శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ పేలుడు
Published Wed, Nov 16 2016 11:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం గొడుగులవీధిలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడడంతో పాటు పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయం ఓ మహిళ ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించగా సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. దాంతో ఆమె గాయపడింది. పేలుడు విన్న ఇరుగుపొరుగువారు పరుగున వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఇరుగుపొరుగున ఉన్న పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయమే ఇళ్లలోని వారు కూలిపనులకు వెళ్లిపోవడంతో పెను ముప్పు తప్పింది. గాయపడిన మహిళను టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది పూరిగుడిసెలు నేలమట్టం కావడంతో పేదలు సర్వస్వం కోల్పోయారు.
Advertisement
Advertisement