cylinder blast
-
బాణాసంచా గోడౌన్లో పేలిన సిలిండర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు
-
మాదాపూర్ పోలీసు స్టేషన్లో సిలిండర్ పేలుడు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ పోలీసు స్టేషన్ పేలుడు చోటు సంభవించింది. సీజ్ చేసిన సిలిండర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరికొని మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలతో పోలీసు సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీసింది. సమీపంలో పేల్చిన టపాకాయల మంటలు సిలిండర్లపై పడ్డట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పూలే విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం ఏంటీ? -
శ్రీనాద్ రోటాప్యాక్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్
-
China: గ్యాస్ బండ పేలి 31 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పండుగ సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చిన వాళ్లే గమనార్హం. నార్త్‌వెస్ట్రన్ నగరం ఇంచువాన్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న రెస్టారెంట్.. జనాలతో కిక్కిరిసిపోయిన టైంలో రెస్టారెంట్‌లోని గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే యత్నం చేశాయి. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా చల్లారాయి. స్వయంప్రతిపత్తి ఉన్న నింగ్క్సియా రాజధాని ప్రాంతమే ఇంచువాన్. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కోసం మూడురోజులపాటు సెలవులు ప్రకటించారక్కడ. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చినవాళ్లే ఎక్కువగా మృతుల్లో ఉన్నారు. ఇంచువాన్‌లో ప్రమాదం జరిగిన ఓవైపు ఈ వీధిలో గ్లాస్ ముక్కలు, చెల్లాచెదురుగా పడి ఉన్న శకలాలు.. మరోపక్క అయినవాళ్ల కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్న బంధువుల రోదనలతో హృదయ విదారకమైన దృశ్యాలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఘటనపై అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని, ప్రజా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. 🇨🇳 | URGENTE: Al menos 31 muertos en una explosión en un restaurante en la ciudad de Yinchuan, en el noroeste de China.#yinchuan #China #URGENTE #ULTIMAHORA pic.twitter.com/ZMnLqI2VfF — eljournalnews.ec (@eljournalnewsec) June 22, 2023 Al menos 31 personas murieron después de una explosión de gas en un restaurante de barbacoa en #Yinchuan, capital de la Región Autónoma Ningxia Hui del noroeste de #China, la noche de este #miércoles, según informes de los medios locales citando a las autoridades pic.twitter.com/scC1QeJGWg — @UlisesMtv (@UlisesMtv) June 22, 2023 ఇదీ చదవండి: ఏం ఎండలురా భయ్.. మాడిపోతోందీ మనోళ్లే! -
చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా బాణాసంచా కాల్చే క్రమంలో సిలిండర్ పేలిన ఘటనలో మృతులసంఖ్య నాలుగుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మృతి చెందగా, రెండుకాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన చిందివారి సందీప్(36) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతడికి భార్య మమత అలియాస్ మొమీన్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేయి తాలూకా మింగరి గ్రామానికి చెందిన చిందివారి సందీప్ బతుకుదెరువు కోసం పదిహేనేళ్ల క్రితం తెలంగాణకు వచ్చాడు. తల్లిదండ్రులు, సోదరి పోషణ బాధ్యతలు సందీప్ చూసు కుంటున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సందీప్ సుతారీ పనులు చేసే క్రమంలో ఒడిశా ప్రాంతానికి చెంది మొమీన్ పరిచయం కావటంతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కృష్ణ ఉన్నాడు. ఏడాది క్రితం పొట్ట చేతపట్టుకొని కారేపల్లి మండలం చీమలపాడుకు సందీప్, మొమీన్ వచ్చారు. భార్య గ్రామంలో వ్యవసాయకూలీ పనులకు వెళ్తుండగా, సందీ ప్ సుతారీ పనులు చేసేవాడు. ఈ నెల 12న మొమీన్ మిర్చి తోటలో పనికి వెళ్లగా, గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి సందీప్ హాజరయ్యాడు. ఆరోజు గుడిసె కాలి పోతుండటంతో అందరితోపాటు మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్ శకలాలు దూసుకురావడంతో సందీప్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తొలుత ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రికి, తర్వాత నిమ్స్‌కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. ఊరుగాని ఊరిలో భర్తను కోల్పోయిన మొమీన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
విషాదంలోనే మూడు గ్రామాలు
