
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణలో కూడా నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నగరంలోని అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరాతబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్ నగర్, బేగంపేట్, కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట సహా పాలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాలో కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే.
Hyderabad looks so beautiful with light rain and the glowing city skyline. A perfect peaceful Morning! 🌧️🌃 #HyderabadRains #CitySkyline #BeautifulHyderabad #RainyVibes@HyderabadMojo@HiHyderabad @hyderabadprop @ikaranreddy pic.twitter.com/fQaWuSDSHl
— HyderabadInfra (@HyderabdInfra) December 8, 2024