women injured
-
వైరల్ వీడియో: కదులుతున్న రైలు డోర్లో యువతి డ్రెస్ చిక్కుకుని..
-
షాకింగ్ వీడియో: కదులుతున్న రైలు డోర్లో యువతి డ్రెస్ చిక్కుకుని..
మెట్రో స్టేషన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి డ్రెస్క్ మెట్రో రైలు డోర్లో చిక్కుకుపోయింది.. అది గమనించని లోకోపైలట్ రైలును ముందుకు కదిలించాడు. దీంతో, బాధితురాలు రైలుతో పాటుగా ప్లాట్‌ఫ్లామ్‌పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. లోకోపైలట్ నిరక్ష్యంగా కారణంగా గౌరీ కుమారీ సాహు అనే యువతి ప్రాణాపాయం స్థితిలోకి చేరింది. కాగా, చాకలా మెట్రో స్టేషన్లో ప్లాట్‌ఫ్లామ్‌పై రైలు ఆగింది. ఈ క్రమంలో రైలు నుంచి దిగుతుండగా.. గౌరీ కుమారీ డ్రెస్ రైలు ఆటోమేటిక్ డోర్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో గౌరీ కుమారీ.. పక్క కోచ్‌లో ఉన్న లోకోపైలట్‌కు ఈ విషయం చెప్పే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్లాట్‌ఫ్లామ్‌పై ఉన్న మరో ప్రయాణికుడు సైతం లోక్‌పైలట్‌ను అలర్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేమీ పట్టించుకోకుండా లోక్‌పైలట్.. రైలును ముందుకు కదిలించడంతో ఆమె.. రైలుతో పాటే కొంత దూరం పరిగెత్తి తర్వాత కిందపడిపోయింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ చివరి వరకు కింద ఈడ్చుకెళ్లింది. ఈ సందర్బంగా గౌరీ కుమారీని మరో వ్యక్తి కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇలా జరుగుతున్న తరుణంలో స్టేషన్లో మెట్రో సిబ్బంది.. ఈ విషయాన్ని లోకోపైలట్ దృష్టికి తీసుకువెళ్లడంతో సడెన్ బ్రేకులు వేసి రైలును ఆపివేశాడు. ఈ ప్రమాదంలో గౌరీ కుమారీకి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న అంథేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తలించి వైద్య సాయం అందించారు. కాగా, ఆమె వైద్యానికి అయిన ఖర్చును మెట్రో రైలు యాజమాన్యం భరించింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. చాకలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోక్‌పైలట్ నిర్లక్ష్యం కారణంగానే తాను గాయపడినట్టు.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
కోనసీమ జిల్లాలో మహిళలపై తేనెటీగల దాడి
సాక్షి, కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తేనెటీగల దాడిలో 25 మంది గాయపడ్డారు. అందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. వన భోజనాలు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని రావులపాలెం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చదవండి: రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి.. -
దారి గొడవలో గాయపడ్డ మహిళలు.. పరిస్థితి విషమం
సాక్షి, వరంగల్: అర్బన్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన దారి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో ప్రశ్నించిన ఒక కుటుంబానికి చెందిన మహిళలపై కర్రలతో చితకబాదిన దారుణ ఘటన ఖిల్లా వరంగల్ వసంతపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తీవ్రగాయలైన వారిని హాస్పిటల్‌కు తరలిచించారు. ప్రస్తుం వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... దారి విషయంలో గుండెకారి బాబు, గుండెకారి జగదీష్ అనే అన్నదమ్ముల కుటుంబాలు గత కొద్దికాలం నుంచి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరగడంతో జగదీష్ కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా పశువులను కొట్టినట్లు కర్రలతో చితక బాదారు. ఈ దాడిలో బాబు భార్యతో పాటు, అడ్డుకున్న మరో మహిళ తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు. తలకు గట్టి గాయాలు కావడంతో వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు పెర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గీసు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
సాక్షి, ఖమ్మంక్రైం: చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను ఓ దొంగ అపహరించుకుని పోయిన సంఘటన సోమవారం తెనాలిలో జరిగింది. ఖమ్మం జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న ఇల్లెందు మండలానికి చెందిన ఇద్దరు మహిళల నుంచి బంగారం దోచుకున్నారు. తెనాలి స్టేషన్లో రైల్లోని బాత్రూంలో వేచి ఉన్న దొంగ రైలు కదిలే సమయానికి బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. బోగి మహిళలది కావడంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తేరుకొనేలోపే ఆగంతకుడు సీట్లో కూర్చొని ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమ్ముగూడేనికి చెందిన గుగులోత్ సుజాత, ఖమ్మం నగరానికి చెందిన బి.పద్మ అనే మహిళలను కత్తితో బెదిరించాడు. వారి మెడలో ఉన్న గొలుసులు, రింగులు, నగదును లాక్కొన్నాడు. సుజాత ప్రతిఘటించటంతోపాటు, రైలు చైన్ లాగటానికి ప్రయత్నిస్తుండగా ఆగంతుకుడు కత్తితో మెడపై తీవ్ర గాయం చేసి కిందపడేసాడు. ఆమె తలకు గాయం అయింది. ఈ సంఘటనతో బోగీలోని మహిళలంతా గట్టిగా కేకలు వేశారు. అప్పటికే ఆగంతకుడు రైలు నుంచి దూకి పారిపోయాడు. పక్కనే ఉన్న గార్డ్‌కు సమాచారం అందించినా గార్డు పట్టించుకోలేదు. విజయవాడ రైల్వే పోలీసుల ఓవర్‌యాక్షన్.. ఆగంతకుడి చేతిలో తీవ్రంగా గాయపడి, సొత్తు పోగొట్టుకొన్న ఇద్దరు మహిళలు విజయవాడలో రైలు ఆగగానే రైల్వే పోలీసులను సంప్రదించగా వారు కనీసం స్పందించకపోగా మీరు ఖమ్మం వెళ్లి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని చెప్పారు. కనీసం మానవత్వం కూడా లేకుండా రక్తం కారుతున్న మహిళలకు ప్రాథమిక చికిత్స చేయకుండా అక్కడి పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మహిళలు మీడియా వద్ద వాపోయారు. ఇద్దరి మహిళలలో పద్మ అనే మహిళ పుస్తెలతాడు, గుగులోతు సుజాత రెండు తులాల చైన్, రెండు బంగారు రింగులు, వెయ్యి రూపాయల నగదును ఆగంతుకుడు అపహరించుకుపోయాడు. వీరిలో సుజాత చైన్నె నుంచి వస్తుండగా, పద్మ సూళ్లూరుపేట నుంచి వస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే మహిళా బోగీలలో జొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటే రాత్రిపూట ప్రయాణం చేసే మహిళలకు భద్రత ఎక్కడిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి బలి..
నవాబుపేట(జడ్చర్ల) : రొట్టే ముక్క చేత పట్టుకుని.. తినేందుకు చేతిని లేపగానే.. ఇంతలో పక్కింటి మహిళ కేకలు వినిపించాయి. వెంటనే రొట్టె ముక్కను అక్కడే పడేసి పరుగున వెళ్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను కాపాడాడు. కానీ ఈ ప్రమాదంలో బలైపోయాడు ఓ వ్యక్తి.. ఈ విషాదకర సంఘటన మండలంలోని కొల్లూరులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ సోమవారం ఉదయం దుస్తులు ఉతికి ఇంటి ముందున్న తీగ ఆరేస్తోంది. ఇంతలో విద్యుత్ వైరు తీగకు తగలడంతో షాక్‌కు గురై కేకలు వేసింది. వెంటనే పక్కింట్లో రొట్టె తింటున్న ముష్టి కృష్ణయ్య(45) మహిళ కేకలు వినిపించగానే రొట్టెను పక్కన పెట్టేసి వెంటనే మహిళను కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో తాను విద్యుదాఘాతానికి షాక్‌కు అక్కడికక్కడే కన్నుమూశాడు. అపస్మారక స్థితిలో నుంచి.. విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో ఉన్న అంజమ్మను గమనించిన వాసుయాదవ్ అనే వ్యక్తి ఆమెకు ఊపిరి ఆగిపోకుండా చేతులతో మోది స్పృహ వచ్చేలాచేశాడు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడింది. కాపాడేందుకు వెళ్లిన కృష్ణయ్య విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగానే విద్యుత్ తీగలు, ఎర్త్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ భల్లూకాల అలజడి
