సాక్షి,జగిత్యాలజిల్లా:జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులి తిరుగుతోందన్న ప్రచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులి జనవరి 23న గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసింది. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు.
ఎంత గాలించినా పెద్దపులి ఆచూకీ దొరకలేదు. తాజాగా పులి అడుగులు కనిపించడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. అధికారుల పరిశీలనలో అవి పులి అడుగులుగానే గుర్తించారు. పులి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి అడవుల వైపు వెళ్లినట్టుగా అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండ: ఆ సినిమా చూసి..మృతదేహం మాయం చేశాడు
Comments
Please login to add a commentAdd a comment