ఉబర్ రేప్ కేసు; డ్రైవర్కు జీవిత ఖైదు | convicted driver gets life sentence in uber rape case | Sakshi
Sakshi News home page

ఉబర్ రేప్ కేసు; డ్రైవర్కు జీవిత ఖైదు

Published Tue, Nov 3 2015 4:09 PM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM

ఉబర్ రేప్ కేసు; డ్రైవర్కు జీవిత ఖైదు - Sakshi

ఉబర్ రేప్ కేసు; డ్రైవర్కు జీవిత ఖైదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్(25)పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఉబర్ కారు డ్రైవర్ శివకుమార్ యాదవ్(32)కు జీవిత ఖైదు విధించారు. మంగళవారం ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. గత నెల 21న శివకుమార్ను దోషిగా నిర్దారించిన కోర్టు.. శిక్ష ఖరారును ఈ రోజుకు వాయిదా వేసింది.


గత ఏడాది డిసెంబర్ 5న రాత్రి గుర్గావ్‌లో పనిచేసే అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చేందుకు ఉబర్ క్యాబ్ ఎక్కింది. అయితే ఇంటికి వచ్చే క్రమంలో కారు డ్రైవర్ శివకుమార్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మధురలో నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement