కాలువలోకి దూసుకెళ్లిన కారు..
Published Thu, Oct 27 2016 4:18 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
ఏలూరు: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలలు సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి అన్నవరం వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement