అమరావతి రైతుల పాదయాత్రలో అపశ్రుతి | One Person dead and two Injured In cylinder exploded At Amaravati Farmers Padayatra | Sakshi
Sakshi News home page

అమరావతి రైతుల పాదయాత్రలో అపశ్రుతి

Published Tue, Nov 16 2021 5:16 AM | Last Updated on Tue, Nov 16 2021 5:16 AM

One Person dead and two Injured In cylinder exploded At Amaravati Farmers Padayatra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జరుగుమల్లి: అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఉప్పలపాడు నుంచి మండల పరిధిలోని చిర్రికూరపాడుకు పాదయాత్రగా బయలుదేరి వస్తుండగా చిర్రికూరపాడు గ్రామ పొలిమేరకు చేరుకునేసరికి బెలూన్స్‌కు గాలి నింపుతున్న సిలిండర్‌ పైప్‌ లీక్‌ అయ్యి సిలిండర్‌ పేలిపోయింది.

ఈ ఘటనలో రోజువారీ కూలి కోసం విజయవాడ కృష్ణలంక నుంచి వచ్చిన మేడా నవీన్‌ (21), షాకలబత్తుల భాస్కర్‌రావు (16), విన్నకోట రాఘవేంద్రరావు (60)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఎస్‌ఐ రజియా సుల్తానాబేగం వివరాలు సేకరించారు. రాఘవేంద్రరావుకు వెన్నుపూస విరిగిపోయి పరిస్థితి విషమంగా మారి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. పోలీసులు వెంటనే బెలూన్స్, సిలిండర్‌ ఉన్న ఆటోను పాదయాత్ర నుంచి తొలగించారు. ఈ పేలుడుతో పాదయాత్రకు వచ్చిన చుట్టు పక్కల గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement