
అగ్నికి ఆహుతైన అగ్నిమాపక సిబ్బంది
మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అవే మంటలకు ఆహుతి అయ్యారు. ఈ ఘోర ప్రమాదం పశ్చిమ ఢిల్లీలోని ఫుడ్ స్నాక్స్ షాపులో సంభవించింది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో షాపులో మంటలు చెలరేగాయి. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది షాపు షెట్టర్ ఎత్తడంతో అందులోఉన్న గ్యాస్ సిలీండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడికక్కడే హరి సింగ్ మీనన్ (55) హారిఓమ్ (56)లు మృతి చెందగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
