
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి
గోవిందరావుపేట వరంగల్ : తునికాకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పస్రా అభ్యుదయ కాలనీకి చెందిన జిట్టబోయిన లక్ష్మి సమీప అటవీ ప్రాంతంలోకి తునికాకు సేకరణకు వెళ్లింది. ఈ క్రమంలో అడవి పంది ఆమెపై దాడి చేయడంతో కాలికి బలమైన గాయమైంది. ఆమె అరుపులతో సమీపంలో ఉన్న కూలీలు అక్కడికి రాగా పంది పారిపోయింది. గాయాలపాలైన లక్ష్మిని పస్రా అటవీ శాఖ అధికారులు ఆస్పత్రికి తరలించారు