News Reporter
-
పుతిన్‌తో ఇంటర్వ్యూ: ‘డ్రెస్ ఏంటి.. నీ ఎక్స్‌ప్రెషన్స్‌కి అర్థం ఏంటి?’
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, సీఎన్‌బీసీ న్యూస్ రిప్రజెంటర్ను ఉద్దేశించి అందంగా ఉంది.. ప్రెట్టీగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పుతిన్ వ్యాఖ్యలపై నెటిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రష్యా మీడియా ఎదురుదాడి ప్రారంభించింది. సదరు న్యూస్ రిప్రెజెంటరే పుతిన్‌ని డిస్టర్బ్ చేయాలని భావించింది.. ఆమె బాడీ ఎక్స్ప్రెషన్స్, డ్రెస్ చూస్తే.. పుతిన్‌కి సిగ్నల్ ఇచ్చినట్లే ఉందని ఎదురుదాడికి దిగింది. రష్యా మీడియాపై నెటిజనుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రధాని మరీ అంత బలహీన మనస్తత్వం కలవాడా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదానికి ఆజ్యం పోసిన సంఘటన వివరాలు.. మాస్కోలోని ఎనర్జీ ఫోరమ్‌లో రష్యన్ ప్రధాని వ్లాదిమర్ పుతిన్ పాల్గొన్న సెషన్‌కు సీఎన్‌బీసీ ఉద్యోగి హాడ్లీ గ్యాంబుల్ మోడరేటర్‌గా ఉన్నారు. యూరోప్‌లో ఏర్పడ్డ గ్యాస్ సంక్షోభం గురించి జరిగిన సెషన్లో పుతిన్ ఆమెను ఉద్దేశించిన అందంగా ఉంది.. ప్రెట్టీగా ఉందని ప్రశంసించాడు. పుతిన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవహారం కాస్త ముదురుతుండటంతో పుతిన్ ప్రచారకుడు వ్లాదిమిర్ సోలోవియోవ్ రంగంలోకి దిగారు. (చదవండి: రష్యాకు ఊహించని దెబ్బ.. భారత్‌లో పడిపోయిన డిమాండ్) సోలోవియోవ్ తన రోసియా 1 న్యూస్ ఛానల్లో హాడ్లీ గ్యాంబుల్, పుతిన్ మధ్య జరుగుతున్న సంభాషణకు సంబంధించిన వీడియోను టెలికాస్ట్ చేశాడు. దీనిలో గ్యాంబుల్, పుతిన్ 'దృష్టి మరల్చడానికి' అన్ని విధాలుగా ప్రయత్నించిందని ఆరోపించాడు. ఫుటేజ్‌లో ప్రధానంగా ఆమె కాళ్లపై దృష్టి పెట్టాడు. పుతిన్‌తో మాట్లాడుతున్నప్పుడు హాడ్లీ తన కాళ్లను ముందుకు వెనక్కి ఊపుతూ ఉంటుంది. హాడ్లీ చర్యలపై రష్యా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘హాడ్లీ ఈ పనుల ద్వారా తనను తాను ఒక సెక్స్ ఆబ్జెక్ట్‌గా ప్రదర్శించుకుంది. పుతిన్ దృష్టిని మరల్చాలని విఫల యత్నం చేసింది’’ అంటూ మండిపడుతుంది. ఈ దుమారంపై సీఎన్‌బీసీ కానీ, గ్యాంబ్లర్ కానీ స్పందించలేదు. కానీ గ్యాంబ్లర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పుతిన్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా తీసిన ఓ ఫోటోని పోస్ట్ చేసి.. ‘నా ఫేవరెట్ యాంగిల్’ అని పేర్కొంది. దీనిలో ఆమె కాలు పుతిన్ వైపు చాపినట్లు ఉంది. (చదవండి: రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం.. ‘ఏ క్షణంలోనైనా మృతి’) ఇక రష్యా మీడియా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికన్ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అంటే జర్నలిస్ట్ అన్న వాడు మీ ఇంటర్వ్యూని శ్రద్ధగా వినాలని రూల్ ఏమైనా ఉందా.. వినకపోవడం ఏమైనా అమర్యాదకర చర్యా’’.. ‘‘పుతిన్ వ్యాఖ్యలు చూస్తే.. పిరికివాడు తన అనుచిత ప్రవర్తనను కప్పిపుచ్చుకునే విధంగా ఉన్నాయి. అక్కడ ఓ మగ జర్నలిస్ట్ ఉంటే పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడా’’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. చదవండి: పుతిన్ కండబలం -
ఆ ‘కోపధారి మనిషి’.. జాక్‌పాట్ కొట్టేశాడు
Chand Nawab Karachi Se: కోపధారి మనిషి.. ఈ వీడియో గురించి బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే చాలాకాలం క్రితమే ఈ తరహా యాటిట్యూడ్‌తో పాకిస్తాన్‌లోనూ ఓ రిప్టోరర్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ‘చాంద్ నవాబ్.. కరాచీ సే..’ అంటూ వార్తల కవరేజ్‌కి విఫలయత్నం చేసిన పాక్ జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా!. ఆ జర్నలిస్ట్ సాబ్.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు. ఈ వైరల్ వీడియోను నాన్ ఫంగిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) కింద వేలం వేయబోతున్నారు. జర్నలిస్ట్ చాంద్ నవాబ్.. పాక్‌లోనే కాదు ఇండియాలో.. ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ భజరంగీ భాయీజాన్(2015)లో ఈయన క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఓ స్ఫూఫ్ వీడియో కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని నవాజుద్దీన్ సిద్ధిఖీ అద్భుతంగా పోషించాడు కూడా. సుమారు 12 ఏళ్ల క్రితం వైరల్ అయిన ఆ వీడియోను.. ఇప్పుడు ఎన్ఎఫ్టీ నుంచి ఫౌండేషన్ యాప్ ద్వారా వేలం వేయబోతున్నారు. ఇంతకీ ప్రారంభ బిడ్ ఎంతో తెలుసా? ఒత్తిడిలోనే అలా చేశా డిజిటల్ ఆక్షన్ ప్లాట్‌ఫామ్ మీద స్వయంగా చాంద్ నవాబ్.. ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. ‘‘నేను చాంద్ నవాబ్‌ని. వృత్తిరీత్యా జర్నలిస్ట్/రిపోర్టర్ని. 2008లో నా వీడియో ఒకటి యూట్యూబ్ ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. పండుగ పూట రైల్వే స్టేషన్లో కవరేజ్ చేస్తుండగా.. ప్రయాణికులు అడ్డురావడంతో నాకు విసుగొచ్చింది. జర్నలిజంలో ఉన్న ఒత్తిడి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఫ్రస్టేషన్లోనే అలా ప్రవర్తించా. అయితే ఆ వీడియో నన్ను మీకు పరిచయం చేసింది. నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నా క్యారెక్టర్ స్ఫూర్తితోనే కబీర్‌ఖాన్ డైరెక్షన్లో వచ్చిన భజరంగీ భాయీజాన్ సినిమాలో నవాజుద్దీన్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ ద్వారా నన్ను మరోసారి వైరల్ చేశారు. నాపై అభిమానం చూపిన వాళ్లందరికీ థ్యాంక్స్’ అంటూ పేర్కొన్నాడు కరాచీకి చెందిన చాంద్ నవాబ్. ఇక ఈ వీడియోను ప్రారంభ బిడ్ ధర అక్షరాల 46 లక్షల రూపాయలు(63వేల డాలర్లు)గా నిర్ణయించింది ఎన్ఎఫ్టీ ఫౌండేషన్. మరి ఇది ఎంతకు అమ్ముడు పోతుందో, చాంద్ నవాబ్కు ఎంత లాభం తెచ్చిపెడుతుందో చూడాలి మరి. ఎన్ఎఫ్టీ అంటే బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. క్లిక్ చేయండి: ఎన్ఎఫ్టీ.. తొలి హీరో ఎవరో తెలుసా? -
కంచికచర్ల వద్ద పట్టుబడ్డ డబ్బు ఎవరిది?
సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సును కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీ చేసినప్పుడు పట్టుబడిన రూ.50 లక్షలు ఎవరివనే ప్రశ్న పోలీసుల బుర్రను తొలుస్తోంది. ఆ డబ్బులు తీసుకెళ్తున్న మహా న్యూస్ రిపోర్టర్ ఏఎన్వీ సూర్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ మొత్తానికి సరైన ఆధారాలు చూపించక పోవడంతో పూచీకత్తు రాయించుకుని అతడిని విడిచి పెట్టారు. అయితే అదే బస్సులో హైదరాబాద్‌లో రూ.3 కోట్లు నగదు దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. బస్సులో ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించే దశలో టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీకి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఒకరు, గతంలో టీడీపీలో కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఈ విషయంలో పోలీసులు లోతుగా వెళ్లకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల తీరుపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ డబ్బును హైదరాబాద్‌లో ఉండే ఆ చానల్ కీలక ప్రతినిధికి అందజేసేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. టీడీపీ హయాం నుంచి ఒక వెలుగు వెలుగుతున్న ఆ సీనియర్ జర్నలిస్టు విశాఖలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్‌ను బెదిరించి ఈ డబ్బు రాబట్టినట్లు సమాచారం. కాగా, పట్టుబడిన రూ.50 లక్షలను విశాఖ మహా న్యూస్ రిపోర్టర్ క్రాంతికుమార్ తనకు ఇచ్చినట్లు ఏఎన్వీ సూర్యనారాయణ చెప్పాడని, అతన్ని కూడా పిలిచి ఆరా తీస్తామని రూరల్ సీఐ సతీష్ తెలిపారు. -
స్టోరీ రాస్తావా..! అంటూ రిపోర్టర్‌పై దాడి
-
స్టోరీ రాస్తావా..! అంటూ మాఫియా దాడి
సాక్షి, బెంగుళూరు: అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టుపై కర్ణాటకలో దాడి జరిగింది. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడం గమనార్హం. సరైన బలగం లేనందున కబేళం లోనికి వెళ్లలేమని హెచ్చరించిన పోలీసులు పశువుల అక్రమ రవాణా మాఫియాకు ఉప్పదించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రాంనగర్ జిల్లాలోని కుడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొడిపాల్యా గ్రామంలో అక్రమ కబేళం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఓ జంతు ప్రేమికుడు పోలీసులకు సమాచారమిచ్చారు. రోజూ 200 ఆవుదూడలను వధించి, మాంసాన్ని రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తగిన పోలీసు బలగం లేనందున కబేళంలోనికి ప్రవేశించడానికి జంతు ప్రేమికుడు జాషైన్ ఆంథోని, ఓ జాతీయ పత్రికకు చెందిన రిపోర్టర్‌కు డీఎస్పీ అనుమతిన్విలేదు. మరుసటి రోజు (మంగళవారం) ఇద్దరు పోలీసులతో పాటు ఆంథోని, రిపోర్టర్ అక్కడికి చేరుకున్నారు. డీఎస్పీ ఆదేశాలతో కుడూర్ పోలీసులు ఆ కబేళంపై దాడి చేశారు. అయితే అప్పటికే కబేళం నిర్వహిస్తున్న మాఫియాకు సమాచారం అందడంతో అక్కడ ఆవుదూడల జాడ లేకుండా చేశారనీ, ఎవరికీ అనుమానం రాకుండా వాటిని అక్కడి నుంచి వేరే చోటికి తరలించారని రిపోర్టర్ ఆరోపించారు. పరిసరాల్లో లభ్యమైన పశువుల వ్యర్థాలు, ఎముకలు, రక్తపు మరకలతో అక్కడ కబేళం నిర్వహిస్తున్నారనే నిర్ధారించుకున్న రిపోర్టర్ ఆవుదూడలు దాచిపెట్టిన స్థలాన్ని కనుగొన్నాడు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా అక్కడే కాపుగాసిన కబేళం నిర్వహిస్తున్న కొందరు రిపోర్టరుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. 71 ఆవుదూడలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిపోర్టరుపై దాడి చేసిన గజీపీర్, ఖాసీ, సయ్యద్, ముబారఖన్, నూర్, ఇంతియాజ్, తాబ్రేజ్‌లపై కేసు నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణలపై కూడా కేసులు పెట్టారు. -
పిల్లలు ఆడుకునే ట్యూబ్‌పైకెక్కి.. రిపోర్టింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదాల్ని, ప్రకృతి విపత్తులను ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మీడియా రిపోర్టర్లు కాస్త వైవిధ్యంగా ఆలోచిస్తారు. ఘటన తీవ్రతను తమదైన శైలిలో ప్రజలకు అందిస్తారు. గతకొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాలకు పొరుగు దేశం పాకిస్తాన్లో గల లాహోర్ నగరం నీట మునిగింది. రోడ్లన్నీ ఈత కొలనులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాలు బయటపెడదామన్నా కుదరని పరిస్థితి తలెత్తింది. అలా అని ఇంట్లో కూర్చుంటే సమాజంలో మీడియా పాత్ర ఏముంటుంది..! అందుకే.. ఓ వార్తా చానెల్‌కు చెందిన రిపోర్టర్ భారీ వర్షాలతో అక్కడి జనం పడుతున్న కష్టాలను తెలియజేయడానికి వినూత్న పంథా ఎంచుకున్నాడు. లాహోర్ నడిబొడ్డున ఓ రోడ్డు స్విమ్మింగ్ పూల్‌ను తలపిస్తోందని.. నగరమంతా ఇదే పరిస్థితి అని అతను గంభీరంగా రిప్టోర్టింగ్ చేశాడు. అయితే, అతను చెప్పిన విషయాల కన్నా.. అతను వినూత్నంగా రిపోర్టరింగ్ చేసిన తీరే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. స్విమ్మింగ్ పూల్లా మారిన రోడ్డు మధ్యలో చిన్న పిల్లలు ఆడుకునే ట్యూబ్‌లపై కూర్చొని.. చుట్టు పిల్లలు ఆడకునే ట్యూబ్ బొమ్మలు పెట్టుకొని.. అతను కథనాన్ని అందించాడు. లా‘హోరు’ బాధలను అతను పరిచయం చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
చుట్టూ నీరు...అయినా న్యూస్ కవరేజ్..!
-
మహిళా రిపోర్టర్‌తో.. బిత్తిరి చర్య
మాస్కో : ఫిఫా ప్రపంచ కప్‌లో మహిళా న్యూస్ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. కొలంబియాకు చెందిన జూలియట్ గోంజాలెజ్ థెరాన్ ఓ జర్మన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్ కవరేజ్ కోసం వెళ్లిన థెరాన్ సరన్స్ ప్రాంతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించి, ముద్దు పెట్టాడు. లైవ్ కవరేజ్ కావడంతో థెరాన్ రియాక్ట్ కాలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఆ మహిళా రిపోర్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూస్ టీం, తాను లైవ్ కవరేజ్ కోసం రెండు గంటల నుంచి ఆ ప్రాంతంలో కష్టపడుతున్నామని, లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టాక రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆ వ్యక్తి వేచి చూసి, ఈ సిగ్గుమాలిన పని చేశాడని థెరాన్ పేర్కొన్నారు. లైవ్ రిపోర్టింగ్ అనంతరం ఆ వ్యక్తి కోసం వెతికినా దొరకలేదని తెలిపారు. ‘నేను ఇలాంటి ఘటన ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదు. మేము ఫుట్‌బాల్ గురించి ఎంతో కొంత సాకర్ అభిమానులకు తెలియజేయాలని అనుకున్నాం. కానీ అభిమానం ప్రేమగా స్వీకరించేలా ఉండాలి కాని వేదింపుగా ఉండకూడదు’అంటూ థెరాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ యువకుడి చర్యపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. -
న్యూస్ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన!
