లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్ సిటీలో మంగళవారం భయానక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బర్కత్ మార్కెట్‌లో భారీ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో ఒక్కసారిగా బర్కత్ మార్కెట్ దద్దరిల్లింది. ఈ పేలుళ్ల ధాటికి మార్కెట్‌లో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ సిలిండర్ల పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భారీగానే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: ఆ అడవి మహిళలకు మాత్రమే.. మగవాళ్లు వస్తే ఇక అంతే!
డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే
#BREAKING : 🚨 Huge Cylinder Blast In Barkat Market, Garden Town Lahore, Pakistan.!! pic.twitter.com/HZNQlsv5Hp
— NewsBox India🚨 (@Newsbox_India) June 29, 2021
شروع کی ویڈیو pic.twitter.com/zgZzWwVHjA
— Ali hassan Rao (@Alihass68134141) June 29, 2021
Comments
Please login to add a commentAdd a comment