మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు | Case files on News Reporter in West Godavari district | Sakshi
Sakshi News home page

మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు

Published Sun, Sep 14 2014 3:27 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు

మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు

ఏలూరు: ప్రముఖ టీవీ చానల్లో క్రైమ్ రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం... కేసు నమోదు మరిచిపోకముందే... అదే జిల్లాలో మరో టీవీ రిపోర్టర్పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నర్సాపురం సమీపంలోని లక్ష్మణేశ్వర గ్రామానికి చెందిన ఆదిబాబు అనే వ్యక్తిని ఓ టీవీలో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న వేండ్ర శ్రీనివాసరావు బెదిరించి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

దాంతో ఆదిబాబు మిన్నకుండ పోయాడు. అయితే ఇటీవల కాలంలో రిపోర్టర్ వేధింపులు ఆదిబాబుపై అధికమయ్యాయి. దీంతో బాధితుడు ఆదివారం నర్సాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వేండ్ర శ్రీనివాసరావుపై 341, 290, 323, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ టీవీ చానల్లో క్రైం రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విద్యా సంస్థ నుంచి భారీగా నగదు డిమాండ్ చేసి .... రెడ్హ్యాండెడ్గా పోలీసులు దొరికిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement