అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు | Ameerpet Bakery Cylinder Blast In Hyderabad | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Published Mon, Mar 24 2025 7:54 AM | Last Updated on Mon, Mar 24 2025 9:08 AM

Ameerpet Bakery Cylinder Blast In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో సిలిండర్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కేఫ్‌లో పనిచేసే ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement