
సాక్షి, హైదరాబాద్: ‘డర్టీ హరి’ మూవీ నిర్మాతపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి మెట్రో పిల్లర్లపై ఇటీవల అతికించిన ఈ మూవీ పోస్టర్లు స్త్రీలను అవమానించేలా.. అగౌరవపరిచేలా ఉన్నాయని, అంతేగాక యువతను తప్పదోవ పట్టించే విధంగా ఆసభ్యకరమై ఆశ్లీల చిత్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీపై ఐపీసీ సెక్షన్ 292 చట్టం కింద మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. (చదవండి: నిర్మాతలు నష్టపోకూడదని...)
అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో సన్నివేశాలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని, ఇంకా కొన్ని సన్నివేశాలైతే శ్రుతిమించి ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ హాట్ టాపిక్‌గా మారింది. అలాగే తాజాగా అతికించిన పోస్టర్లు సైతం మితిమీరి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన ఈ చిత్రంలో శ్రావణ్‌రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్‌లు హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మార్క్ కె రోబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను శివరామకృష్ణ, సతీశ్‌బాబు, సాయిపునీత్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఫ్రైడే మూవీస్‌లో ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల కానుంది. (చదవండి: రాముడు... రావణుడు కాదు!)
Comments
Please login to add a commentAdd a comment