
చికిత్స పొందుతున్న అనంతమ్మ
యాలాల : ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన ఘటనలో ఓ ప్రయాణికురాలు గాయపడింది. ఈ సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలోని బండమీదిపల్లి గేటు సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం మహబూబ్‌నగర్ నుంచి తాండూరుకు దాదాపు 30 మంది ప్రయాణిలకుతో ఆర్టీసీ బస్సు (టీఎస్ 34 టీ 0947) బయలుదేరింది.
ఈ క్రమంలో కొడంగల్ మండలం అంగడి రాయిచూర్‌కు చెందిన అనంతమ్మ తాండూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మార్గమధ్యలో బాబా దర్గా వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలో బస్సును అదుపు చేసే క్రమంలో రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అనంతమ్మ సీటు కిందకు పడిపోవడంతో కాలు విరిగింది.
Comments
Please login to add a commentAdd a comment