
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం నాన్‌దార్‌ఖన్‌పేట్‌లో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం టీ పెడుతుండగా ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.