Lahore city
-
లాహోర్ లోని కెనాల్ రోడ్ లో ఆస్ట్రిచ్ పరుగులు
-
పాకిస్తాన్లో వరుస సిలిండర్ల పేలుడు; వీడియో వైరల్
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్ సిటీలో మంగళవారం భయానక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బర్కత్ మార్కెట్లో భారీ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో ఒక్కసారిగా బర్కత్ మార్కెట్ దద్దరిల్లింది. ఈ పేలుళ్ల ధాటికి మార్కెట్లో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ సిలిండర్ల పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భారీగానే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ఆ అడవి మహిళలకు మాత్రమే.. మగవాళ్లు వస్తే ఇక అంతే! డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే #BREAKING : 🚨 Huge Cylinder Blast In Barkat Market, Garden Town Lahore, Pakistan.!! pic.twitter.com/HZNQlsv5Hp — NewsBox India🚨 (@Newsbox_India) June 29, 2021 شروع کی ویڈیو pic.twitter.com/zgZzWwVHjA — Ali hassan Rao (@Alihass68134141) June 29, 2021 -
పాక్‌లో సిక్కు యువతి మత మార్పిడి !
-
పాక్‌లో కలకలం; భారత్ ఆందోళన
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తె ఒకరు ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బలవంతంగా పెళ్లి చేసి మత మార్పిడి చేశారని యువతి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, అలాంటిదేమీ లేదని, తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నాననీ ఆ యువతి చెప్తున్న వీడియో బయటికి రావడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో పాకిస్తాన్ విచారణకు ఆదేశించింది. తమ కుమార్తె జగ్జీత్ కౌర్ గత మూడు రోజులుగా కనిపించడం లేదని లాహోర్‌లోని నంకనా సాహెబ్‌లోని సిక్కు పూజారి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్ కౌర్ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని.. ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. వీడియోలో ముస్లిం భర్త ఆమె పక్కనే ఉన్నారు. ఈ మేరకు యువతి వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్‌లోని మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బుజ్డార్ స్పందించి విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ (భారత్) ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ వీడియోను ట్వీట్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత మార్చిలో సింధు ప్రావిన్స్‌లో ఇద్దరు హిందూ మైనర్ బాలికలను అపహరించి ముస్లిం యువకులతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ ఘటనపై నాటి విదేశాంగ మంత్రి, దివంగత నేత సుష్మాస్వరాజ్ చొరవ తీసుకొని నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని కోరారు. బాలికల కుటుంబీకులు కోర్టులో కేసు వేసినప్పటికీ తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కశ్మీర్ అంశంపై ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పర్యవసానాలు ఎలా ఉంటాయోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
పిల్లలు ఆడుకునే ట్యూబ్‌పైకెక్కి.. రిపోర్టింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదాల్ని, ప్రకృతి విపత్తులను ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మీడియా రిపోర్టర్లు కాస్త వైవిధ్యంగా ఆలోచిస్తారు. ఘటన తీవ్రతను తమదైన శైలిలో ప్రజలకు అందిస్తారు. గతకొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాలకు పొరుగు దేశం పాకిస్తాన్లో గల లాహోర్ నగరం నీట మునిగింది. రోడ్లన్నీ ఈత కొలనులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాలు బయటపెడదామన్నా కుదరని పరిస్థితి తలెత్తింది. అలా అని ఇంట్లో కూర్చుంటే సమాజంలో మీడియా పాత్ర ఏముంటుంది..! అందుకే.. ఓ వార్తా చానెల్‌కు చెందిన రిపోర్టర్ భారీ వర్షాలతో అక్కడి జనం పడుతున్న కష్టాలను తెలియజేయడానికి వినూత్న పంథా ఎంచుకున్నాడు. లాహోర్ నడిబొడ్డున ఓ రోడ్డు స్విమ్మింగ్ పూల్‌ను తలపిస్తోందని.. నగరమంతా ఇదే పరిస్థితి అని అతను గంభీరంగా రిప్టోర్టింగ్ చేశాడు. అయితే, అతను చెప్పిన విషయాల కన్నా.. అతను వినూత్నంగా రిపోర్టరింగ్ చేసిన తీరే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. స్విమ్మింగ్ పూల్లా మారిన రోడ్డు మధ్యలో చిన్న పిల్లలు ఆడుకునే ట్యూబ్‌లపై కూర్చొని.. చుట్టు పిల్లలు ఆడకునే ట్యూబ్ బొమ్మలు పెట్టుకొని.. అతను కథనాన్ని అందించాడు. లా‘హోరు’ బాధలను అతను పరిచయం చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
చుట్టూ నీరు...అయినా న్యూస్ కవరేజ్..!
-
మరో ముగ్గురు ఖైదీలకు ఉరి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లాహోర్ నగరంలోని సెంట్రల్ జైలులో ముగ్గురు ఖైదీలకు ప్రభుత్వం శుక్రవారం ఉరిశిక్షను అమలు చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ ముగ్గురు హత్య కేసులో నిందితలను తెలిపింది. 1998లో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన కేసులో నిందితులు సమర్ జాన్, నదీమ్ షెహజాద్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే ఇద్దరు వ్యక్తుల హత్య చేసిన కేసులో రియాజ్ యూసఫ్ నిందితడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో వారికి శుక్రవారం లాహోర్ సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు ఉరిశిక్షను అమలు చేశారు. -
బాంబు పేలుడు: 12 మందికి గాయాలు
పాకిస్థాన్ లాహోర్ నగరంలో ఓ షాప్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 12 మంది గాయపడ్డారు. ఈ మేరకు జియో న్యూస్ శుక్రవారం వెల్లడించింది. స్థానికుల సహయంతో భద్రత సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు చెప్పింది. కాగా షాపు వద్ద బాంబు పేలుడుకు దాదాపు 300 గ్రాముల పేలుడు పదార్థాన్ని వినియోగించినట్లు పోలీసులు తెలిపారని వెల్లడించింది. అయితే షాప్ ఓనర్ మాట్లాడుతూ... రూ.2 మిలియన్లు చెల్లించాలని కొన్ని రోజుల క్రితం తనకు ఆగంతకుల నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గత నెల క్రితం తన ఇంటిపై ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ కేసు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.