ShivaRamakrishna
-
ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన ప్రజా కవి కాళోజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్య పుస్తకాలలో కాళోజీ జీవిత చరిత్రను పొందుపరిచామని, కాళోజి పేరుమీద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు రసమయి బాలకృష్ణ, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో పాటు కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కడప: రాజకీయ సన్యాసం.. రాజకీయాల్లో నేతల మధ్య తరచూ వినిపించే మాట. ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగిన నేత ఏకంగా సన్యాసం స్వీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. డాక్టర్ వడ్డెమాను శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇదే నియోజకవర్గంలోని అట్లూరు మండలం కమలకూరు స్వగ్రామం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఈయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. 1972లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజివేముల వీరారెడ్డిపై తొలుత ఓటమి చెందారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. శివరామకృష్ణారావుతోపాటు అప్పట్లో పులివెందుల నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డిలు 1972లో తొలిసారి గెలుపొందారు. ముగ్గురు వైద్యులు కావడం, యువకులుగా అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. నాటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్లో మంత్రి పదవి అవకాశం వచ్చినా తన మిత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం త్యాగం చేసి వైఎస్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందారు. అంతకుముందు శివరామకృష్ణారావు తండ్రి వడ్డెమాను చిదానందం 1952లో తొలి జనరల్ ఎలక్షన్లలో బద్వేలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన 1962లో బద్వేలు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి మరోమారు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం గమనార్హం. బ్రహ్మణ సామాజికవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివరామకృష్ణారావు ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండోసారి సీఎంగా ఎన్నికైన వైఎస్సార్ ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని భావించినా ఆయన అకాల మరణం శివరామకృష్ణారావుకు ఊహించని షాక్. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఏపీ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు మానస సరోవర్, చార్దాం, అమర్నాథ్తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. మూడు నెలలుగా పూర్తి ఆధ్యాత్మిక జీవితంవైపు ఆకర్షితులైన ఆయన ఎట్టకేలకు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీ ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు. ప్రజల అభిమానం, ఆశీస్సులతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీ శివరామానంద సరస్వతి ‘సాక్షి’కి తెలిపారు. అందరిలో భగవంతుడు ఉన్నాడని, ఆయన సూచనలతోనే తాను సన్యాస దీక్ష తీసుకున్నానన్నారు. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని చింతతోనే గడపాలన్నది లక్ష్యమన్నారు. మొత్తానికి ఓ సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలను వదిలి సన్యాసం స్వీకరించడం బలమైన నిర్ణయమే. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. చదవండి: 58.16 లక్షల మందికి అందిన పింఛన్లు -
‘డర్టీ హరి’ మూవీ నిర్మాతపై కేసు
సాక్షి, హైదరాబాద్: ‘డర్టీ హరి’ మూవీ నిర్మాతపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి మెట్రో పిల్లర్లపై ఇటీవల అతికించిన ఈ మూవీ పోస్టర్లు స్త్రీలను అవమానించేలా.. అగౌరవపరిచేలా ఉన్నాయని, అంతేగాక యువతను తప్పదోవ పట్టించే విధంగా ఆసభ్యకరమై ఆశ్లీల చిత్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీపై ఐపీసీ సెక్షన్ 292 చట్టం కింద మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. (చదవండి: నిర్మాతలు నష్టపోకూడదని...) అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో సన్నివేశాలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని, ఇంకా కొన్ని సన్నివేశాలైతే శ్రుతిమించి ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ హాట్ టాపిక్‌గా మారింది. అలాగే తాజాగా అతికించిన పోస్టర్లు సైతం మితిమీరి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన ఈ చిత్రంలో శ్రావణ్‌రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్క్ కె రోబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను శివరామకృష్ణ, సతీశ్‌బాబు, సాయిపునీత్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఫ్రైడే మూవీస్‌లో ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల కానుంది. (చదవండి: రాముడు... రావణుడు కాదు!) -
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారని వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టళ్లను ఏఐఎస్ఎఫ్ ఆ«ధ్వర్యంలో సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లను అభివద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు అమలుచేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ హాస్టళ్లలో మాత్రం దొడ్డుబియ్యం పాలిష్‌చేసి వడ్డిస్తున్నారని ఆరోపించారు. ఇరుకుగదుల్లో, అద్దె భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేతూరి ధర్మతేజ, డి.రాము, జిల్లా నాయకులు కష్ణ, ప్రత్యూష్, నాగరాజు, యువజన సంఘం నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.