Shiv Kumar
-
వెంటిలేటర్‌పై నటుడు.. దాతల కోసం ఎదురుచూపు
ముంబై : ప్రముఖ హిందీ నటుడు శివకుమార్ వర్మ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా కూడా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆసుపత్రి ఖర్చులకు సైతం డబ్బులు సరిపోవడం లేదని, దాతల సహాయం కోసం వేచిచూస్తున్నారు. ఈ మేరకు సినీ, టీవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ నటుడు పరిస్థితిపై అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇది చాలా అత్యవసరమని, శివకుమార్ వర్మ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. శివకుమార్ వర్మ పరిస్థితిపై నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్, విద్యాబాలన్ సహా పలువురు ప్రముఖులను ట్యాగ్ చేశారు. బాజీ జిందగీ కి, హల్లా బోల్ వంటి చిత్రాల్లో శివ్‌కుమార్ వర్మ నటించారు. (సన్నీ డియోల్‌కు కరోనా) AN URGENT CALL FOR HELP! #CINTAA Member Shivkumar Verma is suffering from COPD and is also suspected of COVID-19. He is in need of urgent funds for hospital expenses. We humbly urge you to please help by donating whatever you can @amitbehl @akshaykumar @TeamAkshay @iamvidyabalan pic.twitter.com/DIZYvcZaOW — CINTAA_Official (@CintaaOfficial) December 2, 2020 -
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి
కేశంపేట (షాద్‌నగర్): తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో చోటుచేసుకుంది. మీనమోనిపల్లికి చెందిన ఆనెపోసల జంగయ్య, పాపమ్మ దంపతుల చిన్న కూతురు సునీత(21) కడ్తాల పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ తనను ప్రేమించాలంటూ సునీతను వేధిస్తున్నాడు. విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సునీత తల్లి ఏడాది క్రితం శివకుమార్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రుల ముందే మందలించింది. అయినా శివ తీరు మారకపోవంతో చేసేదేమీ లేక సునీత కళాశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఎటూ తోచని శివ మంగళవారం మీనమోనిపల్లికి వచ్చాడు. గ్రామంలో తల్లితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్న సునీత వద్దకు చేరుకుని వెంట తెచ్చుకున్న కత్తితో నాలుగుసార్లు పొడిచి అక్కడ నుంచి పరారయ్యడు. సునీతను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. శివకుమార్ నేరుగా ఆమన్‌గల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. -
వాట్సాప్ రచ్చ
► కిరణ్‌బేడీపై వ్యతిరేకత ► శివకుమార్‌కు మద్దతు ► పొరబాటు జరిగినట్టు వివరణ వాట్సాప్‌లో అశ్లీల వీడియో వ్యవహారం పుదుచ్చేరిలో రచ్చకెక్కింది. తమతో సంప్రదింపులు జరపకుండా పుదుచ్చేరి సివిల్ సర్వీసు అధికారిపై గవర్నర్ చర్యలు తీసుకోవడాన్ని మంత్రులు వ్యతిరేకించే పనిలో పడ్డారు. పొరబాటున ఆ మెసేజ్ వెళ్లిందే గానీ, పని గట్టుకుని గవర్నర్‌కు పంపించ లేదంటూ శివకుమార్‌కు మద్దతుగా గళం విప్పే వారి సంఖ్య పెరిగింది. సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ప్రగతి లక్ష్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన అధికారాల మేరకు సరికొత్త సంస్కరణల బాటలో పయనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారుల్ని ఏకం చేస్తూ వాట్సాప్ గ్రూప్‌ను రూపొందించారు. సహకార సంఘా ల రిజిస్ట్రార్ శివకుమార్ నెంబరు నుంచి ఆ గ్రూప్‌లోకి వెళ్లిన ఓ మెసేజ్ పెద్ద దుమారాన్నే రేపింది. అందులో అశ్లీల వీడియోలు ఉండడంతో గవర్నర్ ఆగ్రహానికి శివకుమార్ గురి కావాల్సి వచ్చింది. ఆయన్ను సీనియర్ ఎస్పీ రాజీవ్ రంజన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమాచారంతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల్లో ఆగ్రహం రేగింది. వాట్సాప్ రచ్చ: తమతో సంప్రదింపులు జరపకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీనియర్ ఎస్పీపై మంత్రులు నమశ్శివాయం, షాజహాన్, కందస్వామి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శివాలెత్తి ఉన్నారు. పుదుచ్చేరి సివిల్ సర్వీసు పరీక్షల ద్వారా ఉన్నత పదవిలో ఉన్న అధికారిపై చర్యలు తీసుకోవాలంటే, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని, అయితే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శివకుమార్‌ను తమ వెంట తీసుకెళ్లి ఉన్నారు. ఈ సమాచారంతో రాజ్‌భవన్ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. శివకుమార్‌పై ఆగమేఘాలపై కేసు నమోదు కావడంతో గవర్నర్ తీరుపై మంత్రులు శివాలెత్తే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సాగుతున్న అంతర్యుద్ధం తాజా రచ్చతో తెర మీదకు వచ్చినట్టు అయింది. గవర్నర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తే పనిలో పడ్డారు. పొరబాటు: బాధ్యత గల పదవిలో ఉన్న ఉన్నతాధికారి పనిగట్టుకుని గవర్నర్‌కు మెసేజ్ పంపించేందుకు ఆస్కారం లేదన్న విషయాన్ని పరిగణించాలని శివకుమార్‌కు మద్దతుగా గళం విప్పే వాళ్లు పుదుచ్చేరిలో ఉండడం గమనార్హం. ఓ అధికారి ఈ విషయంపై మాట్లాడుతూ శివకుమార్ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వాట్సాప్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను చూసి, తక్షణం తన ఎడమ చేతితో డిలీట్ చేయడానికి ప్రయత్నించారని, అది కాస్త పొరబాటున గ్రూప్‌కు ఫార్వార్డ్ కావడంతోనే ఈ వివాదం తలెత్తినట్టుగా పేర్కొన్నారు. జరిగిన పొరబాటును భూతద్దంలో పెట్టి మరీ రచ్చకెక్కడం శోచనీయమంటూ గవర్నర్ తీరును దుయ్యబట్టే పనిలో పడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు. అధికారాల మేరకే: తాజా రచ్చ వ్యవహారంపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ తమ మంత్రులు ఎవ్వరూ సీనియర్ ఎస్పీతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. హఠాత్తుగా ఓ అధికారిని అదుపులోకి తీసుకుని ఉన్నట్టుగా వచ్చిన సమాచారంతో తమ మంత్రులు అక్కడికి వెళ్లారేగానీ, గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో మాత్రం కాదన్నారు. గవర్నర్ తన అధికారాల మేరకు పనిచేస్తున్నారని, ఇక, తాము తమకున్న అధికారాల మేరకు పనిచేస్తున్నామంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఏ పాటిదో స్పష్టం అవుతోంది. -
ఉబర్ రేప్ కేసు; డ్రైవర్‌కు జీవిత ఖైదు
-
ఉబర్ రేప్ కేసు; డ్రైవర్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్(25)పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఉబర్ కారు డ్రైవర్ శివకుమార్ యాదవ్(32)కు జీవిత ఖైదు విధించారు. మంగళవారం ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. గత నెల 21న శివకుమార్‌ను దోషిగా నిర్దారించిన కోర్టు.. శిక్ష ఖరారును ఈ రోజుకు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబర్ 5న రాత్రి గుర్గావ్లో పనిచేసే అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చేందుకు ఉబర్ క్యాబ్ ఎక్కింది. అయితే ఇంటికి వచ్చే క్రమంలో కారు డ్రైవర్ శివకుమార్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మధురలో నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
'మా వాడు తప్పు చేసుంటే శిక్షించండి'
కడప: హైదరాబాద్ యూసుఫ్‌గూడ ఏటీఎం దోపిడీ కేసు నిందితుడు శివకుమార్ తప్పు చేసినట్టయితే కఠినంగా శిక్షించాలని అతని తల్లిదండ్రులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై శివ కుమార్ తల్లిదండ్రులు స్పందించారు. మందలించినందుకు 2006లోనే శివకుమార్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీలలిత బుధవారం ఉదయం యూసుఫ్‌గూడలోని ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా శివకుమార్ పిస్తోల్‌తో కాల్పులు జరిపి ఆమె నుంచి బంగారు గొలుసు, ఉంగరం, చెవి కమ్మలు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. దోపిడీకి పాల్పడిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి అతని నుంచి పిస్తోల్‌తో పాటు మూడు ఏటీఎం కార్డులు, బంగారు గొలుసు, చేతి ఉంగరం, ఐదు సెల్ఫోన్లు, బటన్ చాకు, హ్యాడ్ కర్చీఫ్, రూ.4,000 నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆగంతకుడు కడప జిల్లాకు చెందిన పెదపల్లి శివకుమార్‌రెడ్డి అని గుర్తించారు. -
తెలంగాణలో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నిధులివ్వండి
పధ్నాలుగో ఆర్థిక సంఘానికి ఫ్యాప్సీ విజ్ఞప్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మరిన్ని నిధులు కేటాయించాలని పధ్నాలుగో ఆర్థిక సంఘానికి పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం 3,000 మెగావాట్ల మేర ఉంటోండగా.. రాబోయే ఐదేళ్లలో ఇది 14,000 మెగావాట్ల పైచిలుకు పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో వ్యవసాయ పంపుసెట్లు, పరిశ్రమలతో పాటు రాజధాని హైదరాబాద్ నగర విద్యుత్ అవసరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్ కుమార్ రుంగ్టా తెలిపారు. మరోవైపు, వెనుకబడిన జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కూడా మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని వివరించారు. అటు, కేంద్ర పన్నుల ఆదాయాల్లో రాష్ట్రాల వాటాను సైతం 45-50%కి పెంచాలన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం అమలుకు గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక సంఘాన్ని ఫ్యాప్సీ కోరింది. -
పరిశ్రమకు మరిన్ని రాయితీలు: ఫ్యాప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న పారిశ్రామిక, ఐటీ పాలసీలను మరో 5-10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగిస్తాయని ఆశిస్తున్నట్టు ఫ్యాప్సీ తెలిపింది. అలాగే తయారీ, మౌలిక రంగానికి మరిన్ని రాయితీలు కల్పించాలని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా, వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి కోరారు. సహేతుక ధరలో తగినంత విద్యుత్ సరఫరాకు రెండు రాష్ట్రాలూ హామీ ఇవ్వాలని విన్నవించారు. కొత్త ప్రభుత్వాల ముందు సవాళ్లూ ఉన్నాయని గుర్తు చేశారు. పరిశ్రమను, వాణిజ్యాన్ని వృద్ధి చేసేందుకు ఇరు ప్రభుత్వాలతో కలిసి ఫ్యాప్సీ పనిచేస్తుందని అన్నారు. ఇక మోడీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం నిలకడగా, స్వేచ్ఛగా ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్ధీపనంగా పనిచేస్తుందని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. పాలసీలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రధానంగా దీర్ఘకాలంగా నిలిచిపోయిన విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర భారీ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని సూచించారు. -
ఫలితం అక్కడ... ప్రకంపనలిక్కడ!
= నేడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలు = కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ = ‘లోక్‌సభ’పై కేపీసీసీలో మరింత ఉత్కంఠ = అసమ్మతిని బుజ్జగించేందుకు యత్నాలు = వచ్చే నెల కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ = కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకూ అనుమతి = యడ్డిని పార్టీలోకి రప్పించుకునేలా బీజేపీ యత్నాలు = జేడీఎన్ నేతలూ గోవాలో సమాలోచనలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఆ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా పడనుంది. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే కర్ణాటక విషయంలో మున్ముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం ఖాయం. మంత్రి వర్గ విస్తరణ రాష్ర్ట మంత్రి వర్గంలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్న వారి సంఖ్య పదికి పైగానే ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు విస్తరిస్తే, అసమ్మతి తలెత్తే ప్రమాదం ఉందని అధిష్టానం ఇన్నాళ్లూ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే జాప్యం వల్ల అసమ్మతికి మరింతగా ఆజ్యం పోసినట్లవుతుందని నిర్ధారణకు వచ్చింది. కనుక ఈ నెలలోనే విస్తరణ చేపట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌లతో చర్చలు జరిపారు. విస్తరణతో పాటు కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకు కూడా అధిష్టానం సమ్మతించినట్లు సమాచారం. ఈ నెల 15న దిగ్విజయ్ సింగ్ నగరానికి రానున్నారు. ఆ సందర్భంగా మంత్రి వర్గంలో ఎవరెవరిని తీసుకోవాలో నిర్ణయించే అవకాశం ఉంది. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మాజీ మంత్రులు డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లతో పాటు నగరంలోని శాంతి నగర ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారిస్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాస్త స్వేచ్ఛ లభించే అవకాశాలున్నాయి. బీజేపీలో... నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధిస్తామని బీజేపీ గట్టి విశ్వాసంతో ఉంది. ఇదే ఊపులో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి దృష్టి సారించనుంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మరెక్కడా బీజేపీకి ఉనికి లేదు. కనుక సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను ఈ రాష్ర్టం నుంచే గెలుపొందడానికి వ్యూహ రచన చేస్తుంది. రాష్ట్రంలో మోడీ ప్రభంజనం కనబడుతోంది. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానిస్తే మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. ఆయనను తీసుకోవడానికి పార్టీలో సర్వామోదం లభించినా, యడ్యూరప్పే కాస్త బెట్టు చేస్తున్నారు. తన అనుయాయులకు కూడా పదవులు ఇవ్వాలని ఆయన షరతులు విధిస్తున్నారు. జేడీఎస్.. అంతా అనుకున్నట్లు జరిగి, యడ్యూరప్ప మళ్లీ బీజేపీ పంచన చేరితే జేడీఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోనుంది. ఇటీవల బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటినీ కాంగ్రెస్‌కు సమర్పించుకుంది. మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ మాటేమో కానీ జేడీఎస్ కొట్టుకు పోయేట్లుంది. అతి కష్టం మీద మాజీ ప్రధాని దేవెగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్న హాసన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ఎన్నికల వ్యూహంపై ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి, ఆయన సహచరులు గోవాలో మంతనాలు సాగించారు. బెల్గాంలో శుక్రవారం శాసన సభ సమావేశాలు ముగియగానే అటు నుంచి అటే గోవాకు వెళ్లారు.