మందస : ఉద్దానం ప్రజలను ఎలుగుబంట్లు భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. మండలంలోని ఎర్రముక్కాం, పాతపితాళిలలో భల్లూకం చేసిన బీభత్సం ఇంకా ప్రజల కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎర్రముక్కానికి చెందిన దంపతులు ఎలుగు దాడిలో దుర్మరణం చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి నేటికీ ఆందోళనకరంగానే ఉంది. దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగానే గురువారం ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. అరగంట వ్యవధిలోనే.. మందస మండలంలోని నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మ ఉదయం 5.30 గంటలకు తోటల్లోకి వెళ్తుంగా ఒక్కసారిగా భల్లూకం దాడి చేసింది. కుడిచేయిపై కొంత భాగాన్ని కొరికేసింది. గ్రామస్తులు గమనించి, కేకలు వేసి తరమడంతో ఎలుగు పారిపోయింది. వీరు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ తారకేశ్వరరావు, పైలట్ వెంకటరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స చేశారు. అనంతరం గంగమ్మను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం 6 గంటల సమయంలో సువర్ణాపురం గ్రామానికి చెందిన సాలీన భీమారావు తోటకు వెళ్తుండగా దారిలో ఎలుగుబంటి దాడి చేయడానికి ప్రయత్నించింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమీపంలోని చెట్టు ఎక్కారు. ఆ ప్రాంతంలో కొంతసేపు తిరిగిన ఎలుగుబంటి వెళ్లిపోవడంతో ఆయన బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. కేసుపురం సమీపంలోని జీడి, మామిడి తోటల్లో ఎలుగులు కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. తోటల్లోకి వెళ్లడానికి సాహసించలేకపోయారు. వరుస ఎలుగుబంట్లు దాడులతో ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు. ప్రాణభయంతో రాత్రి వేళల్లో ఇంటి నుంచి రావడానికి భయపడుతున్నారు. ప్రాణనష్టంతో పాటు పెంచుకుంటున్న పశువులు, జంతువులను కూడా చంపివేస్తుండడంతో ఉద్దానవాసులు ఉలిక్కి పడుతున్నారు. దేవుడే రక్షించాడు: సాలీన భీమారావు ఎప్పుడూ లేనిది ఉదయాన్నే తోటకు వెళ్లాను. దారిలో ఓ ఎలుగుబంటి కనిపించింది. దాడి చేయడానికి ప్రయత్నించగా, దగ్గర్లో ఉన్న చెట్టు అప్రయత్నంగా ఎక్కేశాను. ఈ సమయంలోనే మరో ఎలుగుబంటి కూడా వచ్చింది. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చెట్టుపైనే ఉన్నాను. కొద్దిసేపు ఎలుగులు కదల్లేదు. ఈలోగా గ్రామస్తులు వచ్చి తరమడంతో వెళ్లిపోయాయి. ఎలుగుల నుంచి దేవుడే కాపాడాడు. -
వివాహితపై హత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్ : పట్టణంలోని మిల్ట్రీ ఆస్పత్రి గల్లీలో నివసిస్తున్న వివాహిత చామకూరి స్వరూపపై ఆడపడుచు భర్త గట్టు రమేష్ అలియాస్ బబ్లూ మంగళవారం హత్యాయత్నానికి పాల్ప డినట్లు కేసు నమోదైంది. టౌన్ ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్ కథనం ప్రకారం... చామకూరి స్వరూప, ఆమె ఆడపడుచు కుటుంబం మధ్య కొంతకాలంగా భూమి, ఆస్థి తగాదాలు ఉన్నాయి. కక్షతో రమేష్ కత్తితో మంగళవారం స్వరూప ఇంటికి వెళ్లి ఆమెతో గొడవపడి కత్తితో గాయపరిచాడు. ఆమె రెండో కుమారుడు రోహిత్ కేకలు వేయగా చుట్టుపక్కల వారు చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్..
