స్కూటర్ అదుపు తప్పి..ఒకరి మృతి
తెనాలి : గుంటూరు జిల్లా సంఘం జాగర్లమూడి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. అమృతలూరు మండలం కూచిపూడికి చెందిన సుబ్బారావు (45), రమేష్ (40)లు స్కూటర్పై ప్రయాణిస్తున్నారు. అతివేగంతో వాహనం నడపడం వల్ల అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే మరణించాడు.
రమేష్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.