హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, 108కి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు చిన్నారులను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇంట్లోని తల్లిదండ్రులు ఉదయమే కూలీ పనికి వేళ్లగా.... చిన్నారు స్టౌవ్ వెలిగించేందుకు యత్నాంచారని సమాచారం. ఆ దాంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇప్పడే ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. సిలిండర్ పేలుడుకు ఇళ్లు కూలిపోయింది. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల వరుసగా 11, 9, 6 ఏళ్ల వయస్సు కలవారిని పోలీసులు తెలిపారు.