రెచ్చిపోయిన ప్రేమోన్మాది
రెచ్చిపోయిన ప్రేమోన్మాది
Published Mon, Sep 19 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
సదాశివపేట: మెదక్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని సదాశివపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పద్మనాభ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని(19)ని అదే ప్రాంతానికి చెందిన సతీష్ గత కొంత కాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. అతన్ని ప్రేమించేందుకు యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై కక్ష కట్టాడు.
ఈ రోజు కళాశాలకు వెళ్తున్న సమయంలో అదును చూసుకొని కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు నిందితున్ని పట్టుకోవడానికి యత్నించేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల చేపడుతున్నారు.
Advertisement
Advertisement