-
విలేకరిపై దాడి చేసిన ఫారెస్ట్ సిబ్బంది
-
రహమతుల్లా నుంచి ‘శశిశ్రీ’ వరకు...
కవి, రచయిత, వక్త, పత్రికా సంపాదకులు, ప్రసార భారతి న్యూస్ రిపోర్టర్ -ఇలా మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికీ, ఇతర రంగాలకూ సేవ లందించిన ప్రజ్ఞాశాలి శశిశ్రీ (6.12.1957- 31-3- 2015). కడప జిల్లా సిద్ధవటంలో ఎస్.బి.సలీమాబీ, ఎస్.బి.రసూల్ దంపతులకు జన్మించిన శశిశ్రీ కడప పట్టణమే కార్యక్షేత్రంగా సేవలు అందించారు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి దగ్గర ప్రాచీన సాహిత్యం, వై.సి.వి. రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి వంటి వారి దగ్గర అభ్యుదయ సాహిత్యం అధ్యయనం చేసిన విశాల దృక్పథం శశి శ్రీది. ‘మనోరంజని’ లిఖిత మాసపత్రికను, ‘సాహి త్యనేత్రం’ మాసపత్రికను స్థాపించి తనదైన ప్రతి భను చాటుకున్నారాయన. తనకు తెలుగు సాహిత్యంలో ఓనమాలు నేర్పి న తొలి గురువు పుట్టపర్తి వారేనని శశిశ్రీ చెప్పుకునే వారు. పుట్టపర్తి ఇంటి దగ్గరే తెలుగు పంచ మహాకా వ్యాలు, సంస్కృత కావ్యం ‘భామినీ విలాసం’ చదు వుకున్నట్టు చెబుతుండేవారు. ఒకసారి పుట్టపర్తి వారి ఇంటికి ఒక పండితుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్న రహమతుల్లా (శశిశ్రీ)ను చూసి నీ పేరేమిటి? అని అడిగాడు. వెంటనే ఎస్.బి. రహమతుల్లా అని బదు లిచ్చాడు. ఆ వ్యక్తి ముఖకవళికల్లో మార్పు వచ్చింది. అంతటితో ఊరుకోక ‘‘స్వామీ! పోయి పోయి మహమ్మడ న్కా మీరు సాహిత్య పాఠాలు చెప్పే ది!’’ అని అనేశాడు. అది విన్న రహమ తుల్లా వెంటనే తన పుస్తకాలు చేతబట్టు కొని వెళ్లిపోతుంటే పుట్టపర్తి వారు ‘‘రేయ్! పాఠం మధ్యలో వదిలి ఎక్క డికి వెళ్తావు? కూర్చో...’’ అని వచ్చిన వ్యక్తిపై కోపా న్ని పరోక్షంగా ప్రదర్శిస్తూ మందలించారు. ఇలాంటి కొన్ని సందర్భాలు ఆయన మనసును నొప్పించాయి. ‘‘ఒరే, రహమతుల్లా! ఇప్పుడు కవిత్వమంటూ నాలుగు గీతలు గీసే నాయాళ్లంతా ఏదో ఒక కలం పేరు పెట్టుకుని చలామణి అవుతున్నారు. సరైన పద్ధ తిలో రచనలు చేస్తున్న నీవు కూడా ఒక కలం పేరు పెట్టుకుంటే పోదా!’’ అని పుట్టపర్తి రహమతుల్లాతో అన్నారు. ‘అది మీరే సూచించండి స్వామీ!’ అని కోరగా... పుట్టపర్తి ‘శశిశ్రీ’ అని పెట్టుకో, పోరా అని నవ్వుతూ చెప్పారు. ఆ విధంగా రహ మతుల్లా ‘శశిశ్రీ’ పేరుతో సాహిత్య సేవలను అందిస్తున్నారు. ఈ పేరు వారి పెండ్లి పత్రికల్లోనూ, దస్తా వేజు ల్లోనూ, బ్యాంకు అకౌంట్లకు కూడా చలామణి కావడం విశేషం. ‘పల్లవి’, ‘శబ్దానికి స్వాగతం’, ‘జేబులో సూర్యుడు’, ‘కాలాంతవేళ’ (వచన కావ్యాలు), ‘సీమగీతం’ (పద్య కావ్యం), ‘చూపు’ (వ్యాసాలు), ‘దహేజ్’, ‘టర్న్స్ ఆఫ్ లైఫ్’, ‘రాతిలో తేమ’ (కథా సంపుటాలు), ‘మనకు తెలి యని కడప’ (చరిత్ర), గురుదక్షిణకు చిహ్నంగా కేం ద్ర సాహిత్య అకాడమీ సహకారంతో ‘పుట్టపర్తి నారాయణాచార్య’ (విమర్శ) శశిశ్రీ రచించారు. ఆయన కథలు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కన్నడ, మల యాళ భాషలలోకి అనువాదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2010’, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘పట్టాభిరామిరెడ్డి లిటరరీ అవార్డు-2008’, గుంటూరు అభ్యుదయ రచయితల నుంచి ‘కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పుర స్కారం-2008’, పత్రికా రచయితగా అందించిన సేవలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్త మ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు-2007’, ‘యునిసెఫ్ అవార్డు-2010’ వంటి ఎన్నో పురస్కా రాలు ఆయనను వరించాయి. విద్యారంగానికి అం దించిన సేవలకు గుర్తింపుగా యోగి వేమన విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యునిగా రాష్ట్ర గవ ర్నర్ చేత నియమితులయ్యారు. ఆయన ‘అభ్యుద య రచయితల సంఘం’ రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా కూడా పనిచేశారు. శశిశ్రీ మన మధ్య లేకపోయినా వారి రచనలు సాహిత్యలోకంలో విరాజిల్లుతున్నం త కాలం ఆయన కీర్తి అనే శరీరంతో జీవించివున్నట్లే. సవరణ ‘‘రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అనే శీర్షి కతో బుధవారం (01-04-2015) ‘సాక్షి’లో 4వ పేజీలో వెలువడిన వ్యాసంలో రచయిత్రి సామాన్య ఫోన్ నంబరు తప్పుగా అచ్చయింది. ఆ ఫోన్ నంబ ర్ను 80196 00900 గా చదువుకోగలరు. - సి.శివారెడ్డి సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, కడప -
మరో రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్... కేసు నమోదు
ఏలూరు: ప్రముఖ టీవీ చానల్లో క్రైమ్ రిపోర్టర్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం... కేసు నమోదు మరిచిపోకముందే... అదే జిల్లాలో మరో టీవీ రిపోర్టర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నర్సాపురం సమీపంలోని లక్ష్మణేశ్వర గ్రామానికి చెందిన ఆదిబాబు అనే వ్యక్తిని ఓ టీవీలో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వేండ్ర శ్రీనివాసరావు బెదిరించి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాంతో ఆదిబాబు మిన్నకుండ పోయాడు. అయితే ఇటీవల కాలంలో రిపోర్టర్ వేధింపులు ఆదిబాబుపై అధికమయ్యాయి. దీంతో బాధితుడు ఆదివారం నర్సాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వేండ్ర శ్రీనివాసరావుపై 341, 290, 323, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ టీవీ చానల్లో క్రైం రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ రిపోర్టర్ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విద్యా సంస్థ నుంచి భారీగా నగదు డిమాండ్ చేసి .... రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు దొరికిపోయిన సంగతి తెలిసిందే.