యాలాల : ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన ఘటనలో ఓ ప్రయాణికురాలు గాయపడింది. ఈ సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలోని బండమీదిపల్లి గేటు సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం మహబూబ్‌నగర్ నుంచి తాండూరుకు దాదాపు 30 మంది ప్రయాణిలకుతో ఆర్టీసీ బస్సు (టీఎస్ 34 టీ 0947) బయలుదేరింది. ఈ క్రమంలో కొడంగల్ మండలం అంగడి రాయిచూర్‌కు చెందిన అనంతమ్మ తాండూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మార్గమధ్యలో బాబా దర్గా వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలో బస్సును అదుపు చేసే క్రమంలో రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అనంతమ్మ సీటు కిందకు పడిపోవడంతో కాలు విరిగింది. -
మహిళపై అడవి పంది దాడి
గోవిందరావుపేట వరంగల్ : తునికాకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పస్రా అభ్యుదయ కాలనీకి చెందిన జిట్టబోయిన లక్ష్మి సమీప అటవీ ప్రాంతంలోకి తునికాకు సేకరణకు వెళ్లింది. ఈ క్రమంలో అడవి పంది ఆమెపై దాడి చేయడంతో కాలికి బలమైన గాయమైంది. ఆమె అరుపులతో సమీపంలో ఉన్న కూలీలు అక్కడికి రాగా పంది పారిపోయింది. గాయాలపాలైన లక్ష్మిని పస్రా అటవీ శాఖ అధికారులు ఆస్పత్రికి తరలించారు -
చెన్స్నాచింగ్కు దుండగుల యత్నం
టెక్కలి రూరల్ : మహిళ మెడలో చైన్‌ను దొంగిలించేందుకు దుండగులు ప్రయత్నించిన సంఘటన మండలంలోని చింతలగర్రలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిగిలిపల్లి నారాయణమ్మ రహదారిపై వెళుతుండగా వెనుక నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని చైన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు. దీంతో అమె కిందకు పడిపోయింది. చైన్ తెంపుకొని పరారయ్యే ప్రయత్నంలో దుండగులు కింద పడిపోయారు. ఈ క్రమంలో చైన్ తుళ్లిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యరని తెలిపారు. ఈ ఘటనలో నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వేసవిలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మహిళలు వాపోతున్నారు. రోజూ ఉదయం వాకింగ్‌కు ఇదేమార్గంలో వెళుతుంటామని ఈ ఘటనల వల్ల భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై టెక్కలి ఎస్ఐ సురేష్‌బాబు వివరణ కోరగా ద్విచక్రవాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
పులిగిలిపాడు క్వారీలో ప్రమాదం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పులిగిలిపాడు క్వారీలో అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా క్వారీలో కూలిపనులకు వెళ్లిన ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మహిళను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో క్వారీ వద్ద గాయపడిన మహిళ బంధువులు ఆందోళన చేపట్టారు. -
మంట కలిసిన మానవత్వం..
-
వైరల్ : మంట కలిసిన మానవత్వం..
సాక్షి, తిరువనంతపురం : మానవత్వం మంట కలిసింది. రద్దీగా ఉండే రోడ్డుపై ఓ 65 ఏళ్ల మహిళ ప్రమాదానికి గురైతే స్పందించే వారే కరువయ్యారు. ఆమె పక్కనుంచే చాలా వాహనాలు వెళ్తున్నా.. ఆమెకు సాయపడాలని ఎవరూ ముందుకు రాలేదు. అందులో ప్రభుత్వ అధికారుల వాహనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మానవ విలువలు ఏ స్థాయిలో పతనం అవుతున్నాయో తెలుపడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆమెకు సహాయం చేద్దామని ఓ యువకుడు ముందుకొచ్చే వరకు అక్కడున్న వారు అదో వింతలా చూశారే తప్ప స్పందించలేదు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసు వాహనం ఈ సంఘటనని గమనించి ఆ మహిళను ఆస్పత్రికి చేర్చింది. తమకు ఈ ఘటనపై ఎవరూ సమాచారం ఇవ్వలేదని, గాయపడిన మహిళ చుట్టూ జనం చేరడం చూసి, ఆమెని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదానికి కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నామని వారు వెల్లడించారు. కేరళలోని కడ్కావూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి
కేశంపేట (షాద్‌నగర్): తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో చోటుచేసుకుంది. మీనమోనిపల్లికి చెందిన ఆనెపోసల జంగయ్య, పాపమ్మ దంపతుల చిన్న కూతురు సునీత(21) కడ్తాల పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ తనను ప్రేమించాలంటూ సునీతను వేధిస్తున్నాడు. విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సునీత తల్లి ఏడాది క్రితం శివకుమార్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రుల ముందే మందలించింది. అయినా శివ తీరు మారకపోవంతో చేసేదేమీ లేక సునీత కళాశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఎటూ తోచని శివ మంగళవారం మీనమోనిపల్లికి వచ్చాడు. గ్రామంలో తల్లితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్న సునీత వద్దకు చేరుకుని వెంట తెచ్చుకున్న కత్తితో నాలుగుసార్లు పొడిచి అక్కడ నుంచి పరారయ్యడు. సునీతను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. శివకుమార్ నేరుగా ఆమన్‌గల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. -
యువతిపై కత్తితో దాడి
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రెడ్డివారిపాలెం వీధిలో భారతి(22) అనే యువతిపై కత్తితో దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగుడు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై దాడి చేసి ఆమె వద్దనున్న సెల్‌ఫోన్ లాక్కెళ్లాడు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళ పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు కోల్పోయింది. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. నెక్లెస్ రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో సువర్ణ అనే మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ రెండుకాళ్లు తెగిపడ్డాయి. బాధితురాలు అమీర్‌పేటలోని ఓ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాజ్‌భవన్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను మాజీ కార్పొరేటర్ షరీఫ్ సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి
పెదనందిపాడు: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు మీద నుంచి నడిచి వెళ్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జిల్లాలోని పెదనందిపాడు మండలం కట్రపాడులో సోమవారం జరిగింది . గ్రామానికి చెందిన రాధిక రోడ్డు పై నుంచి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ పేలుడు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం గొడుగులవీధిలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడడంతో పాటు పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయం ఓ మహిళ ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించగా సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. దాంతో ఆమె గాయపడింది. పేలుడు విన్న ఇరుగుపొరుగువారు పరుగున వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఇరుగుపొరుగున ఉన్న పది పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయమే ఇళ్లలోని వారు కూలిపనులకు వెళ్లిపోవడంతో పెను ముప్పు తప్పింది. గాయపడిన మహిళను టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది పూరిగుడిసెలు నేలమట్టం కావడంతో పేదలు సర్వస్వం కోల్పోయారు. -
కలెక్టర్ కారు ఢీ: మహిళకు గాయాలు
జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆరపేట శివారులో కరీంనగర్ కలెక్టర్ వాహనం ఢీకొనడంతో మహిళకు గాయాలయ్యాయి. మేడిపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన సాయమ్మ మెట్పల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆరపేట శివారులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కారు ఆమెను ఢీకొంది. గాయపడిన ఆమెను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు..
ఏలూరు: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలలు సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి అన్నవరం వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
దుర్గమ్మ గుడిలో పిడుగుపాటు
-
రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సదాశివపేట: మెదక్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని సదాశివపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పద్మనాభ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని(19)ని అదే ప్రాంతానికి చెందిన సతీష్ గత కొంత కాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. అతన్ని ప్రేమించేందుకు యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై కక్ష కట్టాడు. ఈ రోజు కళాశాలకు వెళ్తున్న సమయంలో అదును చూసుకొని కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు నిందితున్ని పట్టుకోవడానికి యత్నించేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల చేపడుతున్నారు. -
చెత్త కుండీలో పేలుడు
-
చెత్త కుండీలో పేలుడు
-మహిళకు తీవ్ర గాయాలు అనంతపురం: అనంతపురం పట్టణంలోని తపోవనంలో రోడ్డుపక్కన ఉన్న ఒక చెత్తకుండీలో శనివారం ఉదయం పెద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటున్న మహిళ తీవ్రంగా గాయపడింది. మహిళ చెత్త కుండీలో ప్లాస్టిక్ కవర్లకోసం వెతుకుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. అయితే పేలింది నాటు బాంబా లేక పటాసులా అనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు అవడంతో పాదచారులు ఉలిక్కపడి పరుగులు తీశారు. పోలీసులు గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొససాగుతోంది. -
కత్తులతో బెదిరించి దోపిడీ
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని బొమ్మనకల్ బైపాస్‌రోడ్డులో దుండగులు ఓ మహిళను కత్తులతో బెదిరించి మెడలోని ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. శివాజీనగర్‌కు చెందిన కుంట అంజలి బుధవారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకకు వెళుతున్న క్రమంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించారు. కత్తులతో బెదిరించి ఆమె మెడలోని 20 తులాల బంగారు ఆభరణాలను తెంపుకుని పరారయ్యారు. ఈ క్రమంలో మహిళకు గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆస్తి వివాదం: అత్తపై అల్లుడి దాడి
వెల్గటూరు: ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం చివరికి గొడ్డలితో దాడిచేసేదాకా వెళ్లింది. గొడ్డలితో అత్తను తీవ్రంగా గాయపర్చిన ఓ అల్లుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే సంఘటన కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లికి చెందిన శంకరమ్మ(50)పై అల్లుడు అంజయ్య మంగళవారం గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలుని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
అడవిపంది దాడి: మహిళకు గాయాలు
లక్ష్మీనర్సుపేట: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలం పెద్దకోట గ్రామంలో ఓ మహిళపై అడవి పంది దాడి చేసింది. గ్రామానికి చెందిన చింతాడ బుచ్చయ్య భార్య అప్పమ్మ(50) బుధవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పొదల్లో నుంచి వచ్చి ఒక్కసారిగా అడవి పంది దాడి చేసింది. అప్పమ్మ పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు చేరుకుని అడవి పంది తరిమికొట్టారు. పంది దాడిలో అప్పమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం : ఇద్దరు విద్యార్థినులు మృతి
హైదరాబాద్ : నగరంలోని కవాడిగూడలో ఆర్టీసీ బస్సు శనివారం బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి, మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను ముషిరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థినులు మరణించారు. అయితే బస్సు ఢీకొన్న ఘటనలో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ - ఆటో ఢీ: మహిళా కూలీలకు గాయాలు
ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరనంపల్లి వద్ద గురువారం ట్రాక్టర్ - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్‌స్నాచింగ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ
-
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మళ్లీ ఎలుకలు
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు మళ్లీ స్వైర విహారం చేశాయి. ఎముకల వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ చేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. గతనెలలో పసికందును ఎలుకలు తినేసిన సంఘటన మరిచి పోకముందే శుక్రవారం పాము కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఈ రోజు ఎలుకలు మహిళ చేతి వేళ్లను తినేశాయి. దాంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించారు. రోశమ్మ(40) అనే మహిళ జీజీహెచ్‌లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతోంది. శనివారం తెల్లవారుజామున ఆమెపై ఎలుకల గుంపు దాడి చేశాయి. అది గమనించిన రోగి తరపు వారు వైద్యులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు అత్యవసర చికిత్సా విభాగానికి తరలించి ఆమెకు వైద్యం చేశారు. ఈ సంఘటనతో వార్డులోని రోగులు బెంబేలెత్తుతున్నారు. కాగా అధికారుల నిర్లక్ష్యంతో ఎలుకల దాడిలో పసికందు చనిపోయిన ఘటనతో కళ్లు తెరిచిన అధికారులు ఎలుకలు పట్టేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో సుమారు 400 ఎలుకలను పట్టుకున్నారు. అయినా ఎలుకలు వస్తుండటంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. -
తలపై కొట్టి.. పుస్తెల తాడు అపహరణ
బసంత్‌నగర్: పాలు విక్రయించేందుకు వెళుతున్న ఓ మహిళపై దుండగులు దాడి చేసి ఆమె మెడలోని పుస్తెల తాడును అపహరించుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం లక్ష్మీపురం వద్ద చోటు చేసుకుంది. పాలకుర్తి గ్రామానికి చెందిన అట్ల గౌరమ్మ (60) సోమవారం ఉదయం పాలు విక్రయించేందుకు నడచి వెళుతోంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లక్ష్మీపురం సమీపంలో గౌరమ్మ తలపై కర్రతో కొట్టారు. వెంటనే ఆమె మెడలోని పుస్తెల తాడును తెంపుకుని పరారయ్యారు. గాయపడిన ఆమె రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనంతరం 108 వాహనంలో పోలీసులు బాధితురాలిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.