి ఆంతోనియ. ఈమె గిండికి చెందిన పోలీసు కానిస్టేబుల్ మహేష్, సెంధిల్‌పై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తన భర్తపై సదరు కానిస్టేబుళ్లు అనవసరంగా కేసు నమోదు చేశారని పేర్కొంది. ఆపై తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు వివరించింది. డెప్యూటీ కమిషనర్ కన్నన్ దీనిపై విచారణ చేపట్టారు. నేరం రుజువుకావడంతో కానిస్టేబుళ్లపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జార్జి ఆదేశాలు జారీ చేశారు. -
ప్రముఖ దర్శకుడి కుమార్తెకు వేధింపులు
-
ప్రముఖ దర్శకుడి కుమార్తెకు వేధింపులు
తన కుమార్తెను ఎస్ఎంఎస్లతో ఓ యువకుడు వేధిస్తున్నాడంటూ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫ్లోరిడా నుంచి వచ్చిన యువకుడు తన కుమార్తెకు ఎస్ఎంఎస్లు పంపిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో దర్శకుడు పేర్కొన్నారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అందులోభాగంగా డైరెక్ట్ర్ర్ కుమార్తెతో తనకు ఇటీవలే పరిచయమైందని ఈ నేపథ్యంలో ఆమెకు ఎస్ఎంఎస్లు పంపినట్లు వెల్లడించాడు. యువకుడి పేరు ప్రణీత్ అని, అతడి స్వస్థలం వైఎస్ఆర్ కడప జిల్లా అని పోలీసులు తెలిపారు. అయితే ప్రణీత్ తన తప్పు ఒప్పుకుని ఇకపై అలా జరగదని పోలీసుల ఎదుట తెలిపాడు. దాంతో టాలీవుడ్ దర్శకుడు, ఆ యువకుడిపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. -
నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నటుడిపై కేసు
వర్ధమాన సినీ నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సహచర నటుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటగిరిలో నివసించే యువతి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, టీవీ సీరియళ్లలోనూ నటిస్తోంది. సినీ నటుడు అల్లా భక్ష్ కొంత కాలంగా ఆమెను వెంబడిస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరూర్ నగర్ పీఎస్ లో స్వామి స్వరూపానందపై కేసు
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై సరూర్‌నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాగే మత విశ్వాసాలను గాయపరిచారన్న వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం సరూర్ నగర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం భక్తులు ఊరేగింపుగా సరూర్ నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాంతో స్వామి స్వరూపానందపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
'వీఐపీ టిక్కెట్లు విక్రయించినవారిపై కేసులు పెట్టండి'
వైకుంఠ ఏకదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి భక్తులపై టీటీడీ కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఖండించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... వీఐపీ టిక్కెట్లు విక్రయించిన వారిపైనే కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే భక్తులపై కేసుల నమోదుకు కారణమైన అధికారులపై చర్యలకు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. భక్తులపై కేసు నమోదు అంశంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలన్నారు. వైకుంఠ ఏకదశి సందర్భంగా శనివారం తిరమలకు భక్తులు పోటెత్తారు. అయితే టీటీడీ మాత్రం వీవీఐపీల సేవలో తరించింది. దాంతో భక్తులకు శ్రీవారి దర్శనం మరింత ఆలస్యం అయింది. దాంతో ఆగ్రహించిన భక్తులు టీటీడీ ఛైర్మన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాగా తిరుమలలో ఆందోళనలు నిషేధం. దాంతో టీటీడీ అధికారులు భక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆ క్రమంలో సీసీ కెమెరా ఫూటెజ్ లను తెప్పించుకుని పలువురు భక్తులపై కేసులు నమోదు చేశారు. దాంతో భక్తులపై కేసులా అంటు అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.