కారేపల్లి: చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపినవారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో గుడిసెకు నిప్పంటుకుని, అందులోని సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు బుధవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించారు. గురువారం ఉదయం చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోతు రమేశ్, గేటురేలకాయలపల్లిలో ధరంసోత్ లక్ష్మాల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మె ల్యే రాములునాయక్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదంపై పోలీసుల ఆరా.. చీమలపాడు ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం దర్యాప్తు చేపట్టారు. గుడిసెకు నిప్పంటుకోవడం, సిలిండర్ పేలడంపై ఆరా తీశారు. ఆధారాలు చెరిగిపోకుండా.. గుడిసెతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేసి పరిశీలించారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం కారేపల్లి బంద్ చేపట్టాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చీమలపాడుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు కామేపల్లిలోనే అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇల్లెందు–ఖమ్మం రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత రేణుకా చౌదరి పోలీసుల కళ్లుగప్పి.. ఇల్లెందు మీదుగా గేటురేలకాయలపల్లికి చేరుకుని ధరంసోత్ లక్ష్మా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే రాములునాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. కామేపల్లి ఘటనకు సంబంధించి రేణుకా చౌదరి, మరికొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తలకొరివి పెట్టిన తనయ చీమలపాడులో మృతిచెందిన బానోతు లక్ష్మాకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టింది. -
నామాపై చీమలపాడు గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ ఆర్భాటంలో.. గ్యాస్ సిలిండర్లు పేలి ముగ్గురు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంపై చీమలపాడు గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. తమ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ప్రమాదానికి కారకుడయ్యాడంటూ ఎంపీ నామా నాగేశ్వరరావుపై మండిపడుతున్నారు వాళ్లు. బాణాసంచా కాలుస్తూ ర్యాలీగా రావడమే కాకుండా.. ప్రమాదంతో తమకు సంబంధం లేదని ప్రకటించడంపై రగిలిపోతున్నారు. బాణాసంచా కాల్చింది బీఆర్ఎస్ శ్రేణులు, నామా వర్గీయులు కాదా అని చీమలపాడు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ‘‘భారీ పేలుడుతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అంత ఉలిక్కిపడి భయాందోళలనకు గురయ్యాం. పేలుడు దాటికి ఆరుగురికి పైగా కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. నామా చెప్తున్నట్లు కాకుండా.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభకు 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న చీమలపాడు గ్రామస్తులు నిరసనలకు దిగారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చీమలపాడు బాధితులకు పరిహారం ప్రకటించింది. ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్థిక సాయంతో పాటు వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు తెలిపారు. అయితే చీమలపాడు గ్రామస్తులు మాత్రం.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో తమ గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు.. చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉందని మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకి 200 మీటర్ల దూరంలో ఒక సిలిండర్ పేలింది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి వెళ్లడంతో గాయపడ్డారు. ఆ సమయంలో మేం స్టేజీ మీద ఉన్నాం. ఆరుగురు గాయపడ్డారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు వేరే ఆస్పత్రిలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురికి కాళ్లు తెగాయి. ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఆస్పత్రిలో చేర్పించినవారికి చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. ఒకరికి మాత్రం సీరియస్‌గా ఉందన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలిన చెప్పాను. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరం. గుడిసెలో ఉండే గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటాం. సిలిండర్ పేలడానికి, మా మీటింగ్‌కు సంబంధం లేదు. 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. అలా అని తాము పట్టించుకోమని కాదు అని నామా మీడియాతో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో సిలిండర్ పేలి ఘోర ప్రమాదం సంభవించింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటల చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు గుడిసె వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో.. గుడిసెలో ఉన్న సిలిండర్‌ను వాళ్లు గమనించలేదు. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పోలీసు వాహనాల్లోనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని నిలిపివేశారు. మరో వైపు ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్య నేతలకు సూచించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చీమలపాడు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందటం లేదని క్షతగాత్రుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో పట్టించుకునే వారు దిక్కులేరని. వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ముగ్గురు చనిపోయారని, ఆలస్యం చేస్తే మరో ముగ్గురు కూడా చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరోవైపు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్,బిజెపి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పోలీసులు. -
పెళ్లిలో పేలిన సిలిండర్.. 32కు చేరిన మృతులు.. సీఎంపై బీజేపీ ఫైర్
జైపూర్: రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. శుక్రవారం మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జోధ్‌పుర్‌లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్‌పుర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది. రూ.2 లక్షలు పరిహారం.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు పేర్కొంది. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
Hyderabad: రాంగోపాల్‌పేటలోని అపార్ట్మెంట్లో పేలుడు
-
సికింద్రాబాద్‌లోని అపార్ట్మెంట్లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అపార్ట్మెంట్లోని మొదటి అంతస్థులో సంభవించిన పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికి గాయాలవ్వగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరిని నేపాల్ వాసులు సందీప్, అనుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన ఈ జంట ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ పేలుడు ఘటనను పోలీసులు నిర్ధారించారు. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల పేలుడు జరిగినట్లు తెలిపారు. సిలిండర్ లీక్ కావడంతో రూమ్ అంతా గ్యాస్ నిండినట్లు, వంట చేయడం కోసం గ్యాస్ వెలిగించడంతో సిలిండర్ పేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం తనిఖీలు చేపట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్‌పై నిర్మల ఫైర్ -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చదవండి: మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే -
బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి
నాగ్‌పూర్: బెలూన్లలో గాలిని నింపేందుకు ఉపయోగించే సిలిండర్ పేలి రెండేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఆ చిన్నారి వ్యవసాయంలో ఉపయోగించే ఎద్దుల ప్రాముఖ్యతను తెలియజేసే తాన్హాపోలా పండుగ వేడుకలకు తన తాతాతో కలిసి వెళ్లింది. అక్కడ ఆ చిన్నారికి తాతా ఒక బెలూన్ని కొనివ్వబోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచల్పూర్ తాలుకాలోని షిండే గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. అక్కడ బెలూన్‌లో గాలిని నింపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఆ చిన్నారి కాలిపై పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు అచల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు) -
సిలిండర్ పేలుడు.. నలుగురి దుర్మరణం
ఘోర ప్రమాదంతో జమ్ము ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం సాయంత్రం ఓ దుకాణంలో సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. జమ్ములోని నివాస సముదాయాల నడుమ ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌కారణంగా మంటలు చెలరేగాయి. అదే దుకాణంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని జమ్ము అదనపు డీజీపీ ముకేష్ సింగ్ వెల్లడించారు. అనుమతులకు విరుద్ధంగా షాపులో సిలిండర్ ఉంచిన విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారాయన. బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. తీవ్రంగా గాయపడిన వాళ్లకు లక్ష, స్వల్ఫ గాయాలైనవాళ్లకు 25 వేల రూపాయలు ప్రకటించినట్లు గవర్నర్ అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది. An ex-gratia of Rs.5 Lakh each to be given to the families of the deceased in Jammu LPG Cylinder blast incident. Ex gratia of Rs.1 Lakh to be given to the seriously injured and Rs.25,000 to those with minor injuries. — Office of LG J&K (@OfficeOfLGJandK) March 14, 2022 Deeply saddened by the loss of lives due to LPG cylinder blast at a scrap shop in Jammu. My condolences to the bereaved families & prayers for speedy recovery of the injured. Directed the district administration to provide all the necessary assistance. — Office of LG J&K (@OfficeOfLGJandK) March 14, 2022 -
సిలిండర్ పేలి ఐదుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్ పట్టి పాండురంగన్ విట్టల్ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్ఎస్ఐగా పనిచేస్తున్న పద్మనాభన్ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్ తల్లి స్టౌవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ తలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
అమరావతి రైతుల పాదయాత్రలో అపశ్రుతి
జరుగుమల్లి: అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఉప్పలపాడు నుంచి మండల పరిధిలోని చిర్రికూరపాడుకు పాదయాత్రగా బయలుదేరి వస్తుండగా చిర్రికూరపాడు గ్రామ పొలిమేరకు చేరుకునేసరికి బెలూన్స్‌కు గాలి నింపుతున్న సిలిండర్ పైప్ లీక్ అయ్యి సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో రోజువారీ కూలి కోసం విజయవాడ కృష్ణలంక నుంచి వచ్చిన మేడా నవీన్ (21), షాకలబత్తుల భాస్కర్‌రావు (16), విన్నకోట రాఘవేంద్రరావు (60)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఎస్ఐ రజియా సుల్తానాబేగం వివరాలు సేకరించారు. రాఘవేంద్రరావుకు వెన్నుపూస విరిగిపోయి పరిస్థితి విషమంగా మారి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. పోలీసులు వెంటనే బెలూన్స్, సిలిండర్ ఉన్న ఆటోను పాదయాత్ర నుంచి తొలగించారు. ఈ పేలుడుతో పాదయాత్రకు వచ్చిన చుట్టు పక్కల గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
పాకిస్తాన్లో వరుస సిలిండర్ల పేలుడు; వీడియో వైరల్
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్ సిటీలో మంగళవారం భయానక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బర్కత్ మార్కెట్లో భారీ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో ఒక్కసారిగా బర్కత్ మార్కెట్ దద్దరిల్లింది. ఈ పేలుళ్ల ధాటికి మార్కెట్లో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ సిలిండర్ల పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భారీగానే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ఆ అడవి మహిళలకు మాత్రమే.. మగవాళ్లు వస్తే ఇక అంతే! డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే #BREAKING : 🚨 Huge Cylinder Blast In Barkat Market, Garden Town Lahore, Pakistan.!! pic.twitter.com/HZNQlsv5Hp — NewsBox India🚨 (@Newsbox_India) June 29, 2021 شروع کی ویڈیو pic.twitter.com/zgZzWwVHjA — Ali hassan Rao (@Alihass68134141) June 29, 2021 -
విషాదం : ముంబైలో సిలిండర్ పేలుడు
ముంబై : ముంబైలోని లాల్బాగ్ ఏరియాలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మంటలు సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన స్థలంలో చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి రెండు అగ్నిమాపక దళాలతో పాటు రెండు జంబో ట్యాంకర్లను పంపించినట్లు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. -
భయానకం : జమ్మూ హైవేపై సిలిండర్ల పేలుడు
-
భయానకం : హైవేపై సిలిండర్ల పేలుడు
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లో సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. దాదాపు 45 నిమిషాల పాటు ట్రక్కులో ఉన్న డజనుకు పైగా సిలిండర్లకు మంటలంటుకొని బారీ శబ్దంతో పేలుడు జరగడంతో అక్కడి స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అయింది. దీంతో పాటు రహదారికి ఇరువైపుల బారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉధంపూర్ ఎస్పీ రాజీవ్ పాండే మాట్లాడుతూ...' 300 సిలిండర్ల లోడుతో జమ్మూలోని బారీ బ్రాహ్మణ నుంచి నార్త్ కశ్మీర్‌లోని సోపోర్‌కు బయలుదేరింది. కాగా ట్రక్కు జమ్మూ కశ్మీర్ హైవేపై ఉన్న తిక్రి ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా సిలిండర్లకు మంటలంటుకున్నాయి. కాగా 45 నిమిషాల పాటు 100 ఫీట్లకు పైగా సిలిండర్లు పైకి ఎగురుతూ కింద పడ్డాయి. ఈ సమయంలో దారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ట్రక్కు డ్రైవర్ ఉజ్జలసింగ్ సిలిండర్ల పేలుడు జరుగుతున్న సమయంలోనే ట్రక్కును వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.' అత్యధిక ఉష్ణోగ్రతతోనే ట్రక్కులో సిలిండర్ల పేలుడు జరిగిందేమోనన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రాజీవ్ పాండే తెలిపారు. -
గ్యాస్‌లీకై పేలుడు
కర్నూలు, వెల్దుర్తి: పట్టణ సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇంటి గది పూర్తిగా ధ్వంసమైంది. వెల్దుర్తి పట్టణానికి చెందిన గొల్ల మురళి, భార్య లక్ష్మి (దివ్యాంగురాలు) రెండు సంవత్సరాలుగా.. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు ఎల్లకృష్ణ, పరశురాముడు ఉన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోని కార్మికులకు నిర్మించిన గదిలోనే కుటుంబమంతా నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి కరెంట్ ఆఫ్ చేసుకుని, తలుపులు, కిటికీలు మూసుకుని నిద్రించారు. మురళి.. బుధవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో నిద్ర లేచి లైట్ వేయడంతో అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. మంటలు వ్యాపించడంతో మురళితోపాటు నిద్రిస్తున్న అతని భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. పేలుడు ధాటికి గది తలుపులు, కిటికీలతో సహా మూడు వైపులా ఉన్న ఇటుక గోడలు చెల్లాచెదురయ్యాయి. పైకప్పు కూలిపోయింది. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మురళి, అతని భార్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెల్దుర్తి తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు ప్రమాదానికి కారణమేమి? కుటంబ సభ్యులు నిద్రిస్తున్న గదిలోనే వంట గది కలిసి ఉండడం, వంటకు ఉపయోగించే గ్యాస్ లీకై రాత్రంతా గదిలో వ్యాపించి, మురళి లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిద్రించే సమయంలో వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడంతోపాటు, స్టవ్ నాబ్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడమా?, లేదా సిలిండర్, పైప్ లీకేజీనా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇంత పెద్ద అగ్ని ప్రమాదంలో కేవలం కుటుంబ సభ్యులకే మంటలు వ్యాపించడం, తక్కిన ఏ వస్తువులకూ ఏమీ కాకపోవడం, గదిలోనే ఉన్న గొర్రెపిల్ల క్షేమంగా ఉండడం బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావ్ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పేద కుటుంబంలో తీవ్ర విషాదం గ్యాస్ ప్రమాదంలో గాయపడ్డ మురళి, భార్య లక్ష్మి 15 ఏళ్లుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమైనా ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మించిన గదిలోనే తలదాచుకుంటూ తమ ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నారు. ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఘోర ప్రమాదం..10 మంది మృతి
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మవు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఇంట్లో పేలిన సిలిండర్.. ఆరుగురికి తీవ్రగాయాలు
సాక్షి, చిత్తూరు : మిట్టూరులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో శాంతి(55), సుకన్య(40), ఉమాదేవి(30), పూర్ణిమ(32), మధు(7), అను దీపిక(8) పూర్తిగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
-
చిరంజీవి సర్జా సినిమా షూటింగ్లో తల్లి, బిడ్డ మృతి
సాక్షి బెంగళూరు: నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’ సినిమా షూటింగ్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డా మరణించారు. మృతులను చిన్నారి అయిషా ఖాన్ (5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు. నగరంలోని బాగలూరు వద్ద రణం సినిమా షూటింగ్ జరుగుతోంది. సుయేరా బాను తన ఐదేళ్ల చిన్నారితో కలసి షూటింగ్ చూసేందుకు వెళ్లింది. ఆ సమయంలో కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను దర్శకుడు తీస్తున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా సిలిండర్ పేలింది. తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడే ఉన్న తల్లీకూతుళ్లు మరణించగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఘటనా ప్రాంతానికి బాగలూరు పోలీసులు చేరుకుని మృతదేహాలను యలహంక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారిని మరో ఆస్పత్రికి తరలించారు. రణం చిత్రంలో చిరంజీవి సర్జా, చేతన్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కనకపుర శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వి.సముద్రం దర్శకత్వం వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న నటుడు చేతన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకోగా పోలీసులు విచారణ చేపట్టారు. చేతన్ మాట్లాడుతూ సిలిండర్ పేలుడు ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సహాయం ఉంటుందని చెప్పారు. గడిచిన రెండు రోజులుగా షూటింగ్లో పాల్గొన్నానని, శుక్రవారం జరిగిన షూటింగ్లో తనకు సీన్లు లేవని చెప్పారు. కారు బ్లాస్ట్ సీన్ ఉందనే విషయం మాత్రం తనకు తెలుసునని, మరో చిన్నారి గాయపడిఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసిందని, తనని పరామర్శిస్తానని తెలిపారు. పేలుడు తర్వాత షూటింగ్ నిలిపేసి మిగిలిన చిత్ర బృందం అక్కడి నుంచి పారిపోయారు. చిరంజీవి సర్జా వేరొక చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు మైసూరుకు తరలివెళ్లారు. -
లాడ్జిలో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, విజయవాడ: విజయవాడ బందర్ రోడ్డులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. సిద్దార్థ మహిళా కళాశాల సమీపంలోని ఓ లాడ్జిలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ లాడ్జిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.