
ప్రతీకాత్మక చిత్రం
మహబూబాబాద్ రూరల్ : పట్టణంలోని మిల్ట్రీ ఆస్పత్రి గల్లీలో నివసిస్తున్న వివాహిత చామకూరి స్వరూపపై ఆడపడుచు భర్త గట్టు రమేష్ అలియాస్ బబ్లూ మంగళవారం హత్యాయత్నానికి పాల్ప డినట్లు కేసు నమోదైంది. టౌన్ ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్ కథనం ప్రకారం...
చామకూరి స్వరూప, ఆమె ఆడపడుచు కుటుంబం మధ్య కొంతకాలంగా భూమి, ఆస్థి తగాదాలు ఉన్నాయి. కక్షతో రమేష్ కత్తితో మంగళవారం స్వరూప ఇంటికి వెళ్లి ఆమెతో గొడవపడి కత్తితో గాయపరిచాడు. ఆమె రెండో కుమారుడు రోహిత్ కేకలు వేయగా చుట్టుపక్కల వారు చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.