కలెక్టర్ కారు ఢీ: మహిళకు గాయాలు
Published Tue, Nov 15 2016 1:12 PM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేట శివారులో కరీంనగర్ కలెక్టర్ వాహనం ఢీకొనడంతో మహిళకు గాయాలయ్యాయి. మేడిపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన సాయమ్మ మెట్‌పల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆరపేట శివారులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కారు ఆమెను ఢీకొంది. గాయపడిన ఆమెను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement