
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు.
అయినా శివ తీరు మారకపోవంతో చేసేదేమీ లేక సునీత కళాశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఎటూ తోచని శివ మంగళవారం మీనమోనిపల్లికి వచ్చాడు. గ్రామంలో తల్లితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్న సునీత వద్దకు చేరుకుని వెంట తెచ్చుకున్న కత్తితో నాలుగుసార్లు పొడిచి అక్కడ నుంచి పరారయ్యడు. సునీతను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. శివకుమార్ నేరుగా ఆమన్‌గల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.