ప్రమాదాల్ని, ప్రకృతి విపత్తులను ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మీడియా రిపోర్టర్లు కాస్త వైవిధ్యంగా ఆలోచిస్తారు. ఘటన తీవ్రతను తమదైన శైలిలో ప్రజలకు అందిస్తారు. గతకొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాలకు పొరుగు దేశం పాకిస్తాన్‌లో గల లాహోర్ నగరం నీట మునిగింది. రోడ్లన్నీ ఈత కొలనులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాలు బయటపెడదామన్నా కుదరని పరిస్థితి తలెత్తింది.