ప్రముఖ దర్శకుడి కుమార్తెకు వేధింపులు | Police case files on florida youth due to harassment to director's daughter | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడి కుమార్తెకు వేధింపులు

Jul 11 2014 11:14 AM | Updated on Aug 28 2018 4:30 PM

ప్రముఖ దర్శకుడి కుమార్తెకు వేధింపులు - Sakshi

ప్రముఖ దర్శకుడి కుమార్తెకు వేధింపులు

తన కుమార్తెను ఎస్ఎంఎస్లతో ఓ యువకుడు వేధిస్తున్నాడంటూ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.

తన కుమార్తెను ఎస్ఎంఎస్లతో ఓ యువకుడు వేధిస్తున్నాడంటూ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫ్లోరిడా నుంచి వచ్చిన యువకుడు తన కుమార్తెకు ఎస్ఎంఎస్లు పంపిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో దర్శకుడు పేర్కొన్నారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

అందులోభాగంగా డైరెక్ట్ర్ర్ కుమార్తెతో తనకు ఇటీవలే పరిచయమైందని ఈ నేపథ్యంలో ఆమెకు ఎస్ఎంఎస్లు పంపినట్లు వెల్లడించాడు. యువకుడి పేరు ప్రణీత్ అని, అతడి స్వస్థలం వైఎస్ఆర్ కడప జిల్లా అని పోలీసులు తెలిపారు. అయితే ప్రణీత్ తన తప్పు ఒప్పుకుని ఇకపై అలా జరగదని పోలీసుల ఎదుట తెలిపాడు. దాంతో టాలీవుడ్ దర్శకుడు, ఆ యువకుడిపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement